ఖమ్మం

గురుకులాల సమస్యలపై రాష్టవ్య్రాప్త ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా): తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలు సమస్యల వలయాలుగా మారాయని, ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్టవ్య్రాప్తంగా దశలవారీ ఉద్యమాలు చేపట్టనున్నట్లు పిడిఎస్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రదీప్ తెలిపారు. రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల పిల్లలు, అధికారుల పిల్లలు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా, కెజిటుపిజి ఉచిత విద్య అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 520పాఠశాలల్లో ఏ ఒక్క ప్రజాప్రతినిధి పిల్లలు చేరలేదని, ఆ పాఠశాలలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో అర్థమవుతుందన్నారు. ఆర్బాటాలతో అద్దె భవనాల్లో ప్రారంభించడం, కాంట్రాక్ట్ టీచర్స్‌ను నియమించడం, పిల్లలకు పెట్టే భోజనాన్ని సైతం కాంట్రాక్టర్లకు అప్పగించడం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారన్నారు. కనీస వసతులు కూడా కల్పించని ప్రభుత్వం నాణ్యమైన విద్యను ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. కొంతమంది విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారని, మరికొంతమంది విద్యార్థులు నాసిరకం భోజనంతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్టవ్య్రాప్త ఆందోళనకు సిద్ధం కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎం సురేష్, డివిజన్ కార్యదర్శి ఎన్ ఆజాద్, నాయకులు వెంకటేష్, వర్ధన్, ఉమ, శిరీష తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలి
ఖమ్మం(జమ్మిబండ): మారుతున్న కాలం, పెరుగుతున్న కాలుష్యం బారినుండి భావితరాలను కాపాడేందుకు మొక్కలు పెంచడమే మార్గమని ఖమ్మం పోలీస్‌కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడవ విడత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన హరితహారంలో భాగంగా గురువారం ఖమ్మం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కమిషనర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించడమే ధ్యేయంగా భావించాలన్నారు. మొక్కలు నాటినప్పుడే హరితహారం విజయవంతమైందని అనుకోవడం పొరపాటని, మొక్కలు ఎదిగి వృక్షాలుగా మారినప్పుడే లక్ష్యం సాధించినవారవుతారన్నారు. వాతావరణ కాలుష్యం బారినుండి మొక్కలు కాపాడటమే కాకుండా ఆయా ప్రాంతాలలో పచ్చదనంతో నింపుతాయన్నారు. దీంతో ఆ ప్రాంత వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి మానసిక ప్రశాంతతతో పనులు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిటి శిక్షణా కేంద్రం ఏసిపి ఇస్మాయిల్, ఏసిపిలు సంజీవ్, వెంకటేశ్వర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

హరితహారమే నిజమైన నివాళి
ఖమ్మం(గాంధీచౌక్): భారతరత్న, మాజీ రాష్టప్రతి డాక్టర్ అబ్దుల్ కలాం కన్న కలలకు హరితహరమే ఆయనకు నిజమైన నివాళి అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం రెండవ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 100మీటర్ల అబ్దుల్ కలాం చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పువ్వాడ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కలాం ప్రసంగాల సారమైన ప్రతిజ్ఞను విద్యార్థులతో చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మానవవళి మనుగడకోసం ప్రతి దేశం, రాష్ట్రాలు హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. దేశ యువత కలాం అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలన్నారు. అందుకోసం సమగ్ర కార్యచరణలను రూపొందించుకొని, దేశ రక్షణలో పాలుపంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటి మేయర్ బత్తుల మురళిప్రసాద్, కమిషనర్ బి శ్రీనివాసరావు, సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌కలాం, కార్పొరేటర్లు పగడాల నాగరాజు, కమర్తపు మురళి, బుర్రి వినయ్, పులిపాటి ప్రసాద్, సిఐ రాజిరెడ్డి, సంస్థ బాధ్యులు విజయ్, మోహన్‌రావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు డిటెన్షన్ విధానం
ఖమ్మం(మామిళ్ళగూడెం): పాఠశాల విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసింది. 5,8 తరగతుల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం మానవ వనరుల అభివృద్థిశాఖ కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్ దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యాశాఖలతో సంప్రదింపులు జరిపారు. పార్లమెంట్‌లో డిటెన్షన్‌పై బిల్లు పెడతామని అనేకసార్లు ప్రకటించారు. దీంతో విద్యాశాఖలో తీవ్ర చర్చకు వచ్చింది. డిటెన్షన్ విధానం వల్ల విద్యార్థుల్లో చదువుపట్ల శ్రద్ధ పెరుగుతుంది. విద్యను తేలికగా తీసుకునే అవకాశాలు ఉండవు. విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరౌతారు. ఉపాధ్యాయులు కూడా పాఠ్యాంశాల బోధనలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మరింత శ్రద్ద వహించే అవకాశం ఉంటుంది. పాఠశాల విద్యలో నాణ్యత పెరిగితే ఉన్నత విద్య కూడా మరింత మెరుగుపడుతుంది. పరీక్షలు తప్పితే విద్యార్థులు అదే తరగతిలో ఉండవల్సి వస్తుందని విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధచూపుతారు. డిటెన్షన్ విధానం వల్ల ఈ ఫలితాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మధ్యలో బడిమానేసిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఈ విధానం అమలైతే డ్రాపవుట్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 869ప్రాధమిక పాఠశాలల్లో 47,624మంది విద్యార్థులు, 308ప్రాధమికొన్నత పాఠశాలల్లో 28,928మంది విద్యార్థులు నమోదయ్యారు. విద్యాహక్కు చట్టం ప్రకారం తరగతి నుండి విద్యార్థులను తప్పించడం, పై తరగతులకు ప్రమోట్ కాకుండ చేయడం వీలుగాదు. దీన్ని ఆసరాగా తీసుకొని విద్యపట్ల నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే డిటెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు పార్లమెంట్‌లో బిల్లు అమోదింప చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 25రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఈ విధానానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.