పశ్చిమగోదావరి

అవినీతికి పాల్పడితే క్రిమినల్ కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై సివిల్ కేసులతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్ల పనితీరుపై అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో చదువుకునే విద్యార్ధులకు ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు ఖచ్చితంగా నూరుశాతం అందాలని ఈ విషయంలో ఎవరైనా అధికారులు అవినీతికి అక్రమాలకు పాల్పడితే సివిల్ కేసులతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం, కాస్మొటిక్స్, తదితర సౌకర్యాలకు సంబంధించి సొమ్ములు పూర్తిస్థాయిలో విద్యార్ధులకు అందించకుండా ఆహార పదార్ధాలను సైతం పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. పేద ప్రజలు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ప్రభుత్వ హాస్టళ్లలో జాయిన్ చేస్తారని తమ పిల్లలు ఎంతో బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరుకుంటారనే భావిస్తారన్నారు. విద్యార్ధులకు అందే పౌష్టికాహారం, ఉచిత యూనిఫారం, పుస్తకాలతోపాటు వారికి అవసరమైన కాస్మొటిక్స్ కోసం వచ్చే సొమ్ముల్లో సైతం కొంతమంది హాస్టల్ సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడడం చాలా సిగ్గుచేటు అని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ తదితర సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా ఉన్నట్లు నమోదు చేస్తున్నట్లు తనకు సమాచారం వుందన్నారు. హాస్టళ్లలో ఉన్న సీట్లను పూర్తి స్థాయిలో భర్తీ కావాల్సిందేనని తప్పుడు నివేదికలు ఇస్తే సహించబోనని హెచ్చరించారు. బయోమెట్రిక్ హాజరు బట్టే జీతాలు చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సిబ్బంది సమయానికి విధులకు హాజరుకాకుండా ఆలస్యంగా వచ్చి హాజరు వేసినా అలాగే సాయంత్రం సమయం దాటకుండా ముందుగానే హాజరు వేసి వెళ్లిపోయినా ఆరోజును ఆబ్జెంట్‌గా మార్క్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు రుణాలు అందించడంలో బ్యాంకు అధికారులు సహకరించి సకాలంలో రుణాలు అందజేయాలని చెప్పారు. గత వారం నుండి బిసి కార్పొరేషన్‌కు సంబంధించి 170, ఎస్‌సి కార్పొరేషన్‌కు సంబంధించి 68, కాపు కార్పొరేషణ్‌కు సంబంధించి 12, మైనారిటీ 2, ట్రైబల్ రుణాలు 4 మాత్రమే బ్యాంకర్లు అందజేసారని రుణాలు అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం సృష్టించి కనపడుతోందని కలెక్టర్ అన్నారు. నిర్లక్ష్యాన్ని వీడి బ్యాంకర్లు త్వరితగతిన రునాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎల్‌డి ఎం సూర్యారావును ఆదేశించారు. బ్యాంకర్లు లబ్ధిదారులను ఎల్ ఐసి పాలసీలు కట్టమని, డిపాజిట్లు వేయాలని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందుతున్నాన్నారు. పేదలకు ప్రభుత్వం అందించే రుణాలు అందజేయకపోతే వారెలా అభివృద్ధి చెందుతారని ఇచ్చిన రుణాలు వారు సద్వినియోగం చేసుకుని యూనిట్లు నెలకొల్పేలా అధికారులు బ్యాంకర్లు చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్-2 షరీఫ్, ఎల్ డి ఎం సూర్యారావు, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఝాన్సీరాణి, బిసి కార్పొరేషన్ ఇడి పుష్పలత, డిసిసిబి జనరల్ మేనేజరు మాధవి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఎడి ప్రసాదరావు, జిల్లా బిసి సంక్షేమాధికారి లక్ష్మీ ప్రసాద్, మైనారిటీస్ కార్పొరేసన్ ఇడి శాస్ర్తీ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.