కరీంనగర్

ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీణవంక: యాదవుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి ఇచ్చిన గొర్రెలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గురువారం వీణవంక మండలంలోని వల్భాపూర్, వీణవంక, హిమ్మత్‌నగర్, కోర్కల్ గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం హిమ్మత్‌నగర్ గ్రామంలో యాదవ గొర్రె కాపరులకు 21 యూనిట్లు మంజూరు కాగా, 12 యూనిట్లకు 256 గొర్రెలను పంపిణీ చేశారు. హిమ్మత్‌నగర్ గ్రామం జిల్లాలో ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైనందున గ్రామస్థులు ఐక్యతతో ముందుకు పోయి గంగాదేవిపల్లికి ఏ విధంగా పేరు వచ్చిందో ఆ గ్రామం మాదిరిగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కర్ర జయ, సింగిల్‌విండో చైర్మన్ సాదవ రెడ్డి, హుజూరాబాద్ ఆర్‌డిఓ చెన్నయ్య, ఆప్కారి సిఐ హుస్సేన్‌లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మహిళా సంఘాలు పాల్గొన్నాయి.