కర్నూల్

ఉపఎన్నిక సజావుగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్:నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికల ప్రక్రియకు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ సత్యనారాయణ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, జెసి ప్రసన్నవెంకటేష్, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక సహకారం అందించాలన్నారు. షెడ్యూల్ విడుదలైందని, నామినేషన్లను ఈ నెల 29 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకూ స్వీకరిస్తారని, 7న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. 9వ తేదీ అభ్యర్థుల ఉపసంహరణకు ఆఖరి తేదీ అన్నారు. నంద్యాల నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 2,9,612మంది ఓటర్లు ఉన్నారన్నారు. నూతనంగా 14వేల మంది ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయా దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తున్నామని అర్హత ఉంటేనే ఓటరుగా నమోదు చేస్తామన్నారు. రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి పొందాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం నాటి నుంచి ఆగస్టు 30 వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, ఎన్నికల సందర్భంగా లైసెన్స్ తుపాకులు ఉన్నవారు, సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు. సమావేశంలో సమావేశంలో సిపిఎం నేత షడ్రక్, వైకాపా నేత తోట కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మన్న, బహుజన సమాజ్ వాదీ పార్టీ నేత దండుశేషు యాదవ్, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.