గుంటూరు

మున్ముందు వ్యవసాయానికి ఎపి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కొత్తపేట): భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయం గురించి తెలుసుకునేందుకు వచ్చే అవకాశాలున్నాయని, వ్యవసాయానికి ఎపి ఆదర్శంగా నిలవబోతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల్లో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు మైక్రో ఇరిగేషన్ ద్వారా 2 లక్షల 10 వేల హెక్టార్లకు 90 శాతం సబ్సీడిపై పరికరాలను అందించడం జరిగిందని, దీనివలన 30 నుండి 60 శాతం వరకు రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారన్నారు. అలాగే హార్టికల్చర్ ద్వారా లక్షల హెక్టార్లపై పండ్లతోటలు, కూరగాయలు పండించుకునేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని, తద్వారా ఎకరానికి 2 లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ రైతాంగానికి 75 శాతం సబ్సీడిపై పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంత ప్రజలు హార్టికల్చర్ వైపు దృష్టిసారించాలని, జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. రైతురథం పేరుతో పది వేల ట్రాక్టర్లను 2 లక్షల రూపాయల సబ్సీడిపై ఇవ్వడం జరుగుతుందని, ఆయా ప్రాంతాల్లో రైతులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలు జరిగాయని, అవినీతిని పారద్రోలేందుకు తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందన్నారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాంను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన రచనలు, ప్రసంగాలు ఆయన చేసిన ప్రయోగాలు ఎనలేనివన్నారు. భారతదేశం సాంకేతికపరంగా ముందుకెళ్లేందుకు కలాం చేసిన సేవలు మరువలేనివన్నారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో అబ్దుల్‌కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ లాల్‌వజీర్, వట్టికూటి హర్షవర్ధన్, కంచర్ల శివరామయ్య, మానుకొండ శివప్రసాద్, మన్నవ కోటేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కారంపూడి ఎంపిపి పదవీ ఒప్పందంపై చర్చిస్తాం
మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల పరిషత్ అధ్యక్షుని పదవీకాలానికి సంబంధించిన ఒప్పందంపై ఎంపిటిసిలు, పార్టీ నాయకులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని జివి ఆంజనేయులు పేర్కొన్నారు. ఎంపిపి మొదటి మూడు సంవత్సరాల పదవీకాలం నాగులునాయక్ నిర్వహించాలని, తర్వాతి రెండు సంవత్సరాలు చల్లంచర్ల ప్రమీల పదవిలో కొనసాగాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా నాగులునాయక్ పదవీకాలం పూరె్తైనా ఎంపిపిగా కొనసాగుతున్న విషయాన్ని మాచర్లకు చెందిన ఎంపిటిసిలు పంగులూరు పుల్లయ్య, చావా వీరాంజనేయులు, దుర్గాప్రసాద్, ధనలక్ష్మి, నిర్మల తదితరులు గురువారం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి జివి ఆంజనేయులు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు జివి పై విధంగా స్పందించారు.