చిత్తూరు

జెసి వాహనం ఢీకొని విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: పెద్ద చదువులు చదువుకుని తమ కష్టాలు తీరుస్తాడని ఎంతో ఆశగా ఉన్న ఆ తల్లిదండ్రులకు విధి వక్రీకరించి వారి పెద్ద కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కబళించిన సంఘటన గురువారం పుత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రమాదానికి చిత్తూరుజిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ప్రయాణిస్తున్న కారు కారణం కావడంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతి చెందిన బాలుడి కుటుంబానికి రూ. 5లక్షలు నష్టపరిహారం ఇప్పిస్తామని, బాధిత కుటుంబాన్ని జెసి ఆదుకుంటారని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. అయితే పాఠశాలకు వెళ్లిన బిడ్డ సాయంత్రం ఇంటికి వస్తాడని ఎదురు చూసిన తల్లిదండ్రులకు విగతజీవుడై రావడంతో వారి ఆవేదన వర్ణించనలవికానిదైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పుత్తూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి లోకేష్‌ను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో లోకేష్‌కు తలపైన బలమైన గాయాలవడంతో మృతి చెందాడు. జాయింట్ కలెక్టర్ గిరీష్ చిత్తూరు నుంచి పుత్తూరుకి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చరైంది. వాహనాన్ని అదుపు చేయడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. అదే సమయంలో శాంతిపురంలో నివాసం ఉంటూ కూలి నాలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న రమేష్, రాజేశ్వరిల పెద్ద కుమారుడు లోకేష్ పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతూ సాయంత్రం 5.15 గంటలకు పాఠశాల నుంచి తన సైకిల్‌పై ఇంటికి వస్తున్నాడు. మరో 50 అడుగులు వెళ్లి ఉంటే ఆ బాలుడు క్షేమంగా ఇంటికి చేరేవాడు. అయితే విధి వక్రీకరించింది. పంక్చరైన జెసి కారు బాలుడు వెళుతున్న సైకిల్‌ను ఢీకొట్టింది. సైకిల్ ఛిద్రమైంది. రోడ్డుపై పడ్డ లోకేష్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన వాహనంలోని జెసి గిరిషా తక్షణం బాలున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే కొన ఊపిరితోవున్న లోకేష్ మృతి చెందాడు. ఈ సంఘటన జెసి గిరిషాను కూడా తీవ్రంగా కలిచివేసింది. దీంతో ఆయన మృతి చెందిన లోకేష్ మృతదేహం వద్దే చాలా సేపు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న శాంతిపురం గ్రామస్థులు సంఘటనా స్థలం వద్దే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రూ. 5లక్షలు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, జెసి గిరిషా కూడా వారి కుటుంబానికి న్యాయం చేస్తారని పోలీసులు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. ఈసందర్భంగా జెసి గిరిషా తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ కారు టైర్ పేలిందని, వేగాన్ని నియంత్రించడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నిం ఫలించలేదన్నారు. బాలుడి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన చెప్పారు. ఈప్రమాదంలో జెసి ప్రయాణిస్తున్న కారు ముందు బాగం కూడా కొంతమేర దెబ్బతినింది. ఇదిలా ఉండగా రమేష్ దంపతుల పెద్ద కుమారుడు మృతి చెందడంపట్ల గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. రమేష్‌కు 7 సంవత్సరాల మరో కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.