గుంటూరు

ఐక్యతతో సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు): రాష్ట్రప్రభుత్వం కల్లుగీత కార్మికుల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక నగరంపాలెంలోని కె అండ్ ఎం సమావేశ మందిరంలో గౌడ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన అవగాహన సదస్సుకు గౌడ సంఘం అర్బన్‌శాఖ అధ్యక్షుడు అనుమోలు ఏడుకొండలు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనగాని మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అర్హతగల కార్మికులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్‌నారాయణ మాట్లాడుతూ గౌడ సోదరులందరూ ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో రేఖా సుధాకర్, అనంతలక్ష్మీనారాయణ, కాటూరి శ్రీనివాస్, పుల్లారావు, వాకా వెంకటేశ్వరరావు, బత్తిన శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

పథకాలు సద్వినియోగం చేసుకోండి
సత్తెనపల్లి: రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని స్థానిక మార్కెట్ యార్డు చైర్మన్ ఆళ్ళ సాంబయ్య విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని నందిగం గ్రామంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్‌సి) ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీలకు వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కో ఆర్డినేటర్ మల్లె చిన్నప్ప అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాంబయ్య మాట్లాడుతూ ఎస్టీలకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అనేక అవకాశాలను కల్పింస్తోందని అన్నారు. రాష్ట్ర కో ఆర్డినేటర్ దుర్గాప్రసాద్, జగన్నాధరావు, విశ్వనాధం, గ్రామ కో ఆర్డినేటర్ కంచర్ల ఆషాలత, శ్రీనివాసరావు, హేమలత, స్వర్ణకుమారి, కోటేశ్వరరావు, మణిరావు, గోపికృష్ణ, రత్నకుమారి, గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు.