విజయవాడ

అట్టహాసంగా వైకాపాలోకి మల్లాది విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్: నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి వైకాపాలో చేరారు. ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జగన్ పార్టీ కండువాను విష్ణుకి కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ నాడు వైఎస్ మానవీయ కోణంలో పరిపాలన సాగించారని, నేడు బాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ దుర్మార్గంగా పరిపాలిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లతో అధికారం చేజార్చుకున్న వైకాపా రానున్న ఎన్నికల్లో పది శాతం ఓట్ల మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తపర్చారు. విజయవాడను వైకాపా కంచుకోటగా మార్చడమే తన ముందున్న లక్ష్యమని, పార్టీ పటిష్టతకు నేతలందరితో కలిసి ఐక్యంగా ముందుకు సాగనున్నట్లు విష్ణు ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైకాపా ప్లీనరీతో బాబు పాలనకు సమాధి రాయి పడిందన్నారు. గత మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఏమిచేశావో చెప్పే సత్తా నీకుందా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ నేడు తెదేపా నాయకులంతా నంద్యాలలో ఉంటే పోలీసులంతా కిర్లంపూడిలో ఉన్నారని విమర్శించారు. డబ్బుపై స్వారీ చేస్తున్న బాబు చేస్తున్న అరాచకాలను ఇక భరించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. అసలు రాజకీయ పరిజ్ఞానమంటూ లేని లోకేష్ కేవలం తన తండ్రి డబ్బును లెక్కపెట్టేందుకే సీన్‌లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని సర్వనాశనం చేయాలని బాబు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. బాబును భూస్థాపితం చేసే సమయం ఆసన్నమైందని, రాష్టమ్రంతా జగన్ రాక కోసం ఎదరుచూస్తోందన్నారు.
కార్యకర్తల అత్యుత్సాహం
మాజీ ఎమ్మెల్యే మల్లాధి విష్ణు వైకాపాలో చేరిన సందర్భంగా కార్యక్రమంలో కార్యకర్తల అత్యుత్సాహాన్ని నిలువరించడం జగన్ తరం కూడా కాలేదు. గన్నవరం ఎయిర్‌పోర్డు దగ్గర జగన్‌కు స్వాగతం పలికేందుకు నాయకులతో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఇదే సందర్భంలో జగన్‌తో చేతులు కలిపేందుకు, ఫొటోలు దిగేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారు. భారీ ర్యాలీగా గన్నవరం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి చేరుకున్న జగన్‌కు నగరంలో కూడా ఘన స్వాగతం పలికారు. సభా వేదికపైకి జగన్ చేరుకున్న సమయంలో కార్యకర్తలు భారీగా వచ్చి ఆయనతో చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తోసుకుంటూ చొచ్చుకొచ్చారు. ఇదే సమయంలో సభలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని కూడా తోసేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. పార్టీలోకి వచ్చే ప్రతి కార్యకర్త జగన్‌తో కండువా కప్పించుకుని, ఫొటో దిగేందుకు ఉత్సాహపడటంతో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. స్వయంగా జగన్ కలుగజేసుకుని సర్దిచెబుతున్నప్పటికీ కార్యకర్తలు వినిపించుకోలేదు. ఇదిలావుండగా ‘జోహర్ వంగవీటి రంగా.. జై జగన్’ నినాదాలే ఎక్కువగా వినిపించాయి. ఈ కార్యక్రమం కారణంగా నగరంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగర పార్టీ అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, పార్టీ నేత గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.