కరీంనగర్

ప్రకృతిని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్: ప్రకృతి బాగుంటేనే మానవులు, పశు పక్ష్యాదులు బాగుంటాయని, తద్వారా పర్యావరణం పరిరక్షించబడుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని 16, 18 వార్డుల్లో గురువారం పర్యటించిన మంత్రి ఈటల రాజేందర్, ప్రజలకు మొక్కల్ని పంపిణీ చేయడంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కల్ని నాటారు. హరితహారం సందర్భంగా వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు హరితహారంకు మద్దతుగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవడం మనచేతుల్లోనే ఉందని, గతంలో ఉన్న పర్యావరణ పరిస్థితుల్ని తిరిగి తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను విద్యార్థులు కూడా తీసుకోవాలని ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో మొక్కలు నాటాలని, హుజూరాబాద్ పట్టణాన్ని హరిత హుజూరాబాద్‌గా మార్చాలని విజ్ఞప్తి చేశారు. మొక్కలు విపరీతంగా నాటితేనే వాతావరణం చల్లబడుతుందని, తద్వారా వర్షాలు కురిసి చెరువులు నిండుతాయని, కరవు సమస్య ఉండదని, రైతులకు పంటలు బాగా పండుతాయని అన్నారు. అనంతరం మంత్రి ఈటల గుండ్ల చెరువును పరిశీలించారు. గుండ్ల చెరువు వద్ద కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. సిఎం కెసిఆర్ హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించారని, అందుకే ఇందులో అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేసి లక్ష్యాలను నిర్దేశించినట్లు వెల్లడించారు. హరితహారం ఒక్కరోజు కార్యక్రమం కాదని, ఇది నిరంతర కార్యక్రమని అన్నారు. ఖాళీ ప్రదేశమున్న ప్రతి చోటా మొక్కలు నాటాలని, ఎన్ని మొక్కలైనా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నర్సరీల్లో తగిన మొక్కలు అటవీ శాఖాధికారులు అందుబాటులో ఉంచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఓ చెన్నయ్య, నగర పంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడవెల్లి కొండల్‌రెడ్డి, జెడ్పిటిసి సరోజన, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.