కర్నూల్

దిగువ కాలువకు రూ. 200కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు : తుంగభద్ర దిగవ కాలువ సాగునీటి సమస్యల పరిష్కారానికి రూ. 200కోట్లను త్వరలో తుంగభద్ర బోర్డుకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. మంత్రి దేవినేని గురువారం కర్నూలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్లెల్సీ సమస్య పరిష్కారానికై 2014లో సిఎం చంద్రబాబునాయుడు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసినట్లు గుర్తుచేశారు. ఆ చర్చల ఫలితం దిగువ కాలువ సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధమైందని, రూ. 200 కోట్లు ఖర్చు కానుందని తుంగభద్ర బోర్డు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు. దీన్ని పరిశీలించిన సిఎం చంద్రబాబు నిధులను త్వరగా విడుదల చేయాలని ఆదేశించారని వీలైనంత త్వరలో నిధులను బోర్డుకు అందజేస్తామని వివరించారు. ఆ తరువాత పనులు చేపట్టి శరవేగంగా పూర్తిచేసి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గుండ్రేవుల జలాశయం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అయితే అంతరాష్ట్ర సమస్యల కారణంగా జాప్యమవుతోందన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో సంప్రదింపులు నిర్వహించి అవసరమైన చర్య లు తీసుకుంటామన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు కూడా ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తిచేసి శ్రీశైలం జలాశయంలో నీరు కనీస మట్టానికి చేరగానే కెసి కాలువకు విడుదల చేస్తామన్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు జలాశయంలో నీరు నిండుగా ఉన్నప్పటికీ దిగువకు నీరు విడుదల చేయకుండా జాప్యం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. దిగువన ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే కూడా ఎగుర రాష్ట్రాలు నీరు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిండుగా ఉన్న జలాశయాలకు ఎగువ నుంచి పెద్దఎత్తున వరద నీరు వస్తే ఒక్కసారి గేట్లు తెరిచి దిగువకు విడుదల చేయడం వల్ల వరద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నది నుంచి ఆగస్టు 15వ తేదీ నాటికి శ్రీశైలం జలాశయానికి నీరు చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాశయంలో కూడా 37 టిఎంసిల నీరు చేరిందని ఇందులో నుంచి కర్నూలు తాగునీటి సమస్య పరిష్కారానికి నీరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డును కోరామని వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో తక్కువ వర్షపాతం నమోదైందని ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది భూగర్భ జలాల పెంపునకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది భూగర్భంలో 172 టిఎంసిల నీరు నిల్వ ఉందన్నారు. రాష్ట్రంలో సగటున 13.83 మీటర్ల దిగువన భూగర్భ జలాలు ఉన్నాయని, జిల్లాలో 11.67 మీటర్ల దిగువన నీరు ఉందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక మీటరు దిగువకు పడిపోయిందని ఆయన వెల్లడించారు. హంద్రీ-నీవా కాలువ వెడల్పునకు రూ. 830కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. దీని కారణంగా రాయలసీమ జిల్లాల్లో సాగునీటి సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి నది నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటి వరకూ 20టిఎంసిల నీరు అందించామని, రానున్న 4 నెలల్లో మరో వంద టిఎంసిల నీరు సరఫరా చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. దీని కారణంగా శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు కృష్ణా జలాలు అత్యధికంగా ఇవ్వడానికి వీలవుతుందని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. మంత్రితో పాటు కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి ఉన్నారు.