కడప

వాడీవేడీగా కౌన్సిల్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి:స్థానిక మునిసిపల్ కార్యాలయంలోని సభాభవనం నందు మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా కొనసాగింది. అజెండాలో పేర్కొన్న 41 అంశాలను కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాల్సి ఉండగా తొలి అంశం నుంచే ఇరుపార్టీల కౌన్సిలర్లు మధ్య కౌన్సిలర్లు అదికారుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో అనేకమార్లు జరిగిన కౌన్సిల్ సమావేశం మాదిరిగానే ఈసారి కూడా ఏమాత్రం తీసిపోకుండా అంశాలను చర్చించాల్సిన సమయంలో వేడి వాతావరణం నెలకొంది. కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలను ఎన్నింటిని ఆమోదించారో ఎన్నింటిని తిరష్కరించారో అర్థం కాని విధంగా సమావేశం జరిగింది. పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని మునిసిపల్ పార్క్ స్థలంలో పురపాలక సంఘం, లయన్స్‌క్లబ్ వారి సౌజన్యంతో లయన్స్‌క్లబ్ సంస్థ వారి నిధులతో పార్కును నిర్మించి నిర్వహించుటకు అనుమతిని ప్రస్తావించగా, గతంలో ఆ పార్కు కోసం ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని ఆ నిధులు ఏమయ్యాయో తెలపాలని కౌన్సిలర్లు నిధులు మంజూరయ్యాయని ఆ నిధులు ఏమయ్యాయో తెలపాలని కౌన్సిలర్లు పట్టుబట్టారు. ఆ నిధులు రానందున లయన్స్ వారు ముందుకు వచ్చి పార్కును నిర్మిస్తారని దీనిని ఆమోదించాలని కోరారు. అలాగే మునిసిపల్ కార్యాలయం నందు అన్ని విభాగాలతో 2017-18 సంవత్సరానికి అవసరమయ్యే ఖర్చుల వివరాలను, కూరగాయల మార్కెట్, టౌన్‌గేటులను 2017-18 సంవత్సరానికి బహిరంగ వేలం పాట వేయుటకు పట్టణంలోని వార్డులలో కొన్ని ప్రాంతాలలో వీధి దీపాలు వెలగడం లేదని, వాటికి కూడా విద్యుత్ చార్జీలు కడుతున్నామని వాడకంలో ఉన్న వాటికి మాత్రమే బిల్లు కట్టాలని కౌన్సిలర్ ఆమోదం కొరకు ప్రస్తావించారు. అలాగే అజెండాలో పేర్కొన్న అంశాలను ఒక్కొక్కటికి ప్రస్తావనకు రాగా కౌన్సిలర్లు, అధికారుల మధ్య వేడి వాతావరణం నెలకొంది. ఒకానొక సందర్భంగా శానిటేషన్ అధికారులపై కౌన్సిలర్లు మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కలుగజేసుకొని మునిసిపల్ అభివృద్ధి కొరకు జరిగే ఈ సమావేశానికి అందరూ సహకరించాలని తెలియజేశారు. అజెండాలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించడంతో కౌన్సిలర్లు, అధికారుల సమన్వయం పాటించి చర్చించేందుకు తోడ్పడాలన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే పురపాలక పరిధిని అభివృద్ధిని చేసుకోగలమన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ప్రసాద్‌రాజు, వైస్‌ఛైర్మన్ ఇందాదుల్లా, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కొట్టేచలపతి, పట్టణ ప్లానింగ్ అధికారి లక్ష్మీనారాయణమ్మ, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.