కరీంనగర్

జాతీయ ఎస్సీ కమిషన్ ముందు దోషిగా నిలబడ్డ ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: నేరెళ్ళ ఉదంతంలో అత్యాచారం చేసిన నేరం కన్నా ఎక్కువ దోషిగా జాతీయ ఎస్సీ కమిషన్ ముందు రాష్ట్ర ప్రభుత్వం నిలబడిందని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డా.చెరుకు సుధాకర్ అన్నారు. గురువారం సిరిసిల్లలో తెలంగాణ ఇంటి పార్టీ సమావేశం సిరిసిల్లలో నిర్వహించింది. తంగళ్ళపల్లి మండలం నేరెళ్ళలో పోలీసుల చేతిలో చిత్ర హింసలకు గురైన బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సంఘటనలో బాధితులు పోలీసుల చేతిలో పడిన బాధలు ఇబ్బందులు, అవమానాల గురించి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఇంటి పార్టీ సమావేశంలో పార్టీలోకి కొత్తగా చేరిన పలువురు కార్యకర్తలకు కండువాలు కప్పి, ఆహ్వానించారు. అనంతరం చెరకు సుధాకర్ మాట్లాడుతూ పోలీసుల ధర్డ్ డిగ్రీ ప్రయోగంలో బాధితుల పిల్లలకు అంగవైకల్యానికి గురైనా, వారి గాయాలు మానినా ఈ ఉదంతం ‘మంత్రి కెటిఆర్ మోసిన మచ్చ మాత్రం ఎప్పుడూ పూడ్చని మచ్చ’గా చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. బుధవారం జాతీయ ఎస్సీ కమిషన్ ముందు జరిగిన విచారణలో పోలీసుల అనుసరించిన తీరు బట్టబయలైందని, దీనిని కప్పి పుచ్చడానికి చేసిన ప్రయత్నాలు కమిషన్ ముందు ఫలించలేదని, అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్య కేవలం ఉమ్మడి నదీ జలాలు, జిఎస్‌టి సమస్యల పరిష్కారం కాదని, మానవ హక్కుల ఉల్లంఘన కాకుండా చూడాలని, దీనిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ స్పందన చూడాల్సి ఉందని, చర్యలపై బిజెపి విచక్షణకే వదలి వేస్తున్నామని, ప్రతిఘటించిన ప్రజలు ప్రేక్షకులు కాకుండా చూడాలన్నారు. నదులకు ఇసుకే ప్రాణ వాయువని, గత పాలకులతో ఇసుక ఆదాయాన్ని పోల్చుతూ విచక్షణా రహితంగా గుట్టలుగా ఉన్న ఇసకను కొల్లగొడుతూ, కెటిఆర్ కుటుంబం, బంధువులు ఇసుక మాఫియాగా మారి దోపిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇపుడు వందల కోట్ల ఆదాయం చూపుతూ భవిష్యత్ కాలానికి వేల కోట్ల నష్టం జరుగుతుందని, 70 వేల పుస్తకాలు చదివానంటున్న కెసిఆర్‌కు ఈ మాత్రం జ్ఞానం ఉండాలని సుధాకర్ అన్నారు. ప్రత్యేక బైపాస్‌ల నుండి ఇసుకను తరలించకుండా జనసమ్మర్దం నుండే ఇసుక లారీలు దూసుకెలుతూ, ప్రమాదాల హెచ్చరికల బోర్డులు లేకుండా నిర్లక్ష్యంతో రోజూ మనుషులను చంపుతూంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నదన్నారు. నేరెళ్ళ ఉదంతంలో చిత్ర హింసలు చూస్తే భారత దేశం సిగ్గుపడే ఒక నమూన అందించిందని, ఎస్పీ విశ్వజిత్ అహంకారిగా మారారని, హోం మంత్రి, ఎస్పీ, మంత్రులు బదురుకుని, నేరెళ్ళ బాధితులపై ఒకే మాటన ఉండి అన్యాయంపై స్పందించడం లేదన్నారు. మనుషులను, ప్రజలను, పత్రికలను సైతం బెదిరిస్తున్నారని, అందుకే తెరాసను ‘కటింగ్ ప్లేయర్ పార్టీ’గా పేరు వచ్చిందన్నారు. పాలకులు ఎవరైనా హింస జరిగినపుడు విచారం వ్యక్తం చేయడం మానవత్వమని, దీనికి భిన్నంగా రాష్ట్రంలో అమానవీయ పాలన సాగుతున్నదన్నారు. తాను తెలంగాణ ఉద్యమ సమయంలో నకిరేకల్‌లో బస్సులపై రాళ్ళు వేసి అడ్డుకుంటే ఢిల్లీలో ఉన్న కెసిఆర్ ఇలా రాళ్ళకు స్పందన రాదని, ఇందు కోసం బస్సులను కాలపెట్టి లైట్ ఎఫెక్ట్ తేవాలని తనకు ఫోన్‌లో సూచించాడని, మరి ఇపుడు రైతును ఢీకొట్టి చంపేసిన ఇసుక లారీపై ప్రజలు ‘్ధర్మాగ్రహానికి’ గురైతే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడ వీరి మాఫియాకు చెందిన ఇసుక లారీలను ముందెవరూ అడ్డుకోరాదన్న నెపంతో అమాయకులను అరెస్టు చేసి, చిత్ర హింసలకు గురి చేసి ‘రూట్ మ్యాప్’ సిద్దం చేసుకున్నారని, తెలంగాణ సాధించుకున్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. వేములఘాట్ బాధితులు పరిహారంపై భోజనాలకు పిలిచి రాజీకి యత్నించిన కెసిఆర్‌ను తిరస్కరించారని, ఇపుడు నేరెళ్ళ నుండి ఈ దిక్కార స్వరం పునరావృతం అవుతున్నదన్నారు. సున్నా 4 శాతం ఉన్న అగ్రవర్ణ పాలనను తిరస్కరించి, చైతన్యానికి మారుపేరైన సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్‌లలో నేతన్నలు, బిసిలను గెలిపించుకోవాలని, తెలంగాణలో ప్రజల హక్కుల ఉల్లంఘన నుండి విముక్తి పొందాలని, రాజకీయ పునరేకీకరణతో రాజకీయ శూన్యం నుండి తెలంగాణను బయటకు తేవాలని, తెలంగాణ ఇంటి పార్టీ అందరితో కలిసి వస్తుందని చెరుకు సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుల బుర్ర శ్రీనివాసగౌడ్, సందీప్ చౌహాన్, మల్లేశం, కసుమ విష్ణులు పాల్గొన్నారు.