పశ్చిమగోదావరి

ఓటరుగా నమోదవ్వడం సామాజిక బాధ్యతగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : భావిభారత పౌరులైన యువత తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు విద్యార్ధులకు పిలుపునిచ్చారు. స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం నిర్వహించిన ఓటరు నమోదు అవగాహనా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 18 నుండి 21 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న యువతి యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలన్నారు. యువతీయువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాల స్థాయిలో ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో ప్రక్క ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షా 61 వేల మంది ఓటర్లుగా నమోదు చేయించుకోవాల్సి వుందని గుర్తించగా ఇందులో ఇప్పటికే 27 వేల మంది ఓటర్లుగా నమోదు అయ్యారన్నారు. మిలిగిన వారిని ఈ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా నమోదు చేయాలని నిర్ణయించామన్నారు. అందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఇంటింటికీ తిరిగి ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియను గత మూడు వారాలుగా ముమ్మరంగా నిర్వహించడం జరిగిందని అదే విధంగా జూలై నెలలో ఆదివారాలలో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కళాశాలల్లో 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటరుగా నమోదు చేసేందుకు అవసరమైన దరఖాస్తులను అందుబాటులో ఉంచామని వాటిని పూరించి సంబంధితాధికారులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నిర్మలాకుమారి, తహశీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహశీల్దార్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.