డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 65

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డా.చంద్రవౌళి- హి ఈజ్ ది సన్ ఆఫ్ గ్రేట్ వరల్డ్ రినోడ్ సైంటిస్ట్, ఇండియాస్ ప్రౌడ్ సన్, పద్మవిభూషణ్ డా.రఘురామ్ అని అనౌన్సు చేశాడు.
నడుస్తున్న వౌళి ఆగిపోయాడు. చేతిలో ఉన్న తేజ చెయ్యి గట్టిగా బిగుసుకుపోయింది. అంతవరకు సంతోషంతో మెరుస్తున్న కళ్ళు ఒక్కసారిగా సీరియస్ అయిపోయాయి. నుదుట ముడతలు పడ్డాయి. ఒక్కసారిగా ముఖం చిట్లించాడు.
ఆగిన నడకను తేజాయే ముందుకు సాగేట్లుగా నడుస్తూ నడిపించింది.
వాళ్ళ మొదట ప్రోగ్రాం ప్రకారం వాళ్ళిద్దరూ సరాసరి కేకు దగ్గరకు వెళ్లి కేకు కట్ చేయాలి. కాని వౌళి వౌనంగా సీరియస్‌గా నడుస్తూంటే తేజ తన చెల్లెలికి సైగ చేసి చెవిలో ఏదో చెప్పింది.
ఎంసి ఎక్కడా ప్రోగ్రాంలో తేడా కనిపించకుండా ‘నౌ ది న్యూలీ వెడ్స్ ఫస్ట్ డాన్స్’’ అంటూ అనౌన్స్ చేశాడు.
విశాలమయిన డాన్సు ఫోర్. షైన్ అవుతున్న చెక్కతో చాలా అందంగా ఉంది. దానిమీద వౌళి, తేజ డాన్సు చేస్తున్నారు. వౌళి వీపుమీద తేజ చెయ్యి ఉంది. మరో చెయ్యి ఇద్దరూ పట్టుకున్నారు. యాంత్రికంగా చేస్తున్న డాన్సులో వౌళి మొహం సీరియస్‌గా ఉండటం బహుశా నేనొక్కదానినే గ్రహించి ఉంటాను.
చేతిలో ఉన్న తేజ గ్రహించి ఉంటుంది. మూడు నిమిషాల పాట ముప్ఫై నిమిషాలు పట్టిందా అనిపించింది నా ప్రాణానికి.
పాట ఆగంగానే వాళ్ళిద్దరూ కూడా ఆగిపోయారు. ఏమీ గమనించని ఎంసి మాత్రం చాలా చియర్‌ఫుల్‌గా మాట్లాడుతున్నాడు.
అవర్ నెక్స్ట్ డాన్స్- డాడ్ అండ్ డాటర్ అండ్ మదర్ అండ్ సన్ అని అనౌన్సు చేశాడు. నేను మామూలుగా అయితే ఆ డాన్సు ఫ్లోర్‌కి వెళ్ళేదానే్న కాదు. నాకు అసలు అలాంటివి చేతకావు కూడా! కాని లేచాను. డాన్సు ఫ్లోర్ మధ్యగా నిలచిన వౌళి ఆశ్చర్యంగా నా వంక చూచాడు.
లైట్ల వెలుగులో నల్లని టుక్సిడోతో డాన్సు ఫ్లోర్ మధ్యగా నుంచుని ఉన్నాడు. రెండు చేతులు వెనక్కి పెట్టుకుని, చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. కానీ చిరునవ్వులు చిందించాల్సిన ముఖంలో సీరియస్‌నెస్ తొంగిచూస్తోంది.
తేజ, వౌళి నడచి మేము కూచున్న చోటికి వచ్చారు. నా చెయ్యి పట్టుకు నడుస్తూ డాన్సు ఫ్లోర్‌మీదకు తీసుకువచ్చాడు.
చటుక్కున నా భుజం చుట్టూ చేతులు వేసి నా మెడ వంపుల్లో తల వంచుకున్నాడు. ఎవరైనా చూస్తే వౌళి తల వంచుకుని నా చెవిలో ఏదో చెప్తున్నట్లుగా ఉంది. చిన్నప్పుడు కూడా అంతే. వాడి మనసు గాయపడినపుడు ఇలాగే చేసేవాడు.
‘‘మనలో చెలరేగే భావాలు ఎదుటివారి కలలను చెడగొట్టకూడదు. చూడు తేజ ఎంత చక్కగా ఏర్పాట్లు చేసుకుందో- ఈ రిసెప్షన్ ఆ అమ్మాయికి ఒక కల. ఆ కల ఏ మాత్రం చెదిరిపోకూడదు. మన ఇద్దరి మనసులో ఏముందో పైవాళ్లకు తెలియాల్సిన అవసరం లేదు’’ అంటూ వాడి చేతుల నుండి తప్పుకొని కొంచెం దూరంగా నుంచుని చిరునవ్వుతో వాడి చెంపమీద చేయి ఉంచాను.
వాడు నా కళ్ళలోకి చూస్తూ, నా చిరునవ్వు అవగాహన చేసుకుంటూ అన్నాడు ‘్థంక్ యు’- వాడి పెదిమలు కదిలాయి. మాటలు బయటికి రాలేదు.
మ్యూజిక్ ఆగింది. నా కదలికను గమనించి నాతోపాటు కుర్చీ దాకా నడచి వచ్చాడు. నేను కూర్చునే దాకా చూచి నా కుర్చీకి వెనుకకు వచ్చి తన రెండు చేతులు కుర్చీమీద ఆనించి, ‘్థంక్ యు! థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్!’’ అంటూ తన గడ్డం నా తలకు ఆనించాడు.
అమెరికన్స్ లాగానే భావాలు, అభినయంగా చూపడం భారతీయులకు కూడా అలవాటయింది అమెరికా రాగానే!
అంతే! ఆ స్పర్శలో ఏం ప్రవహించిందో తెలియదు. నన్ను వదిలేసి కొద్దిదూరంలో నుంచుని ఉన్న తేజా చెయ్యి పట్టుకుని నడుస్తూ డాన్సు ఫ్లోర్ చేరి తేజాని గిరగిరా తిప్పాడు.
అతిథులంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. వాతావరణం కొంచెం తేలికయినది. అసలు మబ్బు పట్టింది మా ఇద్దరి మనసుల్లోనే! అయినా మనసును బట్టే మన దృక్పథం.
తేజా తండ్రి నావైపు రాబోయాడు ఏదో చెప్పాలన్నట్లు.
ఆయన ముఖం వంక చూచి మెల్లిగా చేత్తో ఆపేశాను. ఇప్పుడేం వద్దని. వెంటనే సావిత్రి వైపు తిరిగి హాల్ చాలా అందంగా అలంకరించారు హాలంతా అని మాట మార్చాను.
‘‘అంతా మా తేజ ఐడియాస్ అండి. మా పనంతా చెక్కులు రాయడం ఒక్కటే’’ అని నవ్వింది.
‘‘మీ అమ్మాయికి మంచి టేస్ట్ ఉంది’’ అన్నాను.
‘‘మీ అబ్బాయిని పెళ్లిచేసుకోవడానికి ఇష్టపడ్డప్పుడే తెలుస్తోంది’’ అంది తేజ అమ్మమ్మ. తేజ అమెరికాలో పుట్టి పెరిగినవాడిని తప్ప పెళ్లి చేసుకోనని అనేదిట చాలాకాలం. ఇండియాలో పెరిగిన అబ్బాయిలు బాగా మేల్‌శావనిస్ట్ అంటూ పైగా రెండు దేశాలలో పెరిగితే చాలా కల్చరల్ తేడాలు ఉంటాయి. చాలా కష్టం అడ్జెస్ట్ అవ్వడానికి అనేది ఎప్పుడూ. మరి ఎలా మారాయో తెలియదు దాని ఆలోచనలు వౌళిని కలిశాక’’ అన్నది.
మాట్లాడుతూనే ఉన్నా అందరి కళ్లు డాన్సు ఫ్లోర్‌మీదే ఉన్నాయి. వౌళిని, తేజాని చూస్తున్నాయి.
వాళ్ళిద్దరూ డాన్సు ఆపి టేబుల్ దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద టేబుల్ మీద పెద్ద కేకు పెట్టి ఉంది. రెండు పక్కలా కేకులు ఒకదానిమీద మరొకటి నిలబెట్టి ఉన్నాయి. రెండిటిని కలుపుతూ ఒక చిన్న వంతెన. ఆ వంతెనపైన నుంచుని ఉన్న పెళ్లికూతురు, పెళ్లికొడుకు బొమ్మలు. ఆ కేకు చాలా సింబాలిక్‌గా ఉంది. రెండు కుటుంబాలను ఏకం చేస్తున్నట్లు.
ఇద్దరూ కేకు కోశారు. ఇద్దరి తరఫునుంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి గురించి జోకింగ్‌గా మాట్లాడారు. తేజ చెల్లెలు శశి చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది వాళ్ళింట్లో అక్క చెల్లెళ్ల అనుబంధం గురించి. చివరికి స్పీచ్ అంతా అయ్యాక ‘‘్థంక్స్ వౌళి! నౌ ఐ కెన్ టేక్ తేజాస్ రూమ్’’ అన్నది. ఆ ఇంట్లో తేజ గది అంటే అందరికీ ఇష్టంట. కాని ముగ్గురిలోను పెద్దదవడంతో మొదటి ఛాయిస్ తేజాకి దక్కింది.
అందరిలోకి మూర్తిగారు చాలా బాగా మాట్లాడారు. ఇలా రెండు సంస్కృతులమధ్య పెంచి తల్లిదండ్రులుగా తాము పిల్లలకు చాలా బరువులు ఆపాదిస్తున్నామని. పిల్లల భాగస్వాములను ఎంచుకోవడం ఎంత కష్టతరమైపోతుందో అని. తేజా చిన్నతనం గురించి చెప్పాడు. ఇంట్లో ఎంత సందడి తెచ్చిందో చెప్పాడు. అందరి తండ్రులులాగానే మా అమ్మాయిలంటే నాకు చాలా అభిమానం. వాళ్లకు ఎలాంటి లైఫ్ పార్ట్‌నర్ వస్తాడో అని చాలా ఆదుర్దా పడేవాడిని. కానీ, వౌళిని కలిశాక అది పూర్తిగా అంతమయిపోయింది. చిన్నతనంలో అప్పుడప్పుడు మాకూ ఓ అబ్బాయి వుంటే బావుండేది అని అనుకునేవాడిని అన్నాడు.
ఆ మాట అనగానే కూతురు ముగ్గురూ డాడ్ అని అరిచారు.
ఇప్పుడు సడెన్‌గా ‘‘ఐ ఇన్‌హెరిటెడ్ ఎ వండర్‌ఫుల్ సన్ అండ్ ఐ హావ్ టు థింక్ మై డాటర్ ఫర్ దట్!’’ అంటూ ముగించాడు.
నన్ను కూడా మాట్లాడమని బలవంతం చేశారు.
నాకు అందరి ముందు నుంచుని మాట్లాడటానికి పెద్ద కష్టం లేదు. ఎలా అల్లరి పెడదామా అని చూసే కుర్ర గ్యాంగ్ ముందు నుంచుని చాలా లెక్చర్స్ ఇచ్చాను. కాని ఇది అమెరికన్ ఫంక్షన్ కద! కొంచెం సందేహించాను.
చివరకు లేచి మిచిగన్ మా అందరికి ఇచ్చిన బ్రహ్మాండమయిన స్వాగతానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
‘‘నేను చెప్పాలనుకున్నవన్నీ అమ్మాయి తండ్రిగా మూర్తిగారు చెప్పేశారు. అమ్మాయికి తండ్రయినా, అబ్బాయికి తల్లయినా పిల్లల విషయాలలో భయాలు ఒకటే!
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి