కడప

ప్రభుత్వ వసతి గృహాలపై ఎసిబి కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప:ప్రభుత్వ వసతి గృహాల్లో పనిచేస్తున్న వార్డన్లు, మే ట్రిన్లు (హాస్టల్ సంక్షేమ అధికారుల) హాస్టళ్లపై ఏసిబి అధికారులు కనే్నసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బిసి వసతిగృహాలతోపాటు గురుకుల పాఠశాలల కలిపి 300 పైబడి ఉన్నాయి. సంబంధిత వసతి గృహాల్లో పనిచేస్తున్న హాస్టల్ వెల్ఫేర్ అధికారుల ఆస్తుల సేకరణలో సీమ జిల్లాలకు చెందిన ఏసిబి అధికారులు లెక్కలేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యం గా తొలుత సర్వీసులో చేరిన అధికారులు, ఐదారు సంవత్సరాల క్రితం కొంతమంది ఉపాధ్యాయులు లక్షలాది రూపాయలు ఖర్చుచేసుకుని వసతి గృహాల వార్డెన్లుగా చేరిన వారి జాబితాలే సేకరణలో ఏసిబి అధికారులున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే సంబంధిత జిల్లా, రాష్ట్ర అధికారులు పర్యవేక్షణ , నిఘా కొరవడిన దరిమిలా వసతిగృహాల వార్డన్ల పనితీరు మెరుగుపరిచేందుకు ఏసిబి అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసిబి అధికారులు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ వసతి గృహాలపై దాడులు ప్రారంభించింది పాఠకులకు విధితమే. గతంలో కడప, సుండుపల్లె, జికె రాచుపల్లి ప్రభుత్వ వసతి గృహాలపై ఏసిబి దాడులు నిర్వహించారు. ప్రస్తుతం వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు చదివే పాఠశాలల నుంచి హాజరుసేకరించి వసతి గృహాల్లో ఉండే బయోమెట్రిక్ మిషన్లు పరిశీలించేందుకు అడుగులు వేస్తున్నారు. కొన్ని వసతి గృహాల్లో బయోమెట్రిక్ మిషన్లు పనిచేస్తున్న వాటిని పనిచేయకుండా కొంతమంది వార్డెన్లు కుంటిసాకులతో మూలపడేసినట్లు తెలుస్తోంది. వాటన్నింటిపై దర్యాప్తు కూడా జరిగే అవకాశాలున్నాయి. కడపలో పలువురు వార్డెన్లు, పలు నియోజకవర్గాల్లో పలువురు వార్డెన్లు పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని బినామీ పేర్లమీద పెట్టినట్లు తెలుస్తోంది. కొంతమంది వార్డెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం, మరికొన్ని వ్యాపారాలు చేస్తూ ఫైనాన్స్ వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత వార్డెన్లు సంబంధిత జిల్లా, నియోజకవర్గాల స్థాయి అధికారులకు, చివరకు సబ్ ట్రెజరీ కార్యాలయంలో కూడా ముడుపులు ముట్టచెప్పి బిల్లులను స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో సగానికి పైబడి వార్డెన్లు, మేట్రిన్లు అవినీతి ఊబిలో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వార్డెన్లు, మేట్రిన్లు భయభక్తులతో హాస్టల్ విద్యార్థుల ఆలనాపాలనా బాగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వర్గాల వార్డెన్లు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వార్డెన్ల నిర్లక్ష్యం కారణంగా హాస్టళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతోంది. వారి నిర్లక్ష్యం కారణంగా గురుకులపాఠశాలలు, మోడల్ పాఠశాలలు, ట్రిపుల్ ఐటి, కస్తూరిబా పాఠశాలలకు క్రేజీ పెరుగుతోంది. మొత్తం మీద ఏసిబి అధికారుల రంగ ప్రవేశంతో అవినీతి వార్డెన్లు, మేట్రిన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.