కడప

మైనార్టీశాఖ మంత్రి లేని పార్టీలో ఉండటం సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప(కల్చరల్):130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వుందా అని టిడిపి నగర అధ్యక్షుడు జిలానీబాషా విమర్శించడం శోచనీయమని కాంగ్రెస్‌పార్టీ మైనార్టీ నగర అధ్యక్షుడు ఖాదర్‌ఖాన్, ఎస్‌యస్‌యుఐ జిల్లా ప్రధానకార్యదర్శి తిరుమలేశు, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు నాగరాజు, సేవాదల్ నగర అధ్యక్షుడు చంద్రశేఖర్‌లు తీవ్రంగా ఖండించారు. గురువారం స్థానిక ఇందిరాభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అత్యధికరోజులు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనేనని, మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఉపాధిహామీ చట్టం, విద్యాహక్కుచట్టం, సమాచార హక్కు చట్టం ఇలా ఎన్నో చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్‌పార్టీనేనని వారు గుర్తుచేశారు. ప్రధానంగా ముస్లిం మైనార్టీలకు అన్ని విధాల పెద్దపీట వేసింది కాంగ్రెస్‌పార్టీనేనని ముస్లిం మైనార్టీలకు తెలుసునన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెస్‌పార్టీ నుంచి వచ్చినవారేనన్న విషయం కూడా జిలానీబాషాకు తెలియదేమో అన్నారు. ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు విద్య, ఉద్యోగాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారంటే కాంగ్రెస్‌పార్టీ తీసుకున్న నిర్ణయాలే అన్నారు. అటువంటి కాంగ్రెస్‌పార్టీని విమర్శించడం టిడిపి నాయకులకు తగదన్నారు. ప్రధానంగా మైనార్టీ వర్గానికి చెందిన వారికి మైనార్టీశాఖ మంత్రి పదవి కూడా ఇవ్వలేని టిడిపిలో జిలానీబాషా ఉండటం సిగ్గుచేటన్నారు. ఈసమావేశంలో కరుణ్, శంశీ తదితరులు పాల్గొన్నారు.