ప్రకాశం

రెండేళ్లలో 10లక్షల గృహాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : రాష్ట్రప్రభుత్వం రెండేళ్ల కాలంలో పేద ప్రజలకు 10 లక్షల గృహాలను నిర్మించి ఇవ్వాలనే ధ్యేయంతో ఉందని, పక్కా ప్రణాళికతో నిర్ణీత లక్ష్యాన్ని సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండే అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, గృహనిర్మాణశాఖ పిడి శ్రీనివాసరావు, ఎస్‌ఇలు శ్రీరాములు, వెంకటరెడ్డిలతో కలిసి ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం అమలుపై గృహనిర్మాణ సంస్థ, రెవెన్యూ, డ్వామా శాఖల అధికారులతో ఎండి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేదప్రజల కోసం ఏడాదికి ఐదులక్షల గృహల చొప్పున రెండేళ్లలో 10 లక్షల గృహాలు నిర్మించాల్సి ఉందన్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలుచేస్తే నిర్ణీత లక్ష్యం సాధించవచ్చని తెలిపారు. నెలకు రాష్టవ్య్రాప్తంగా కనీసం 40 వేల గృహాలు నిర్మించాల్సి ఉందన్నారు. జిల్లాలో నెలకు ఐదువేల గృహాల నిర్మాణం పూర్తి కావాలన్నారు. ప్రతి గృహనిర్మాణ ఏఇ నెలకు కనీసం 100 ఇళ్లు పూర్తిచేస్తే నిర్ణీత లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. గృహనిర్మాణ లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక, ప్రధానంగా వారి వివరాలను నమోదు చేయడంలో వెనుకబడిపోతున్నట్లు గమనించామన్నారు. వారి రేషన్‌కార్డు, జాబ్‌కార్డు, బ్యాంకుఖాతా, ఆధార్‌నెంబర్ల సేకరణలో జాప్యం జరుగుతుందన్నారు. చాలామందికి ఆధార్, జాబ్‌కార్డులు లేవని రెవెన్యూ, డ్వామా శాఖలు ప్రత్యేక దృష్టి సారించి వాటి జారీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులను నేరుగా సంప్రదించి ప్రోత్సహించాలన్నారు. దశలవారీగా పైకం సకాలంలో చెల్లింపు ఏర్పాటు చేయాలన్నారు. గృహ నిర్మాణాలను సజావుగా జియో ట్యాగింగ్ చేయాలన్నారు. గృహనిర్మాణాల మంజూరు దాదాపుగా పూర్తయినందున నిర్మాణ పనులు ముమ్మరంగా చేపట్టాలన్నారు. ఎన్‌టిఆర్ గృహనిర్మాణం 2016-17 కేంద్రప్రభుత్వ పథకం కింద జిల్లాలో 4102 గృహాలు నిర్మించాల్సి ఉండగా 2459 గృహాలు మాత్రమే మంజూరు చేసినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సామాజిక, ఆర్థిక గణాంకాల ప్రకారం జిల్లాలో 10 వేల కుటుంబాలకు ఇంకా ఇళ్లు లేవని, వారిలో 2459 మందిని మాత్రమే గుర్తించారన్నారు. మిగిలిన లబ్ధిదారులను కూడా త్వరితగతిన గుర్తించి నూటికి నూరు శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఇందుకోసం సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఇఓ ఆర్‌డిలు, గృహనిర్మాణ సంస్థ ఏఇలు బృందాలుగా ఏర్పడి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. 2016-17 ఎన్‌టిఆర్ గృహనిర్మాణం కింద ఇంకా 3745 గృహాల నిర్మాణ పనులు మొదలుకాలేదని, ఈ నెలాఖరులోగా ప్రారంభించాలన్నారు. డ్వామా నుంచి ఒకరిని సమన్వయ అధికారిగా నియమించి గృహనిర్మాణ ఏఇల నుంచి డిఇల వరకు ఉపాధి హామీ అనుసంధానంపై శిక్షణ ఇవ్వాలన్నారు. ఫ్రీ ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద ఇంకా 764 గృహాలను నిర్మించాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న గృహనిర్మాణానికి ఒక్కొక్క లబ్ధిదారుడికి ప్రభుత్వం ఆదనంగా రూ.25 వేలు మంజూరు చేస్తుందనే విషయంపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని పుల్లలచెరువు, కొమరోలు, యర్రగొండపాలెం, పొన్నలూరు తదితర ఏఇల పనితీరు సరిగా లేదని ఇకనైనా పురోగతి సాధించాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ జిల్లా ప్రగతిని వివరించారు. జిల్లాలో ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం కింద 2016-17 సంవత్సరానికి 14,368 గృహాలను కేటాయించగా 10,632 గృహాల నిర్మాణం మొదలైందన్నారు. అలాగే 2017-18 సంవత్సరానికి గాను 12,550 గృహాలు, 2018-19 సంవత్సరానికి మరో 12,550 గృహాలు కలిపి 25,100 గృహాలను కేటాయించగా 16,576 గృహాలను మంజూరు చేశామన్నారు. ఇంకా ఎన్‌టిఆర్ గ్రామీణ గృహనిర్మాణం పథకానికి 4,102 గృహాలు కేటాయించగా 2,459 గృహాలను మంజూరు చేశామని, అందులో 889 గృహాల నిర్మాణం ప్రారంభమైందన్నారు. 2016-17 సంవత్సరంలో గృహాల శంకుస్థాపన కోసం లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఈ నెల 26 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు శంకుస్థాపన వారోత్సవాలు చేపడతామన్నారు. వాటిని సెప్టెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేస్తామన్నారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి గృహాలు ఆగస్టు 10వ తేదీ నాటికి నిర్మాణ పనులు మొదలుపెట్టి అక్టోబర్ నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. జాబ్‌కార్డులు లేని లబ్ధిదారులను గుర్తించి రెండు లేదా మూడురోజుల్లో జాబ్‌కార్డులను మంజూరుచేసి వారికి 90రోజులు పనులు కల్పిస్తామన్నారు. ఈ నెలాఖరులోగా పొజిషన్ సర్ట్ఫికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.