రంగారెడ్డి

ఫాంహౌస్, గెస్ట్‌హౌస్‌లపై ‘సిట్’ నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్: సిట్ అధికారుల గాలింపు చర్యల వల్ల షాద్‌నగర్ సరిహద్దు ప్రాంతాలలో గల సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫాంహౌస్‌లలో మందు, విందు వంటి కార్యక్రమాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్ మండలాల పరిధిలోని గ్రామాలలో ప్రముఖ సినీనటులు, ప్రముఖుల ఫాంహౌస్‌లలో గతంలో మందు, విందులు కొనసాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల సిట్ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ ప్రాంతంలోని కొన్ని ఫాంహౌస్‌లు, ప్రముఖులకు చెందిన ఫాంహౌస్‌లతోపాటు రిసార్ట్స్, రియల్ ఎస్టేట్‌లలో ఏర్పాటుచేసిన ఫాంహౌస్‌లలో అనేకమార్లు విందు, మందు కార్యక్రమాలు ఏర్పాటుచేసి వినియోగదారులను అకర్షించేందుకు సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా సిట్ అధికారుల బృందాలు ఈ ప్రాంతాలలో సంచరించి సినీఫీల్డుకు చెందిన వారి ఫాంహౌస్‌లను సందర్శించి అ ప్రాంతంలోని ప్రజలతో విందు, మందుతోపాటు డ్రగ్స్ ఉపయోగించారా.. లేదా.. అనే విషయాలను స్పష్టంగా వివిధ కోణాల్లో సిట్ అధికారులు సమాచారం సేకరించారు. గాలింపుచర్యలు చేపట్టినందున సినీరంగంతోపాటు ప్రముఖుల ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, రిసార్ట్స్‌లలో విందులు, వినోదాలకు స్వస్తి చెప్పినందున ఈ ప్రాంతంలో మందు, విందు కార్యక్రమాలు నిలిచిపోయాయని ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ పట్టణ శివారులలో రద్దీగా ఉండటం వల్ల షాద్‌నగర్ ప్రాంతంలోని ఫాంహౌస్‌లలో విశ్రాంతితోపాటు మందులు, విందులు ఏర్పాటు చేసుకొని తిరిగి మరుసటి రోజు హైదరాబాద్‌కు వెళ్తుంటారని ఈ ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు. గతంలో విందులు, వినోదాలు ముగించుకొని అర్ధరాత్రి మూడు గంటలకు తిరిగి వెళ్తున్న పలువురు సినీ ప్రముఖుల వాహనాలను కమ్మదనం సమీపంలో దుండగులు అడ్డగించి దారిదొపిడీ చేసి దోచుకున్న సంఘటన ఈ ప్రాంతంలో సినీ ప్రముఖుల విందులు, వినోదాల జోరుకు నిదర్శనంగా నిలిచిపోతుంది. షాద్‌నగర్ సమీపంలోని కొండారెడ్డిపల్లి, కమ్మదనం, మధురాపూర్, కొండన్నగూడ, కొత్తూరు, బూర్గుల, గంట్లవెల్లి, విఠ్యాల, రాయికల్, కంసాన్‌పల్లి, పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, సిద్దాపూర్, నందిగామ, మేకగూడ, అన్నారం, హేమాజిపూర్ గ్రామ పరిధి గ్రామాలలో వ్యవసాయ పొలాలు, తోటలలో కూడా ప్రముఖులు విందులు, వినోదాల కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారని ఆరోపణలు ఉన్నాయి. సిట్ అధికారుల గాలింపు చర్యల వల్ల ఎక్కడికక్కడ వినోదాల కార్యక్రమాలు నిలిచిపోయాయి. కానీ గతంలో విందు, వినోదాలలో డ్రగ్స్ ఉపయోగించారా..లేదా అనే విషయాలను సిట్ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. వినోదాల కార్యక్రమాలలో ఎవరెవరు పాల్గొన్నారు.. ఎక్కడి నుండి వచ్చారు.. వారి పేర్లు ఏమిటి? అనే విషయాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. అధికారుల సేకరణ వల్ల సినీ ప్రముఖులతోపాటు ఈ ప్రాంత ప్రముఖుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.