తూర్పుగోదావరి

ముద్రగడ బయటకు వెళ్లవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లవచ్చని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. ఆయనను అరెస్ట్ చేయలేదని చెప్పారు. ముద్రగడ జిల్లాలో ఎక్కడికైనా వ్యక్తిగత పనులపై వెళ్ళే వీలుందని తెలిపారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఎస్పీ విలేఖరులతో మాట్లాడారు. సెక్షన్ 144 క్లాస్-3 ప్రకారం ముద్రగడను అరెస్ట్ చేయలేదన్నారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ముద్రగడను గృహనిర్బంధంలో ఉంచారా? అన్న ప్రశ్నకు ఎస్పీ స్పందిస్తూ వ్యక్తిగత పనులపై ఆయనకు బయటకు వెళ్ళే వీలుంది కదా? అన్నారు. అయితే బయటకు వెళ్ళి పాదయాత్ర, నిరసన కార్యక్రమాల వంటివి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవల్సి వస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో తాజా పరిణామాల నేపథ్యంలో 59 కేసులకు సంబంధించి సుమారు 70 మందిని బైండోవర్ చేశామన్నారు. అలాగే నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయని, జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. కాగా ముద్రగడ నిర్బంధాన్ని ఆగస్టు 2వ తేదీ వరకు పొడిగిస్తూ కలెక్టర్ కార్తికేయ మిశ్రా గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ముద్రగడకు పోలీసులు నోటీసులు అందజేశారు. అంటే వారం పాటు ముద్రగడ హౌస్ అరెస్ట్‌కే పరిమితం కావల్సి ఉంది. అయితే వారం తర్వాత పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది. పాదయాత్ర చేసి తీరుతానని ముద్రగడ స్పష్టం చేస్తున్నారు. దీంతో సాయుధ బలగాలు ఉన్నంత కాలం పాదయాత్ర జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇలాగైతే ఎంతకాలం ముద్రగడ నివాసం వద్ద నిఘా ఉంచాలన్న అంశం పోలీస్ శాఖకు మింగుడుపోని విధంగా మారింది. వారం తర్వాతైనా బందోబస్తును సడలించిన పక్షంలో నిరవధిక పాదయాత్ర చేసేందుకు తాను సిద్ధమని ముద్రగడ ప్రకటించడం ఆయా వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.