మంచి మాట

భగవద్భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని సాక్షాత్కారంకోసం, మానవుడు ఎన్నో మార్గాలను అనుసరించాడు. వాటి అన్నింటిలోకి భక్తిమార్గము అతి సులభం. భారతీయంలో విగ్రహారాధన అంతటా కనిపిస్తుంది. విగ్రహారాధన వల్ల పూజచేసే వ్యక్తికి ఏకాగ్రత కుదురుతుంది. విశ్వాసం బలపడుతుంది.
విగ్రహారాధనలో కొన్ని పద్ధతులు ఉన్నాయ. వాటినే పూజావిధానాలు అంటారు. పూజా విధానంలో కొన్ని పద్ధతులు విగ్రహాలకు గాని, సాలి గ్రామాలకు గాని, జలాభిషేకం చేస్తారు. దాని ద్వారా అభిషేక జలం, రసాయనికంగా, పవిత్రవౌతుందని నమ్మకం. ఆ తీర్థసేవనం ఆరోగ్యప్రదాయిని. ధూపం వెలిగిస్తే, వాతావరణం సుగంధ పూరితవౌతుంది, భక్తుల మనసు తేలిక అవుతుంది. మనసు భగవంతుని వైపు మరలుతుంది.
పరిమళించే పుష్పాలంకరణ వల్ల మనసులకు ఆహ్లాదం కలుగుతుంది. మానసిక తృప్తి కలుగుతుంది. ఏ రూపంలో ఉన్న భగవంతుడైనా స్వర్ణ్భారణాలు వజ్రకిరీటాలు కోరడు, అదంతా భక్తులు భక్తిని చూపించడానికి వారి వారి శక్తిననుసరించి భగవంతునికి వివిధ రకాల అలంకారాలు చేస్తుంటారు. కొందరు పూవులతో చేస్తే మరికొందరు మణిమాణిక్యాలతో, బంగారంతో చేస్తుంటారు.
నివేదనలను కూడా భగవంతుడేమీ కోరడు. కాని భక్తుల ఆసక్తిని బట్టి నివేదనలు మనుషులు ఏర్పరుచుకున్న ఆచారాలను బట్టి సాగుతుంటాయ. ఆ నివేదనల్లోని ఔషధ విలువలవల్ల భగవంతుని కరుణాకటాక్షాల వల్ల అవి దివ్యౌషధాలుగా మారుతాయ.
అందుకే భగవంతునికి పెట్టడం లేదా సమర్పించడం అంటే ఇతరులకు లేకపోతే ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని ఇస్తే అది భగవంతునికి ఇచ్చినట్లే అంటారు. ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తే అపుడు వీరికి తృప్తి కలుగుతుంది. అసలు ఇలా భగవంతుని పేరు చెప్పి నలుగురికి పంచడంలో త్యాగభావన ఏర్పడుతుంది.
ఎన్నో భాగవత కథలలో భగవంతుడు, భక్తులు అర్పించిన వాటిని తిన్న ఉదంతాలు వున్నాయి. అలాంటివి ఉదంతాలు నిజం కూడా కావచ్చు. కాని అంతటి భక్తి పారవశ్యం భక్తునికి ఉండి ఉండాలి. ఆ భక్తుడికి దేవుడు, మనిషి వేరు వేరుగా కనిపించడు. అట్లాంటి స్థితి భక్తునికి ఉన్నపుడు తప్పకుండా భగవంతుడు భక్తుని కోరిక మేరకు వ్యక్తం అయ ఆ భక్తుని కోరికను ఈడేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయ. ఈ పురాణాలే భగవంతుడు పత్రం, పుష్పం, ఫలం తోయం లాంటివైనా ప్రేమతోను, భక్తితోను సమర్పిస్తే ఎంతో ప్రీతి పాత్రంగా స్వీకరిస్తాడని చెప్తాయ. అటువంటి కథలు కూడా ఉన్నాయ.
శ్రీకృష్ణ చరిత్రలో కృష్ణుడిని తనకు దానం ఇచ్చి తిరిగి ఆయన్ను కొనుక్కోవచ్చు. పతి దానం వల్ల అమితమైన పుణ్యం భర్త భార్యమాటనే వింటాడు అన్న విషయం నారదుడు చెప్పాడు. అది విని సత్యభామ కృష్ణుడి ని నారదునికి దానం చేసింది. తిరిగి కొనుక్కునేటపుడు తన దగ్గర ఉన్న బంగారం అంతా వేసినా కృష్ణుడు తూకంలో సరిపోలేదు. రుక్మిణీ దేవి ఇచ్చిన తులసీ దళానికే మొగ్గు చూపాడు. దీన్ని బట్టి భగవంతునికి ఇష్టమైంది కేవలం భక్తి ప్రేమ అని మాత్రమే అని తెలుస్తుంది.
అట్లానే విదురుడు ఒకసారి కృష్ణుని చూస్తున్నానన్న ఆనందంలో పండు పెడతానని అని అరటిపండు తొక్కవలచి పండును పడేసి తొక్కను కృష్ణుడికి పెడుతూ పోయాడట. కృష్ణుడూ పండుతిన్నంత ఆనందంగా తిన్నాడట. చివరలో ఈ విషయం తెలుసుకొని విదురుడు బాధపడితే తొక్కనేనే పండు నేనే కదా నీవెందుకు బాధపడుతావు అన్నాడట కృష్ణయ్య.
సాధారణంగా భగవత్ స్వరూపం, సూక్ష్మగ్రాహ్యం స్థూలదృగ్గోచరం కాదు. పూల వాసన కనుపించదు. అది అనుభవిస్తేనే దాని ఉనికి తెలుస్తుంది. భగవంతుడు స్వీకరించాడనే, నమ్మకంతో నైవేద్యం సార్థకం. అన్నదానం చేయకపోయనా ప్రసాదం పేరిట కాస్తంత ఆహారం ఇతరులకు ఇవ్వడం జరుగుతుంది. అందుకే దేవాలయాల సందర్శన చేయమంటారు. అక్కడ జరిగే కొన్ని కొన్ని కార్యక్రమాలు భక్తుల్లో సాత్విక భావాలను ప్రచోదనం చేస్తాయ. సామాజిక బాధ్యతల పట్ల ఆసక్తిని కలిగిస్తాయ. అదీకాక దేవాలయంలో భగవంతుని కోసం చేసే గంటానాదం, శంఖ పూరణ, నాద స్వరం, డోలు వాద్యం మొదలైన వాటివల్ల, వాతావరణం పతివ్రతవౌతుంది. హారతులు, జ్యోతి ప్రజ్వలనల వల్ల కూడా మనసు పవిత్రమైన భావాలు ఏర్పడుతాయ. దానివల్ల మనస్సులో చంచలమైన భావాలు తగ్గి భగవంతునిపై దృష్టి మరలుతుంది. దైవదర్శనం వల్ల మానవుల దైహిక, మానసిక మార్పులు ఏర్పడుతాయ.

-సాయకృష్ణ