తూర్పుగోదావరి

వినూత్న నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం/రాజమహేంద్రవరం: కాపు ఉద్యమనేత ముద్రగడ పాదయాత్రను అడ్డుకుని కాపు నాయకులను గృహ నిర్బంధాల్లో ఉంచడాన్ని నిరసిస్తూ గురువారం జిల్లావ్యాప్తంగా వినూత్నరీతిలో నిరసనలు వెల్లువెత్తాయ. అమలాపురంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జెఎసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నల్లా పవన్‌కుమార్, టిబికె జెఎసి కోనసీమ కన్వీనర్ కల్వకొలను తాతాజీతోపాటు అనేక మంది కాపు నాయకులను రెండవ రోజు కూడా గృహనిర్బంధంలో ఉంచడంపై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నల్లా ఇంటి అవరణలో కాపు యువకులు ముద్రగడ మాస్కులు ధరించి ఉరివేసుకుంటున్నట్టుగా ప్రదర్శన నిర్వహించి, కాపుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను చంద్రబాబు హరిస్తున్నారంటూ నినాదాలు చేశారు. ఈదశలో పవన్ ఆధ్వర్యంలో కాపు యువత రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపేందుకు ఇంటి నుండి బయటకు రావడాన్ని గుర్తించిన పోలీసులు వారిని బలవంతంగా లోపలికి పంపించివేసారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాపు యువతకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం నల్లా విష్ణు ఇంటి మేడపై ఉన్న గ్రిల్స్‌కు తాళ్లుకట్టి ముద్రగడ మాస్కులు ధరించిన కాపు యువత తమ స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ, స్వేచ్ఛలేని జీవితాలు తమకెందుకంటూ కాపు యువత ఉరేసుకుంటున్నట్టు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. అలాగే కోనసీమీ టిబికె జెఎసి కన్వీనర్ కల్వకొలను తాతాజీ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద కాపు యువకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కాపు ప్రజాప్రతినిధుల తీరుకు వ్యతిరేకంగా తాతాజీ మాట్లాడారు.
కాగా అమలాపురంలో కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణు, నల్లా పవన్, సూదా గణపతిలతోపాటు మరికొంత మందిని గృహ నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు. రాజమహేంద్రవరంలో జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, కందుల దుర్గేష్, రామినీడు మురళి, నందెపు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బాలేపల్లి మురళీధర్, ఎన్‌వి శ్రీనివాస్ తదితరుల గృహ నిర్బంధం కొనసాగింది.
కాగా గురువారం శ్రావణమాసం శుభకార్యాలు, వివాహాలు ఎక్కువగా ఉండటంతో గృహ నిర్బంధాల్లో ఉన్న కాపు నాయకులు ఇంటి నుండి బయటకు వెళ్లాలని పట్టుబట్టారు. అయతే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాపు నాయకులకు, పోలీసు అధికారులకు మధ్య ఫోన్లలో వాగ్వాదాలు జరిగాయ. చివరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మఫ్టీలో ఉన్న పోలీసులను వెంటపెట్టుకుని వివాహ కార్యక్రమాలకు హాజరైన సంఘటనలు జిల్లా వ్యాప్తంగా కనిపించాయి. కొందరు పోలీసులను తమ కార్లలో వెంట తీసుకెళ్ళారు. మరి కొంతమంది నేతలను పోలీసులు వాహనాల్లో వెంటాడారు. బయటకు వచ్చిన వెంటనే ఎక్కడికెళ్ళేదీ పోలీసులకు చెప్పకుండా కదలడానికి వీల్లేదన్నట్టుగా పోలీసులు వివరాలు తెలుసుకుని వాహనాల్లో వెంటాడ్డం కన్పించింది.
ఆగస్టు 3నుంచి పాదయాత్ర
కావాలనే కాపులను పోలీసు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు:ముద్రగడ
ప్రత్తిపాడు: ఆగస్టు 2వరకు తనను గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్టు అధికార్లు ప్రకటించినందున, 3వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభిస్తానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. బుధవారం ఆయన ప్రారంభించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుని 24 గంటల పాటు ఆయన్ను గృహ నిర్బంధం చేయడం తెలిసిందే! దీనితో గురువారం ఉదయం తన ఇంటి నుండి జెఎసి నాయకులతో కలిసి పాదయాత్రను ప్రారంభించి ఇంటి గేటు వద్దకు వచ్చిన ముద్రగడను పోలీసులు అడ్డుకుని వారం రోజులపాటు గృహ నిర్బంధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను చూపించారు. ఆగస్టు 2వ తేదీవరకు ముద్రగడను గృహ నిర్బంధంలో ఉంచుతున్నట్టు పోలీస్ అధికారులు ప్రకటించారు. దీనితో 3వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన ప్రకటించారు. గాంధేయ మార్గంలో తాను చేస్తున్న పాదయాత్రను అక్రమంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. కావాలని సమాజంలో కాపులను సంఘ విద్రోహులుగా ప్రచారం చేస్తున్నారన్నారు. కాపు జాతిని పోలీసు ఉక్కుపాదంతో ముఖ్యమంత్రి ఫుట్‌బాల్ ఆడుతున్నారన్నారు. 13 జిల్లాల్లో కాపు, బలిజ, ఒంటరి, తెలగ జాతి ప్రజలను ముఖ్యమంత్రి రోడ్డు మీదుకు రాకుండా అణగదొక్కుతూ వారి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. కిర్లంపూడి, ప్రత్తిపాడులో సుమారు 6 వేల మంది పోలీసులు రోడ్లపై మోహరించి కిర్లంపూడి మీదుగా ఎవరి వెళ్లకుండా తనిఖీలు చేస్తూ ఇబ్బందుకు గురి చేస్తున్నారని అన్నారు. తమ జాతి ప్రయోజనాల కోసం పాదయాత్ర కొనసాగిస్తానని, ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తానన్నారు. కాగా కిర్లంపూడిలో గురువారం కూడా బంద్ కొనసాగింది.