కృష్ణ

అక్రమాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతున్నాయని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని గురువారం ఆంధ్రభూమిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్‌లో జరుగుతున్న బదిలీల కౌనె్సలింగ్‌ను పరిశీలించారు. కౌనె్సలింగ్ జరుగుతున్న తీరు తెన్నులను జిల్లా విద్యా శాఖాధికారి డి దేవానందరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ కొంత మంది ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సుమారు 7వేల మంది ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టామని, ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే కౌనె్సలింగ్ నిర్వహించి బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఎటువంటి అపోహలకు తావు లేదన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమైతే అప్పటికప్పుడే డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారితో సంప్రదించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇతర జిల్లాల్లో పోలిస్తే కృష్ణాజిల్లాలో కౌనె్సలింగ్ ప్రక్రియ వేగంగా నడుస్తోందన్నారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 31వతేదీ నాటికి బదిలీలు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు ఉండాలన్న కారణంగా మండలానికి ఒకటి నుండి మూడు నాలుగు ఖాళీలను అన్‌ఫిల్డ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సంబంధిత పోస్టులను అన్‌ఫిల్డ్ చేశామని, ఈ విషయాన్ని ఉపాధ్యాయ సంఘాలు గుర్తించాలన్నారు. జెసి చంద్రుడుతో పాటు జాయింట్ కలెక్టర్-2 బి మార్కండేయులు కూడా బదిలీ కౌనె్సలింగ్ ప్రక్రియను పరిశీలించారు.