కర్నూల్

మోగిన నంద్యాల ఉపఎన్నిక నగారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: నంద్యాల శాసన సభ ఉప ఎన్నిక నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో నంద్యాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వ్యూహ, ప్రతివ్యూహాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తెరవెనుక ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికాబద్దంగా ముందుకు పోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతోనే ఉప ఎన్నిక అధికార కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 29 నుండి ఆగస్టు నెల 5వరకు నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. 7వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన, 9న నామినేషన్ల ఉప సంహరణ గడువును విధించారు. ఆగస్టు నెల 23వ తేదీన నంద్యాల శాసన సభ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుండగా, 28వ తేదీన ఓటర్ల లెక్కింపు జరుగునుంది. నిన్నటి వరకు అధికార, ప్రతిపక్ష పార్టీలు బాహాటంగా ఎన్నికల నగారా మోగకముందే ప్రచార పర్వాన్ని రక్తికట్టించారు. అధికార పార్టీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు తమ వంతు పాత్ర పోషించగా, ఎన్నికల నగారా మోగినప్పటి నుండి కోడ్ అమలులోకి వస్తుంది. దీంతో మంత్రులు ప్రచార పటాటోపంతో తిరిగేందుకు వీలుండదు. ప్రభుత్వ అతిథి గృహాలు తదితర సౌకర్యాలను వదులుకొని సాదా, సీదా నాయకుల వలె ప్రచారం చేయవలసి ఉంది. అటు ప్రతిపక్ష వైకాపా కూడా ఇంతవరకు రాష్టస్థ్రాయి నాయకులను నంద్యాలకు రప్పించి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నంద్యాల అసెంబ్లీ పరిధిలో అత్యధిక శాతం ముస్లిం మైనార్టీ ఓట్లు ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముస్లిం మైనార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతవరకు ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించారు. ఈ నెల 29 నుండి నామినేషన్ల పర్వం ప్రారంభమై ఆగస్టు నెల 5వ తేదీలోపు ముగుస్తుంది. నంద్యాల అసెంబ్లీ బరిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు తోడుగా కాంగ్రెస్ పార్టీ, రాయలసీమ పరిరక్షణ సమితి, ఎస్‌డిపిఐ, వామపక్షాల ఐక్య అభ్యర్థులు కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది. వీరికి తోడు చిన్నా, చితక పార్టీలు కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చెందారు. మూడు సంవత్సరాల అనంతరం తెలుగుదేశం పార్టీలో ఇమడలేక వైకాపా తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో బరిలో దిగనున్నారు. శిల్పామోహన్‌రెడ్డి గత 13 సంవత్సరాలుగా నంద్యాల అసెంబ్లీ పరిధిలో తరచు వార్డు పర్యటనలు, గ్రామాల పర్యటనలు చేస్తూ తన అనుచర వర్గాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓటమి చవిచూసిన శిల్పామోహన్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండ పది ఓట్లు ఉన్న కుటుంబాన్ని కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తూ చాపకింద నీరులా దూసుకుపోతున్నారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ అభ్యిర్థి గెలుపుకోసం మొత్తం మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నంద్యాలలో పాగ వేసి తెలుగుదేశం ఓట్ల శాతాన్ని పెంచుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నంద్యాలలో ముస్లిం మైనార్టీల ఓట్లను ఎలాగైనా తమవైపు తిప్పుకొనేందుకు అధిష్టానం ఇద్దరు నేతలుకు నామినేట్ పదవులు కట్టబెట్టింది. ఎన్‌ఎండి ఫరూక్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయగా, డా.నౌమాన్‌కు ఉర్దూ అకాడమి చైర్మన్‌గా ఎంపిక చేయడంతో ముస్లిం మైనార్టీలు టిడిపి వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే సమయంలో ముస్లిం మైనార్టీలలో మత పెద్దగా గుర్తింపు పొందిన అమీర్‌సాబ్‌ను కూడా తెలుగుదేశం పార్టీ తమ వైపు తిప్పుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే సమయంలో ఓటు బ్యాంకులో 2వ స్థానంలో ఉన్న బలిజ, కాపు వర్గీయులు అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నట్లు బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ వర్గం వారు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకొనేందుకు మంత్రి అఖిలప్రియతోపాటు ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్, ఉర్దూ అకాడమి రాష్ట్ర చైర్మన్ డా. ఎస్‌ఎండి నౌమాన్, టిడిపి నాయకులు ఎవి సుబ్బారెడ్డి, నంద్యాల ఎంపి ఎస్పీవైరెడ్డి అల్లుడు నంది గ్రూప్ ఎండి సజ్జల శ్రీ్ధర్‌రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. ఆగస్టు నెల 5వ తేదీ నుండి వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి 5 రోజుల పాటు నంద్యాలలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనపై వైకాపా అభ్యర్థి ఆశలు పెట్టుకొని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల నగారా మోగడంతో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ వాతావరనం వేడెక్కింది.
షెడ్యూల్ విడుదల
నంద్యాల: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ 29వ తేదీన వెలువడనుండగా, ఆ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఆగస్టు నెల 5వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణ ఉంటుంది. 7వ తేదీన నామినేషన్ల పరిశీలన, 9వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు విధించారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ఆగస్టు నెల 23వ తేదీన నిర్వహిస్తారు. 28వ తేదీ ఓట్లు లెక్కించి ఫలితం వెల్లడిస్తారన్నారు.