శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బారాషాహిద్ ఘాట్ అభివృద్ధికి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ: రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రోత్సాహంతో ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న నెల్లూరు బారాషాహిద్ రొట్టెల పండుగ జరిగే ఘాట్ నిర్మాణాన్ని భక్తుల సౌకర్యార్థం మరింత వెడల్పు చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గురువారం దర్గాలోని ఘాట్ ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగకు ప్రతి ఏటా పెరుగుతున్న లక్షలాది మంది భక్తుల తాడికిని తట్టుకునేందుకు చెరువులో పుణ్యస్నానాలు అచరించేందుకు, రొట్టెలు మార్పిడికి ప్రస్తుతం ఉన్న ఘాట్ నిర్మాణం సరిపోదని భావిస్తున్నామన్నారు. చెరువులో 60 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు మేరకు కాంక్రీటు నిర్మాణం చేపడతామన్నారు. దీంతో ఏడాది పొదవునా స్వచ్ఛమైన నీటిని ఘాట్ నిర్మాణం చుట్టు రక్షణ గోడ, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో దర్గాను సందర్శించే భక్తులకు సైతం ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. అభివృద్ధి పనులన్నింటిని ఈ ఏడాది రొట్టెల పండుగకు ముందుగా పూర్తిచేసి కనీవినీ ఎరుగని రీతిలో పండుగను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిటి చాన్‌బాషా, టిడిపి నాయకులు ననే్నసాహెబ్, మైనార్టీ నాయకులు షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.