కరీంనగర్

ప్రజల ప్రాణాల కంటే ఇసుక లారీలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: ప్రజల ప్రాణాలకంటే ఇసుక లారీలే ముఖ్యమని నేరెళ్ళ ఉదంతంతో పాలకులు స్పష్టం చేస్తున్నారని, అందుకే నేరెళ్ళ నుండే కెటిఆర్ పతనం ప్రారంభం అవుతుందని ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి.హన్మంతరావు అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలలో పర్యటించి, పోలీసు చిత్ర హింసల బాధిత కుటుంబాలను కలిసి వారి ఇబ్బందులు, బాధులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిరిసిల్లలో ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో హన్మంతరావు మాట్లాడుతూ ఇసుక లారీలు తన నియోజకవర్గంలోని ప్రజల ప్రాణాలు హరిస్తూంటే బాధితులను ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కె.తారకరామారావ పట్టించుకోవడం లేదన్నారు. బాథితులను పట్టించుకున్న ప్రతి పక్షాలను అతిగా దుయ్య బడుతున్నాడని అన్నారు. ఈ ఘటనలో బాధ్యుడైన ఎస్పీ విశ్వజిత్‌ను సస్పెండ్ చేయాలన్నారు. ఈ ఘటనలో కెటిఆర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, లారీ ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన బదనపురం భూమయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వీరికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కెసిఆర్, కెటిఆర్‌లకేనని, ప్రజలకు కాదన్నారు. అందుకే ప్రజలను చితక బాదడానికే పోలీసులకు కొత్త కొత్త వాహనాలు, బుల్లెట్ ప్రూఫ్ బండ్లు, అధిక జీతాలు ఇస్తూ, వారిని వాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్కారంతో ఉంటుందని, కెటి ఆర్‌లాగ మాట్లాడదని, అలా మాట్లాడితే కెటిఆర్ బతుకలేరన్నారు. చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. బినామి పేర్లతో ఇసుక లారీలను నడుపుతున్నారని, రోజూ వేలాది లారీలు తరలి వెలుతున్నాయని, ప్రమాదంలో దగ్ధమైన ఇసుక లారీలు ఎవరివో నెంబర్లను ఆర్టీవో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 31న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో సిరిసిల్ల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మానవతా వాదులు స్పందించాలని కోరారు. జూలై 2న లారీ ఢీకొట్టడంతో మృతి చెందిన రైతు బదనపురం భూమయ్య ఇంటికి వెళ్ళి ఇంత వరకు పరామర్శించకపోవడంపై హన్మంతరావు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అధికారుల బాధ్యత అని, రేపే ఆ కుటుంబం వద్దకు వెళ్ళి ప్రభుత్వ పరంగా అందించే సౌకర్యాలపై చర్యలు చేపట్టాలని ఫోన్‌లో ఆర్డీవో పాండురంగకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నేరెళ్ళ ఘటనపై అడ్వకేట్ల నిజనిర్ధారణ కమిటీ
కరీంనగర్ టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన నేరెళ్ళ ఘటనపై విచారణ కోసం జిల్లాకాంగ్రెస్ పార్టీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలోనిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆవిభాగ కన్వీనర్ ఒంటెల రత్నాకర్ తెలిపారు. అమాయక యువకులపై పోలీసుల పైశాచిత్వంతో బాధితులు కోలుకోలేని స్థితికి చేరగా, అధికారయంత్రాంగం మాత్రం ఇందుకు భిన్నంగా ప్రకటనలు చేస్తుండగా, దీనిపై నిజనిర్ధారణ చేసి దోషులను బహిర్గతం చేసే క్రమంలోతమపార్టీకి చెందిన 12మంది న్యాయవాదులతోకమిటీ నియమించగా, ఈనెల 30న సంఘటన జరిగిన ప్రాంతంతోపాటు బాధితుల గ్రామాల్లో బృందం పర్యటించి, వాస్తవాలు సేకరిస్తుందని చెప్పారు. గురువారం నగరంలోనిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, యువకులపై పోలీసుల పైశాచికత్వం అమానుషమని, 24గంటల్లో కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా, 60 గంటలకు పైగా తమ ఆధీనంలో ఉంచుకుని చిత్రహింసలకు గురిచేయగా, వారు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమాల పేర అధికార పగ్గాలు చేపట్టిన టిఆర్‌ఎస్ అమాయకులపై క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ, పైశాచికానందం పొందుతుందని దుయ్యబట్టారు. బాధితులకు రూ.10లక్షల పరిహారంతో పాటు ఏడాది పాటు వైద్యఖర్చులు కూడా ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలోనిజనిర్దారణ కమిటీ చైర్మన్ గంట శ్రీహరి, సభ్యులు చౌడమల్ల వీరస్వామి, పంజాల కుమారస్వామి, తునికి పవన్, కల్లెపల్లి లక్ష్మన్,బి.నర్సయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

డిసిపి వ్యాఖ్యలపై జడ్జి విచారణ
లీగల్ కరీంనగర్: పెద్దపల్లి జిల్లా డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ విజేందర్ రెడ్డి ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో కరీంనగర్ జిల్లా జడ్జి ఎ.వి.పార్థసారథి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..హైకోర్టు న్యాయవాది పి.వి.నాగమణి, బాధితుడు గట్టు కృష్ణా రావులు కేసు విషయంలో పెద్దపల్లి డిసిపి విజేందర్ రెడ్డిని సంప్రదించగా ఆయన హైకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని దీనిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ స్వీకరించిన రాష్ట్ర హైకోర్టు జరిగిన సంఘటనపై కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి గత నెల 13న ఆదేశాలు జారీ చేయగా న్యాయవాదితో పాటు బాధితుడు, పెద్దపల్లి డిసిపిని విచారించి సంబంధిత రిపోర్టును రెండు నెలలోగా హైకోర్టుకు పంపించాలని, విచారణ సమయంలో ముగ్గురు న్యాయవాదుల సహాయం తీసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ముగ్గురికి విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 29న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎదుట హాజరుకానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా సతీష్
లీగల్ కరీంనగర్: భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా కరీంనగర్ బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది గంట సతీష్ మోహన్ కుమార్‌ను నియమిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ ఎస్.రాంచందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు, ప్రధాన కార్యదర్శి రఘునందన్ రావులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తనవంతు సహకారాన్ని న్యాయవాదులకు అందిస్తానని తెలిపారు.