రంగారెడ్డి

అక్రమ రోడ్డు పనుల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: యాలాల్ మండలం కోకట్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 52లో గల ప్రభుత్వ భూమిలోని అక్రమ రోడ్డు నిర్మాణాన్ని ఆపినట్లు తాండూర్ సబ్‌కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా తెలిపారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో బుధవారం సాయంత్రం జెసిబి యంత్రంతో ఓ ప్రైవేటు వ్యక్తి రోడ్డు వేస్తున్నది చూసి తాండూర్ డిఎస్పీ, సిఐ, యాలాల్ ఎస్‌ఐ, గనుల శాఖ ఎడిలతో కలిసి పనులను నిలిపామని జెసిబి, బైక్‌ను సీజ్ చేశామని చెప్పారు. రోడ్డు నిర్మాణం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.