విజయవాడ

కమ్యూనిస్టుల వల్లే ఈ వెనుకబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట: నగరం అభివృద్ధి చెందకపోవటానికి కమ్యూనిస్టు పార్టీలే కారణమని, నేడు ఆ పార్టీలు ధర్నాలు చేస్తున్నా ప్రజలు రాకపోవటం అందుకేనని పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. గురువారం ఉదయం నగరంలోని హోటల్ డివి మానర్‌లో తూర్పు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకే అమరావతిని రాజధానిగా నిర్మించటం జరుగుతుందన్నారు. ఐటి రంగంలో కొత్త పాలసీలు తెచ్చి సబ్సిడీ ఇవ్వటం వలన ఐటి కంపెనీల నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. తూర్పు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలకు రూ.185 కోట్లు అందించారంటే రాష్ట్రం మొత్తం మీద డ్వాక్రా మహిళలకు రుణాలు ఎంతో అర్థం చేసుకోవాలన్నారు. పెన్షన్‌లకు రూ.6వేల కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందన్నారు. 2019 నాటికి కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. విశాఖనగరంలో 33 వేల మందికి పట్టాలు ఇవ్వటం జరిగిందని, త్వరలో నగరంలో కూడా ఇళ్లకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఎలక్ట్రికల్ పోల్స్ దీపాలు వివరాలు అందజేస్తే నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ విషయంలో ప్రజల అందించిన సహకారం అభినందనీయమన్నారు. 2014 ముందు విద్యుత్ ఎలా వుంది, మూడేళ్ల నుంచి విద్యుత్ సరఫరా ఎలా ఉందో ప్రజలకు వివరించాలన్నారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధిలిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో 50 సార్లకు పైగా పర్యటించానన్నారు. ఈ కార్యక్రంమలో ఎంపి కేశినేని నాని, జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, మేయర్ కోనేరు శ్రీ్ధర్, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ నాగుల్ మీరా, కనకదుర్గ కమిటీ ఛైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, యువ నాయకుడు దేవినేని అవినాష్, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.