వరంగల్

గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు: విశాఖపట్నం నుంచి హైద్రాబాద్‌కు ఇండికా కారులో అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని మాటువేసి పట్టుకున్నట్లు ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ సురేష్ రాథోడ్ చెప్పారు. గూడూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. వర్ధన్నపేట మండలం రాంధన్‌నాయక్‌తండాకు చెందిన గుగులోతు వీరన్న, గుగులోతు నవీన్, వర్ధన్నపేట మండలం డిసి తండాకు చెందిన బానోతు మాల్యాలు ఒక ముఠాగా ఏర్పడి గత కొంత కాలం నుండి గంజాయి దందాను కొనసాగిస్తున్నారని తెలిపారు. విశాఖపట్నం నుండి హైద్రాబాద్‌కు 60 కేజీల గంజాయిని ఏపి 31 బిఇ 7119 నంబర్ గల ఇండికా కారులో తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు కేసముద్రం మండలం ఇనుగుర్తి సమీపంలో గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కారులో ఉన్న గుగులోతు వీరన్న, గుగులోతు నవీన్, బానోతు మాల్యాలు తప్పించుకుని పారిపోయారని అన్నారు. పెద్దవంగర మండంలోని చిన్న వంగరకు చెందిన కారు డ్రైవర్ దరావత్ రవిని అరెస్టు చేసి గంజాయితో పాటు మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పారిపోయిన నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్లు వివరించారు. సమావేశంలో ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరిండెంట్ శ్రీనివాసరావు, సిఐలు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, మాధవీలత, ఎస్సై రాజు, సిబ్బంది తీగల శ్రీను, అక్బరోద్దీన్, యు.రాజయ్య, ఎం.రాజయ్య, అశోక్, తదితరులు పాల్గొన్నారు.