కృష్ణ

న్యాయ సేవాధికార సంస్థ సేవలకు కాల్ సెంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేద ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేసేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పేద ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని న్యాయ సేవాధికార సంస్థల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా సంస్థల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యను తెలియజేస్తే వెంటనే రిజిస్టర్ చేస్తామన్నారు. అలాగే న్యాయస్థానాల్లో ఈ-కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ-కోర్టుల ద్వారా కక్షిదారులకు న్యాయ సేవలు మరింత సులభతరం కానున్నాయన్నారు. తమ కేసుల పురోగతిని ఆన్‌లైన్‌లో తెలుసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. అలాగే వాయిదా తేదీలను కూడా ఫోన్ మేసేజ్ ద్వారా తెలియజేస్తామని న్యాయమూర్తి వై లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్ పాల్గొన్నారు.