తూర్పుగోదావరి

గోదాములో మాయకు తరుగు మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిక్కవోలు: గోదాములో 290 బస్తాల బియ్యం ఉన్నప్పటికీ, నిల్వలు లేనట్టు రికార్డుల్లో చూపినఅధికార్ల వ్యవహారం కాంట్రాక్టరు ఫిర్యాదుతో వెలుగుచూసింది. అయతే ఇవి తరుగు బియ్యమంటూ అధికారులు సదరు వ్యవహారానికి మద్దతివ్వడం అనుమానాలను రేకెత్తిస్తోంది. మండలంలోని బలభద్రపురం ఎస్‌డబ్ల్యుసి గోదాముల్లో జరుగుతున్న అవినీతి బాగోతంపై ప్రజలు సందేహం వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని బలభద్రపురంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎస్‌డబ్ల్యుసి నిర్వహిస్తున్న గోదాముల్లో పౌరసరఫరాల అవసరాల నిమిత్తం మిల్లర్లు ఇచ్చే బియ్యాన్ని నిల్వ ఉంచుతారు. ఈ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ రేషన్ అవసరాలకు వినియోగించుకుంటుంది. గోదాముల్లో హమాలీ కాంట్రాక్టును రామచంద్రపురానికి చెందిన గురు ఈశ్వర్ ఇటీవల దక్కించుకున్నారు.
కాగా ఈ నెల 22వ తేదీన చిత్తూరు జిల్లా ఏర్పేడు పాయింటుకు గోదాముల్లోని 71 వేల బస్తాల బియ్యాన్ని రైల్వే వేగన్ల ద్వారా తరలించారు. అనంతరం గోదాములో సరుకు ఖాళీ అయ్యిందని గోదాము మేనేజర్ విజయారెడ్డి ఉన్నతాధికారులకు అధికారికంగా తెలియపరిచారు. అయితే ఆ గోదాములో సుమారు రూ.4 లక్షల విలువైన 290 బస్తాల బియ్యం ఉండడాన్ని గమనించిన కాంట్రాక్టర్ ఎస్‌డబ్ల్యుసి రీజినల్ మేనేజర్ ఐ.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో సమాచారాన్ని సివిల్ సప్లైస్ ఎండి ఎ.కృష్ణారావుకు చేరవేయగా బుధవారం రాత్రి సిబ్బందితో వచ్చిన ఆయన గోదాములను సీజ్‌చేశారు. గురువారం మధ్యాహ్నం జిల్లా అధికారులు ఇద్దరి సమక్షంలో సీలు తొలగించి గోదాములో అనధికారికంగా ఉన్న 290 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణంగా బియ్యంలో 0.2 శాతం తరుగు తీయవలసి ఉంటుందని, ఆ తరుగుకు సంబంధించిన బియ్యం మాత్రమే మిగిలాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈమేరకు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. అయితే ఎస్‌డబ్ల్యుసి, సివిల్ సప్లైస్‌కు చెందిన సిబ్బంది బియ్యాన్ని బొక్కేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సంస్థాగత దర్యాప్తు కాకుండా విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని హమాలీలు, స్థానికులు అంటున్నారు.