చిత్తూరు

తహశీల్దార్ కార్యాలయం ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు: పెద్దతిప్పసముద్రం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువరైతు పురుగుల మందు తాగిన సంఘటన గురువారం జరిగింది. మఠం భూములు కొనుగోలు చేయడం మా తప్పా అంటూ నినాదాలు చేశారు. తాము సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములకు వన్-బి, అడంగల్ ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలుపుతునే ఉన్నారు. పిటియం మండలం, పట్టేంవాండ్లపల్లె పంచాయతీ, ఎగువకుక్కలపల్లె, దిగువకుక్కలపల్లె పరిసరా ప్రాంతాల్లో వ్యాసరాయ మఠంకు చెందిన సర్వేనెంబర్-1లో 725 ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిని కొంత మంది రైతులు కొనుగోలు చేశారు. కొంతమంది అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఈ భూములలో బోర్లు వేసి పంటలను సాగు చేస్తున్నారు. వీటిపై ఆధారపడి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఈ భూములకు బ్యాంకులకు తాకట్టు పెట్టి రుణాలు పొందారు. రుణాలు రెన్యూవల్ చేయాలని బ్యాంక్ అధికారులు ఒత్తిడి తీసుకురావడంతో వన్‌బి, అడంగల్ అవసరం ఉండడంతో, వన్‌బి, అడంగల్ కోసం మీసేవకు వెళ్లగా పై సర్వేనెంబర్ భూముల రికార్డులు లేకపోవడంతో వన్‌బి, అడంగల్ రాకపోవడంతో రెండు నెలలుగా రైతులు తహశీల్దార్ కార్యాలయం, మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం చూట్టు తిరుగుతున్నారు. పిటియం తహశీల్దార్ మాత్రం పై భూములకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్నందు వల్ల రికార్డులను వన్‌బి, అడంగల్‌ను నిలుపుదల చేశామని, పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యను పరిష్కరిస్తామని కాలయాపన చేస్తుండడంతో వారు తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న తహశీల్దార్ కార్యాలయానికి రాకపోవడంతో విసిగిచెందిన రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ పురుగుల మందు, కిరోసిన్, పెట్రోల్ తీసుకొని కార్యాలయం వద్ద ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించారు. సోముశేఖర్ అనే రైతు పురుగుల మందు తాగడంతో అతనని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం 108వాహనంలో మదనపల్లె ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.