మహబూబ్‌నగర్

మైనింగ్ పనులతో సింగోటం రిజర్వాయర్‌కు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్: మండలంలోని సింగోటం గ్రామంలో లక్ష్మీదేవమ్మ గుట్ట సమీపంలో జరుగుతున్న మైనింగ్ పనుల వల్ల ఎంజికెఎల్‌ఐ రిజర్వాయర్ సింగోటం శ్రీవారి సముద్రం చెరువుకు, లక్ష్మీదేవమ్మ గుట్ట దేవాలయానికి ముప్పు వాటిల్లుతుందని వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని సింగోటం గ్రామంలో నడుస్తున్న మైనింగ్ పనులను నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మైనింగ్ పనులతో రిజర్వాయర్‌కు, దేవాలయం పరిసరాలకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులున్నందున తక్షణమే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సిఎం కేసిఆర్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి పరిస్థితులను వివరించి పనులు ఆపేందుకు కృషి చేస్తానని అన్నారు. అప్పటికి పనులు ఇదేవిధంగా కొనసాగితే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంబులయ్య, సురేందర్ సింగ్, కంటె శివన్న, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.