చిత్తూరు

అలిపిరి వద్ద జెఇఓ కారు తనిఖీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో భద్రతను పటిష్టం చేయడంపై టిటిడి యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా నిషేధిత వస్తువులు తిరుమలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలకు నిషేధిత వస్తువులను వాహనాల్లో తీసుకు వెళ్లడానికి వీలు లేకుండా అలిపిరి వద్ద టిటిడి భద్రతా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం పాఠకులకు విధితమే. అయినా మద్యం, మాంసం, గుట్కా ప్యాకెట్లు ఇటీవల కాలంలో తిరుమలకు తరలివెళుతున్నాయి. చాలా కాలంగా టిటిడికి సివిఎస్‌ఓగా ఇన్‌చార్జ్ అధికారులు వ్యవహరిస్తూ వచ్చారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సివిఎస్‌ఓగా అదనపు బాధ్యతలను పర్యవేక్షిస్తూ వచ్చారు. తనిఖీ కేంద్రం వద్ద సిబ్బందిలో కూడా కొంత నిర్లక్ష్యం కొనసాగుతూ వచ్చింది. ఇటీవల సివిఎస్‌ఓగా ప్రత్యేకంగా ఎ.రవికృష్ణను నియమించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తిరుమల భద్రతకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాల్సిందేనని ఇఓ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజులు సివిఎస్‌ఓతో పలుసార్లు సమావేశమై స్పష్టం చేశారు. వాస్తవానికి అలిపిరి వద్ద ఉన్న సిబ్బంది ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. కొంత మంది టిటిడి ఉద్యోగులు, అధికారులు, పోలీసులు, పాత్రికేయులు తమ వాహనాలను తనిఖీ చేయించుకోకుండానే తిరుమలకు వెళుతున్నారు. వారు నిషేధిత వస్తువులు తీసుకెళ్లకపోయినా తనిఖీ చేయించుకోకుండా వెళ్లడంతో సిబ్బందిలో ఎంతోకాలంగా అసంతృప్తి నెలకొని ఉంది. ఈక్రమంలో గురువారం తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న జెఇఓ శ్రీనివాసరాజు తన వాహనాన్ని తనిఖీ చేయమని అక్కడున్న సిబ్బందికి సూచించారు. ఆయన కూడా ఒక సాధారణ భక్తుడి తరహాలోనే తనిఖీ చేయించుకున్నారు. తనిఖీ కేంద్రంలో ఉన్న సిబ్బందికి ఎవరైనా తమ వాహనాలను తనిఖీలు చేయించుకోవాల్సిందేనన్న సంకేతాన్ని తనకు రాజమార్గమైన అలిపిరి వద్ద వాహనాన్ని ఆయన కూడా తనిఖీ చేయించుకోవడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది.