విజయవాడ

మొరాయిస్తున్న ట్యాబ్‌లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్) జూలై 27: ఆధార్ బేస్డ్ మస్తరు నమోదుతో నగరం జాతీయ పురస్కారం పొందగా, కార్యనిర్వహణలో ఉత్పన్నమవుతున్న సాంకేతిక లోపాలు ఆ పురస్కార లక్ష్యాన్ని నీరుగార్చుతున్నాయి. కోట్లు ఖర్చుచేసి ఏర్పాటుచేసిన సాంకేతిక సౌకర్యాలకు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అవి అనతికాలంలోనే మరమ్మతులకు గురై మస్తరులో నెలకొంటున్న జాప్యంతో సిబ్బంది విధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయ. రాష్ట్రంలోనే తొలిసారిగా ఆధార్ బేస్డ్ మస్తరును అమలులోకి తెచ్చిన ఘనత విఎంసిదే కాగా ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో సతమతమవుతోంది కూడా విఎంసియే కావడం గమనార్హం. ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికుల మస్తరులో శానిటరీ ఇన్‌స్పెక్టర్ల అవినీతి, అక్రమాలకు చెక్ పెడదామన్న ఉద్దేశ్యంతో ఆధార్ బేస్డ్ మస్తరులో భాగంగా ప్రతి కార్మికుని ఐరిస్‌తో మస్తరు వేసే సాంకేతికను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం సాంకేతిక పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ప్రతిరోజూ మస్తరు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. మస్తరులో నెలకొన్న జాప్యంతో కార్మికులు సకాలంలో తమకు కేటాయించిన పిన్ పాయింట్‌కు చేరడంలో కూడా జాప్యమవుతూ ఇబ్బందులెదుర్కొంటున్న వైనం స్వయంగా విఎంసి కమిషనర్ జె నివాస్ పరిశీలనలో వెలుగులోకి రావడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉదయం ఆరున్నర గంటలైనా పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరుకాకుండా మస్తరు వద్దే వేచి ఉండటాన్ని గుర్తించిన నివాస్ అందుకుగల కారణాలపై విచారణ చేసిన ఆయనకు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు గాను మస్తరు ప్రక్రియలో నెలకొన్న లోపాలపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఫిర్యాదు చేయడం ఆలోచించదగిన విషయం. తక్షణమే స్పందించిన నివాస్ ఎటువంటి సాంకేతిక లోపాలు ఎదురవ్వకుండా నూతన ట్యాబ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజారోగ్యశాఖాధికారులను ఆదేశించారు. నగర పర్యటనలో భాగంగా గురువారం ఉదయం 45వ డివిజన్‌లో పర్యటించిన నివాస్ ఆధార్ బేస్ట్ మస్తరు ప్రక్రియలో లోపాలను స్వయంగా చవిచూసిన వైనం ఒకటైతే, దానినే సాకుగా చూపి శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం శోచనీయం. వాస్తవానికి నిజంగా ట్యాబ్‌లు సక్రమంగా లేకపోతే కమిషనర్ రాకముందే సంబంధిత ఉన్నతాధికారులకు తగు సమాచారం ఇవ్వకపోవడం శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పనితీరుకు అద్దం పడుతున్నాయి. అనంతరం మధురానగర్, కొబ్బరితోట, సాయిబాబా కాలనీ, బుడమేరు మధ్యకట్ట, రైల్వేస్టేషన్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన నివాస్ అధికారులకు పలు సూచనలు చేశారు. చెత్తను డంపర్ బిన్‌లోనే వేసే విధంగా చర్యలు తీసుకోవాలని, మురుగునీటి పారుదల, దోమల నిర్మూలన, యాంటి లార్వా ఆపరేషన్ వంటి చర్యలపై పరిశీలన చేసిన ఆయన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

బీహార్‌లో బిజెపి అనైతిక చర్యలు
విజయవాడ (కార్పొరేషన్): బీహార్ రాష్ట్రంలో ప్రజాసామ్యం లో బిజెపి అనైతిక చర్యలకు పాల్ప డటం గర్హనీయమని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఒక ప్రకటన లో విమర్శించారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బిజెపి వ్యతిరేకంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, బిజెపి కుట్రలో సిఎం నితీశ్ పడిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పును సమాధి చేయడం శోచనీయమన్నారు. బీహార్ మాజీ సిఎం లాలూపై వ్యక్తిగతంగా కక్ష కట్టినందువల్లనే ఎక్కువ సీట్లు ఉన్న ఆర్‌జెడిని పక్కన పెట్టి తక్కువ సీట్లు ఉన్న జెడియును ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టని విమర్శించారు. గతంలో గోవా, అరుణాచల్ ప్రదేశ్‌లలో కూడా ఇదేవిధంగా ప్రవర్తించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం రాజకీయ అనైతికతకు పాల్పడుతోందని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసమే అడ్డదారులు తొక్కుతున్న బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజులు దగ్గర్లో ఉన్నాయని ఆయన హెచ్చరించారు.

విదేశీ విద్యా పథకానికి 90మంది విద్యార్థుల ఎంపిక
ఇంద్రకీలాద్రి: ఎన్‌టిఆర్ విదేశీ విద్యా పథకం ద్వారా 90 మంది విద్యార్థులు ఎంపికైయ్యారు. పిబి సిద్ధా ర్థ కళాశాల ఆవరణలో గురువారం ఉ దయం సంక్షేమ శాఖ ద్వారా అర్హులైన బిసి, కాపు, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ అభ్యర్థులకు విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అభ్యసించేందుకు ఈ ఎంపికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కార్యదర్శి ఉషాకుమారి, బిసి సంక్షేమశాఖ డైరెక్టర్ కె హర్షవర్థన్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ రామారావు, కాపు కార్పొరేషన్ యండి అమరేందర్, బిసి సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ తనూజ రాణి, కాపు కార్పొరేషన్ చైర్మన్ పి రామనుజయనులు, తదితరులు పాల్గొన్నారు.

డివిజన్లలో సమస్యలు తీర్చండి
పటమట: తూర్పు నియోజకవర్గం పరిధిలోని టిడిపికి చెందిన కార్పొరేటర్లు తమ డివిజన్లలో సమస్య లు పరిష్కరించాలని కోరుతూ మంత్రి నారా లోకేష్ ముందు గళం విప్పారు. గురువారం ఉదయం హోటల్ డివి మానర్‌లో జరిగిన తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సందర్భంగా ప్రత్యేకంగా నారా లోకేష్ తూర్పు టిడి పి కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రెండో డివిజన్ కార్పొరేటర్ దేవినేని అపర్ణ మాట్లాడుతూ నగరంలో వున్న అన్ని డివిజన్లలో అతి పెద్ద డివిజన్ రెండో డివిజన్ అని, పుల్లేరు డ్రైన్, గుంటతిప్ప డ్రైన్, పంటకాలువ ఈ డివిజన్‌లో ప్రవహిస్తున్నందున మురుగునీరు, దోమల బెడద ఎక్కువుగా వుందన్నారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు నత్తనడకన జరుగుతున్నాయని తెలిపారు. 4వ డివిజన్ కార్పొరేటర్ దాసరి మల్లేశ్వరి మాట్లాడుతూ డివిజన్‌లో కొండ ప్రాంతం ఎక్కువని, ప్రధానంగా ఇళ్ల పట్లాల సమస్య వుందన్నారు. 6వ డివిజన్ కార్పొరేటర్ సాహెరా బాను మాట్లాడుతూ ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన పట్టాలకు సర్వహక్కులు కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. 7వ డివిజన్ కార్పొరేటర్ దోమకొండ జ్యోతి మాట్లాడుతూ డివిజన్‌లో ప్రధానంగా డ్రైనేజి, మెట్లు, పట్టాల సమస్య వుందన్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ స్ట్రామ్ వాటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని, ఖాళీ స్థలాల్లో పార్కులు అభివృద్ధి చేయాలన్నారు. 11వ డివిజన్ కార్పొరేటర్ వీరంకి డాంగేకుమారి మాట్లాడుతూ నీరుపేద కుటుంబాలవారికి ఇళ్లు కేటాయింపు, బ్యాంకర్లతో రుణాలు మంజూరు చేయించాలని కోరారు. 12 డివిజన్ కార్పొరేటర్ కర్ణా రమాదేవి మాట్లాడుతూ డివిజన్‌లో ప్రధానంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజి, సైడు డ్రైన్లు సమస్యలు వున్నాయన్నారు. 13వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ కార్పొరేటర్లకు నెలకు 2 లక్షలు వరకు ప్యాచ్ వర్కలు చేసుకునేందుకు అవకాశం ఇస్తే గుంటలు పడ్డ రోడ్లు బాగుపడతాయన్నారు. 19వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ తన డివిజన్ కొండ ప్రాంతంలో 1.30 కోట్ల వాటర్ ట్యాంకు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని కానీ కొండ ప్రాంత వలన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. 23వ డివిజన్ కార్పొరేటర్ గొరిపర్తి కృష్ణలంకలో 6 డివిజన్లు వున్నాయని గతంలో ఎన్నడూ జరగని విధంగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. 2019 నాటికి కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణ పూర్తి చేయాలని కోరారు. 3వ డివిజన్ పార్టీ అధ్యక్షులు నందిపాటి దేవానంద్ మాట్లాడుతూ 7 కోట్లతో అభివృద్ధి చేయటానికి అమోదం తెలిపిన క్రీస్తురాజుపురం రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు.

1 నుంచి దశలవారీ ఆందోళనలు
విజయవాడ: అపరిష్కృత డిమాండ్ల సాధనకై ఆగస్టు 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో దశలవారీ పోరాటాలు ప్రారంభించబోతున్నామని ఏపి మున్సిపల్ ఎంప్లారుూస్ వర్కర్స్ జెఎసి నేతలు ఆసుల రంగనాయకులు (ఏఐటియుసి), ఎ.ఉమామహేశ్వరరావు (సిఐటియు), వైవి రమణ (ఐఎన్‌టియుసి), ఎం.శివరామకృష్ణ (వైఎస్సార్‌టియుసి), కె.పోలారి (ఐఎఫ్‌టియు) తదితరులు ప్రకటించారు. 1వ తేదీ మానవహారాలు, 4వ తేదీ మూతికి నల్లగుడ్డలు కట్టి వౌన ప్రదర్శనలు, 7 నుంచి 22 వరకు విజయవాడలో రిలే దీక్షలు, 15న మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు, 22న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టబోతున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో 40వేల మంది మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు తమ ఉద్యోగులను పర్మినెంట్ చేయమని దశాబ్దాలుగా కోరుతున్నామని అన్నారు. ఒక్కో కార్మికునికి కనీస వేతనం నెలకు రూ.15వేల 432లు చెల్లించాల్సి ఉంటే కేవలం 11వేలతో సరిపెట్టుతున్నారన్నారు. గత ఐదేళ్లుగా కనీసం మాస్క్‌లు, గ్లౌజ్‌లు, సబ్బులు, నూనెలు, చెప్పులు, టవల్స్ లేవన్నారు. కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలన్నారు.

కైజాలా యాప్‌తో సురక్షిత సమాచార మార్పిడి
విజయవాడ: ప్రపంచంలో సమాచార సాంకేతిక రంగంలో అగ్రగామి సంస్థ మైక్రోసాఫ్ట్ రూపొందించిన కైజాలా యాప్‌తో వివిధ వ్యాపార సంస్థల మధ్య ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా మార్పిడి చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా స్ఫూర్తి నేపథ్యంలో తమ సంస్థ దేశంలోని నిర్మాణ, ఉత్పత్తి బీమా, ఆరోగ్య పరిరక్షణ, రిటైల్ రంగాల్లో పనిచేసే సిబ్బందికి, ఇతరులకు మొబైల్ ఫోన్ ద్వారా, డెస్క్‌టాప్ ద్వారా అవసరమైన సమాచారాన్ని అందించి, కావలసిన సమాచారం సేకరించేందుకు కైజాలా యాప్‌ను రూపొందించిందన్నారు. కైజాలా వ్యవస్థలో వ్యాపార సంస్థలే కాక ఇతరులు కూడా భాగస్వాములై నిరంతరంగా కావలసిన సమాచారాన్ని పొందవచ్చునన్నారు. సంస్థలు సర్వేలు, విశే్లషణలు, ఎన్నికలు, ఉద్యోగాలు, సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్, డెస్క్‌టాప్‌ల ద్వారా పంపించేందుకు కైజాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో మైక్రోసాఫ్ట్ కైజాలా వ్యవస్థను ఉపయోగించిన ప్రథమ రాష్టమ్రని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్ గ్రూపు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రవాసాంధ్రుల సహకారంతో రాష్ట్రంలో శ్మశానాల అభివృద్ధి, డిజిటల్ తరగతి గదులు
విజయవాడ: ప్రవాసాంధ్రుల సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో శ్మశానాల అభివృద్ధి, డిజిటల్ తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం తెలిపారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, ఎంపిడివోలు, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లతో గురువారం ఆయన సమీక్ష జరిపారు. తొలిదశలో 1500, రెండో దశలో 630 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. 70:30 నిష్పత్తిలో ప్రస్తుతం 25 శ్మశానాల అభివృద్ధి, విశాఖలో 33 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం జరుగుతున్నదని అన్నారు. తామంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అమెరికాలో జీవిస్తున్నామన్నారు. అమెరికాలో మొత్తంగా ఐదు లక్షల కుటుంబాలున్నాయని అన్నారు. తామంతా నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోను ఎన్‌ఆర్‌ఐ సెల్ కోఆర్డినేటర్లను నియమించామని వీరంతా అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారితో ప్రవాసాంధ్రులను అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా ఎన్‌ఆర్‌ఐ యాప్‌ను తీసుకువచ్చామన్నారు. జాయింట్ కమిషనర్ వరప్రసాద్, వివిధ జిల్లాల అధికారులు ప్రసంగించారు.