గుంటూరు

అందరి సహకారంతో లాభాల బాటలో జూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: జూట్‌మిల్లును తెరిపించి కార్మికులు సక్రమంగా పనిచేస్తూ లాభాల బాటలో నడిపించేందుకు యాజమాన్యానికి, ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జూట్‌మిల్లు పరిరక్షణ సమితి కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. గురువారం జూట్‌మిల్లు వద్ద మిల్లులో పనిచేసేందుకు ఆసక్తిగల కార్మికులతో పరిరక్షణ సమితి సభ్యులు సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ కష్టపడే కార్మికులు కడుపుకొట్టే కంత్రీగాళ్లపైనే కనె్నర్ర చేస్తారనే విషయాన్ని గ్రహించాలన్నారు. ఆసక్తి గల కార్మికులు పెద్దసంఖ్యలో జూట్‌మిల్లు వద్దకు వచ్చి పేర్లను నమోదు చేసుకుని తమ తమ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని ఆకాంక్షించారు. రాజీనామా చేసిన కార్మికులు, బదిలీయై బయట ఉన్న కార్మికులు కూడా మిల్లు వద్దకు వచ్చి పేర్లు నమోదు చేయించుకుంటే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు పరిరక్షణ సమితి అండగా ఉంటుందన్నారు. రెండున్నర సంవత్సరాల పాటు జూట్‌మిల్లు అక్రమ లాకౌట్‌పై చేసిన విన్నపాలు, ఉద్యమాల ద్వారా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చి ఆగస్టు 16న మిల్లును పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సిపిఎం నగర కార్యదర్శి భావన్నారాయణ, ఎబ్బూరి పాండురంగ, మాల్యాద్రి, న్యాయవాది వైకె తదితరులు పాల్గొన్నారు.