కృష్ణ

వివాదాస్పదంగా ఉపాధ్యాయ బదిలీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీ కౌనె్సలింగ్ వివాదాస్పదంగా మారుతోంది. బదిలీల్లో జిల్లా విద్యా శాఖాధికారి డి దేవానందరెడ్డి అనుసరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలను సైతం తనకు అనుకూలంగా మలుచుకుని బదిలీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్‌ఫిల్డ్ పోస్టుల విషయంలో తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బుధవారం నిర్వహించిన ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుల బదిలీల్లో అన్‌ఫిల్డ్ అయిన పోస్టులను గురువారం ఓపెన్ చేయడం వివాదాస్పదంగా మారింది. కావాలనే విద్యా శాఖాధికారి ముఖ్యమైన ఖాళీలను అన్‌ఫిల్డ్ చేసి చివరి వరుసలో ఉన్న కొంత మంది కోసం ఆన్‌లాక్ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుల బదిలీ కౌనె్సలింగ్ మొత్తాన్ని ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా జరిపిస్తుండటం మరింత వివాదంగా మారింది. నాలుగు రోజులుగా బదిలీలు జరుగుతున్నా డివైఇఓల జాడ కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు స్క్రీన్‌ల ద్వారా బదిలీలు చేపట్టాల్సి ఉంది. స్క్రీన్-1కు డిఇఓతో పాటు ఒక డివైఇఓ, ఒక ఎడి బాధ్యులు కాగా స్క్రీన్-2కి డివైఇఓ, ఎడి బాధ్యత వహించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు డివైఇఓలకు కౌనె్సలింగ్ డ్యూటీలు వేయకుండా సీనియర్ అసిస్టెంట్‌లు, హెచ్‌ఎంలతో కౌనె్సలింగ్ జరిపిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. డివిజన్ స్థాయి అధికారులను కాదని హెచ్‌ఎంలతో కౌనె్సలింగ్ నిర్వహించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. అందునా తనకు అనుకూలమైన వారితోనే డిఇఓ కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉపాధ్యాయ సంఘాల నుండి వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారమే కౌనె్సలింగ్ నిర్వసిస్తున్నామని జిల్లా విద్యా శాఖాధికారి దేవానందరెడ్డి తెలిపారు. అవగాహనా లోపంతో కొంత మంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితులు తీసుకు వస్తున్నారని పేర్కొన్నారు.