వరంగల్

ఏజెన్సీలో.. టెన్షన్ టెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవిందరావుపేట: మావోల కరపత్రాలు ఏజెన్సీలో కలకలం సృష్టించగా ... పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఏజెన్సీలో మావోలు ఉనికి కోసం తమదైన శైలిలో వ్యవహారిస్తుండగా... గతంలో మావోలకు పట్టున్న ప్రాంతాలపై పోలీసులు తమ నిఘాను కొనసాగిస్తున్నారు. అంతేకాక మాజీలను మల్లీ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి తమదైన పద్ధతిలో విచారణ జరపడంతోపాటు మాజీలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకూ మావోయిస్టు వారోత్సవాలు కొనసాగనున్న నేపథ్యంలో మండలంతోపాటు ఏజెన్సీలో ఎటువంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా ఉండేందుకు పోలీసులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టినట్టు సమాచారం. ఓవైపు జాతీయ రహదారిపై అన్ని వాహనాలను క్షుణ్ణం గా పరిశీలించి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలకు, కొంత మంది ప్రజాప్రతినిదులకు జాగ్రత్తగా ఉండాలంటూ ఫోన్ చేసి అప్రమత్తం చేసిన పోలీసులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనా మావోవారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీలో మల్లీ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.

శ్రీ కాళేశ్వరంలో సినిమా షూటింగ్
మహాదేవపూర్: పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలో దేవ్ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘ఓరుగల్లు బిడ్డ’ చిత్రం షూటింగ్‌ను గురువారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెరకెక్కించడమే సినిమా ముఖ్య ఉద్దేశమని, చిన్న చిన్న సినిమాలను బతికించి ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలని సినిమా డైరెక్టర్ ఉప్పల దేవేందర్ కోరారు. కమెడియన్స్ ఫిష్ వెంకట్, కుమార్ తొలి డైలాగ్ ‘ఎవడురా ఓరుగల్లు బిడ్డా’ అనడంతో ఎమ్మెల్యే క్లాప్ కొట్టారు. కాళేశ్వరం సర్పంచ్ మాంగాని మాధవి, మంథని సర్పంచ్ పుట్ట శైలజ, ఎంపిపి వసంత-మోహన్ రెడ్డి, జడ్పీటిసి హసీనా భాను, ఇఓ బుర్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ధర్మకర్తలు అశోక్, అడప సమ్మయ్య, రాంనారాయణ గౌడ్, తదితరులు ఉన్నారు.

పేకాటశిబిరంపై పోలీసుల దాడి
కాటారం: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపునకు పోలీసు యంత్రాంగం భారీగా స్పందిస్తోందీ. కాటారం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిన్న మొన్నటి వరకు గుట్కా, గుడుంబా తయారీ, రవాణాపై ఉక్కుపాదం మోపగా, నేడు పేకాట శిభిరంపై ముప్పేట దాడి చేశారు. కాటారం మండలంలోని చింతకాని గ్రామ నడిబొడ్డున ఆటోల అడ్డా సమీపంలో పేకాట శిభిరంపై గురువారం దాడి చేశారు. ఆటోల ఆడ్డా వేనుకాల గల కుమ్మరి రాజయ్య ఇంటి వెనుకాల చెట్టు కింద పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్ళను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలబోయిన కిరణ్ తెలిపారు. పేకాట ఆడుతున్న పెండ్యాల నాగరాజు, అరిగెల సంతోష్, అయిలపురం కిరణ్, శివకేశవ్, అయిలపురం వెంకటేశ్, సీహెచ్ నగేష్, తడండ్ల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ కిరణ్ వివరించారు. కాగా మిగితా సభ్యులు తోట శ్రావణ్, హరి, కేశవ్, దక్షిణాది స్వామి, కుమ్మరి స్వామి, రాజబాపులు పరారయ్యారని ఆయన పేర్కొన్నారు. పేకాట శిభిరంలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, ఐదుగురు పరారయ్యారని తెలిపారు. కాగా పేకాట శిభిరంలో ఐదు మొబైల్ సెల్ ఫోన్లు, రెండు బైకులు, రూ.లు 4,100 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏఎస్‌ఐ రాధాక్రిష్ణ, హెడ్ కానిస్టేబుళ్ళు రవూఫ్, సుదర్శన్, కానిస్టేబుల్ శ్రీ్ధర్, హోంగార్డు తిరుపతి పాల్గొన్నారు. కాగా పేకాటశ్పిరంలో అత్యంత చురుకైన పాత్ర పోషించిన కానిస్టేబుళ్ళను ఎస్‌ఐ కిరణ్ అభినందించారు.
నాలాలపై ఎలాంటి నిర్మాణాలు వద్దు
నక్కలగుట్ట: నగర పాలక సంస్థ పరిధిలో గల నాలాలపై అనుమతి లేకుండా అ క్రమ కట్టడాలను చేపడితే కూల్చివేస్తామని నగర పాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రవి హెచ్చరించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గత సంవత్సరం తలెత్తిన ముంపు దృష్ట్యా నాళాలలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ, నాళాలపై ఆక్రమణకు పాల్పడి నిర్మించిన కట్టడాలను గురువారం కూల్చివేశారు. నగరంలోని కిషన్‌పుర ప్రాంతంలో నాళాలను మట్టితో చదునుచేసి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను బల్దియా అధకారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ నాళాలను ఆనుకుని ఉన్న బఫర్ జోన్లలో ఉన్న భూములలో నిర్మాణాలు చేసే వారికి నగర పాలక సంస్థ ఎలాంటి అనుమతులను ఇవ్వదని తెలిపారు. కొంత మంది కబ్జాదారులు నాళాలను కబ్జాచేసి ఆ భూమిని వారి భూమిగా చూపించడం తగదని ఎసిపి పేర్కొన్నారు. నాళాలపై అక్రమంగా కట్టడాలు నిర్మిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విఆర్‌ఓ సుధాకర్, టిపిఎస్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంస్మ‘రణాని’కి సిద్ధం!

కాటారం: మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు సర్వం సన్నద్ధ చేసుకుంటున్నట్లు విశదమవుతోంది. నాటి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని తూర్పు దండకారణ్యంలోని మండలాలు. నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహా అరణ్యాలలో మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలనే వేదికగా చేసుకొని, తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోందీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు కర పత్రాలు వెలిసిన విషయం సంచలనం కలిగించింది. నక్సల్స్ ఉద్యమ నిర్మాత, భారత విప్లవ పార్టీల పితామహుడు చారుమజుందార్ 1977 జులైలో మృతి చెందగా, ఆనాటి నుంచి మావోయిస్టులు పార్టీ అమరుల స్మారకార్థం జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గత కొంత కాలంగా స్థబ్దంగా ఉన్న మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గోచరిస్తుంది. ఈ నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటీవల జాతీయ రహదారిపై మావోల కరపత్రాలు వెలిసాయి. వాటిని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. మావోయిస్టు సానుభూతిపరులు ఎవరైనా ఈ చర్యకు పాల్పడి ఉంటారోనని పోలీసులు భావిస్తున్నారు. పూర్వ కరీంనగర్ జిల్లా తూర్పు దండకారణ్యంలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాలతో పాటు ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపురం, పస్రా తదితర మండలాలలో పూర్తిగా అడవులు విస్తరించి ఉండడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు ఎంచుకుంటున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అడుగడుగునా పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. జిల్లా కేంద్ర పోలీసు బలగాలతో పాటు సీఆర్‌పిఎఫ్ జవాన్ల బెటాలియన్‌లు, ప్రత్యేక పోలీసు బలగాలు తూర్పు ఆడవులను తూర్పార పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వస్తున్నట్లు తెలుస్తోందీ. పోలీసులు అప్రమత్తమై నిఘాను తీవ్రతరం చేశారు. ముందస్తుగా కరపత్రాల ప్రచారానికి తెర లేపిన మావోయిస్టుల చర్యను పరిగణనలోకి తీసుకున్న పోలీసు ఉన్నతాధికార యంత్రాంగం మావోయిస్టుల చర్యలను తిప్పికొట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మారుమూల అటవీ మండలాలల్లో నిత్యం పోలీసుల కూంబింగ్‌లు, వాహనాల తనిఖీలతో ఈ ప్రాంతంలో ఎప్పుడేమి జరుగుతుందోననే భయాందోళనలలో ప్రజలు బతుకుకొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలలో ఏక్కడా ఏలాంటి సంఘటనలు జరగకుండా తమదైన రీతిలో చర్యలు చేపట్టినట్లు కాటారం సబ్ డివిజనల్ పోలీసు డిఎస్పీ కెఆర్‌కె ప్రసాద్‌రావు తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌ఘ్ఢ్ సరిహద్దు ప్రాంతాలపై పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో తమ సిబ్బంది అప్రమత్తమై ఉన్నారని పేర్కొన్నారు. మరో ప్రక్క ఇప్పటికే మావోయిస్టుల నుంచి ముప్పు ఉందని భావించిన ప్రజా ప్రతినిధులకు పోలీసులు నోటిసులు జారీ చేసి, నివాసిత ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. తమ అనుమతి లేనిది అటవీ మండలాలలో ప్రజా ప్రతినిధులు అడుగు పెట్టవద్దని గట్టిగానే పోలీసుల నుంచి ఆదేశాలు అందాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాల కాలంలో క్షణ క్షణం గండంగా కాలం గడపాల్సి వస్తుందని కొందరు ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. వానలు కురుస్తుండటంతో అటవీ మండలాల ప్రజలకు రవాణా సదుపాయాలు కరువు కాగా మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దండకారణ్యంలో పోలీసు బృందాలు సైతం సంచరిస్తుండటంతో , ముందు నుయ్యి, వెనుక గొయ్యి లాగా తయారైందని పల్లెల్లోని ప్రజానీకం భయం గుప్పిట్లో బతుకు కొన సా..గిస్తున్నారు.
ఇనె్సంటివ్ స్కీమ్ గడువు 31
మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను ప్రొత్సహించాలన్న ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఇన్ సెంటివ్ స్కీమ్ అర్హత కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ గౌడాట్ ఇన్ పొర్టల్‌కు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా తెలిపారు. ధరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయ్యాలని అన్నారు. జిల్లాల నుండి 124మందికి హెచ్‌వోడిల నుండి నలుగురికి, సెక్రటేరియట్ నుండి నలుగురికి మొత్తం 132మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇన్‌సెంటివ్ ఇవ్వనుందని ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసిందని కలెక్టర్ తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 31జిల్లాలో క్లాస్-4, క్లాస్-3,క్లాస్-బి, క్లాస్-1 నాలుగు క్యాటగిరిలలో నలుగురికి మొత్తం 124ప్రభుత్వ ఉద్యోగాలకు ఇన్‌సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందని, వీరి ఎంపికను జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లాస్థాయి కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. జిల్లాస్థాయి ప్రొత్సహాకాలకు సంబందించి కలెక్టర్ చైర్మన్‌గా, సిపిఓ, జిల్లా కలెక్టర్ ఎంపిక చేసిన ఇద్దరు అధికారులు సభ్యులుగా, డిఆర్‌వో కన్వినర్‌గా ఉంటారు. ఈ కమిటీ పై తెలిపిన నాలుగు క్యాటగిరిలలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేసి రాష్టస్థ్రాయి కమిటీకి సిఫారసు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 124మందికి ఒక సంవత్సరం అదరపు ఇంక్రిమెంట్, సర్వీసు పుస్తకంలో అప్రిసియేషన్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయిలలో నాలుగు క్యాటగిరిలలో ఎంపిక కాబడిన వారి నుండి రాష్టస్థ్రాయి కమిటీ ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రొత్సహకాలు మొత్తం 12మంది, ఉత్తమ ఉద్యోగులకు నగదు పురస్కారంతోపాటు రాష్టస్థ్రాయి ప్రొత్సహకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్టస్థ్రాయిలలో నాలుగు క్యాటగిరిలలో ఎంపిక కాబడిన వారి నుండి మొదటిస్థానం పొందిన వారికి రూ.5లక్షల నగుదు, ద్వితీయస్థానం పొందిన వారికి రూ.3లక్షల నగదు, తృతీయస్థానం పొందిన వారికి రూ.2లక్షల నగదు చొప్పున పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ప్రొత్సహకాలకు ధరఖాస్తుచేసుకోవడానికి ట్రెజరి ద్వారా వేతనాలు పొందుతున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అర్హుడన్నారు. ఇన్‌సెంటివ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు ప్రభుత్వ విధులలో తాము నిర్వహించిన ఉత్తమ సేవలకు సంబందించి డాక్యుమెంట్లు, ఫొటోలు, ఇతర అవార్డుల వివరాలతో పాటు 500పదాలకు మించకుండా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ కోరారు.

ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం
వడ్డేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కేంద్రం సంఘం అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఉద్యోగులు, ఉపాద్యాయులు, జర్నలిస్టులు, పెన్షనర్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయం కోసం ఏర్పాటు చేయడానికి హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలోని భవనాన్ని జిల్లా ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వెల్‌నెస్ సెంటర్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లాకు మంజూరు కావడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కోసం హైదరాబాదులోని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని పరిశీలించారని పేర్కొన్నారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు వలన ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అదే విధంగా హైదరాబాదులోని ఇహెచ్‌ఎస్ అధికారులతో ప్రసూతి ఆసుపత్రి పర్యవేక్షకురాలుతో చరవాణిలో మాట్లాడి వెల్‌నెస్ సెంటర్ సేవలను సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు వల్ల ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్లు హైదరాబాదుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, హైదరాబాదు తర్వాత ప్రారంభించబోయే రెండవ వెల్‌నెస్ సెంటర్ వరంగల్ అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు ఉపేందర్‌రెడ్డి, జగన్నోహన్‌రావు, శ్యాంసుందర్, వేణుగోపాల్, రాజ్‌కుమార్, రత్నాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.