శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

తప్పు కదా.. మాస్టారూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: కోరుకున్న చోటుకు బదిలీపై వెళ్లేందుకు అయ్యవార్లు, అధికార్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బదిలీల నిబంధనలలోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఎక్కువ పాయింట్లు పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కొందరు అధికారులూ సహాయపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 20 శాతం ఇంటి అద్దె ఉండే ప్రాంతాలకు బదిలీ కావాలని పక్కదార్లను ఎంచుకుంటున్నారు. ప్రత్యేక కేటగిరి కింద ఉన్న ఉపాధ్యాయులకు ముందుగా కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. వారు కోరుకున్న పాఠశాలలు లభిస్తాయన్న ఆలోచనతో దొంగ సర్ట్ఫికెట్లు పుట్టించడానికి కూడా వెనుకాడడం లేదు. ఉపాధ్యాయుల బదిలీలో గందరగోళం కొనసాగుతోంది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి వివిధ అంశాలపై పాయింట్ల కేటాయింపు వరకు ప్రతి విషయంలో నిర్ధిష్టమైన విధానం పారదర్శకత లేక అడుగడుగునా సాంకేతిక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏప్రిల్‌లో మొదలుపెట్టిన బదిలీల ప్రక్రియ జూలై ముగుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు. మొదట 50 శాతం పనితీరు సూచికలు, వెబ్ కౌనె్సలింగ్‌తో టీచర్ల బదిలీల ప్రక్రియ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయులంతా ఆందోళన బాటపట్టారు. వందలాది మంది ఉపాధ్యాయులతో డిఇఒ కార్యాలయాన్ని ముట్టడించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి 50 శాతం పనితీరు సూచికలను 30 శాతానికి తగ్గించి, వెబ్ కౌనె్సలింగ్ రద్దుచేసి మాన్యువల్ పద్ధతిలో కౌనె్సలింగ్ నిర్వహించాలని జిఒనెం 42ను విడుదల చేసింది. ఇక్కడ నుంచి అసలు కథ మొదలయ్యింది. బదిలీల నిబంధనలలోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు ఉపాధ్యాయులు అడ్డదార్లు తొక్కుతున్నారు. కొందరు అవినీతి అధికారుల సహకారం తీసుకుని కోరుకున్న ప్రాంతం కోసం అంతా సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక కేటగిరి కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కేటగిరి కిందకు రావాలంటే 70 శాతంపైగా అంగవైకల్యం ఉండాలి. క్యాన్సర్, బైపాస్, న్యూరోసర్జరీ, కిడ్నీమార్పిడి వంటి వ్యాధులకు గురై ఉండాలి. మానసిక వైకల్యం కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులను కూడా ప్రత్యేక కేటగిరి కింద చేరుస్తారు. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు తమ పలుకుబడిని ఉపయోగించి డబ్బులు ఖర్చుపెట్టి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 40 నుంచి 50 వైకల్యం ఉన్నవారు 70 శాతం ఉన్నట్లుగాను పిల్లలకు మానసిక రోగాలు, నరాలకు సంబంధిత రోగాలు ఉన్నట్లుగా డాక్టర్ల నుంచి దొంగ సర్ట్ఫికెట్లు పొందుతున్నారు. వాటిని ఉపయోగించి మంచి స్థానాలు పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే నాల్గవ కేటగిరి కింద పాఠశాలను చేరిస్తే ఏడాదికి ఐదు పాయింట్లు వస్తాయి దీంతో వారు కోరుకున్న పాఠశాలను చేజిక్కించుకోవచ్చని ఆయా బడులను ఎలాగైనా నాల్గవ కేటగిరి కింద మార్చడానికి వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. నిజాయతీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు కొంతమంది దీని కారణంగా నష్టపోవలసి వస్తోందని వాపోతున్నారు. ఈమొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని కొందరు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
374 బదిలీ పాయింట్లపై విచారణ:డిఇఓ
374 అభ్యంతరాలను విచారించేందుకు తొమ్మిది మందితో కమిటీని నియమించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం తెలిపారు. ఈ విచారణ అధికారులుగా సీనియర్ హెడ్‌మాస్టర్లు, ఎంపిఇఒలు, డిప్యూటీఓలను కలిపి నియమించినట్లు చెప్పారు. విచారణలో తప్పని తేలితే 374 మంది బదిలీ పాయింట్లపై రాష్ట్ర మెడికల్ బోర్డుకు సిఫారసు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మెడికల్ బోర్డులో సర్ట్ఫికెట్లు నకిలీవని తేలితే సర్ట్ఫికెట్లు ఇచ్చిన వారిపై, తెచ్చిన వారిపై కేసు పెడతామని ఆయన తెలిపారు.