వరంగల్

ఇంతకీ.. రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ పెట్టాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే అంశంపై కాంగ్రెస్ నాయకుల మధ్య ఏకాభిప్రాయం లోపించింది నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరికివారు తమతమ నియోజకవర్గ పరిధిలో రూరల్ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు చేపట్టడంతో కార్యకర్తలు అయోమయానికి లోనవతున్నారు. నాయకుల మధ్య సమన్వంయం చేసే పరిస్థితి లేకపోవటంతో ఎవరిదారి వారిదన్న విధంగా పరిస్థితి మారింది. రాష్ట్రప్రభుత్వం గత అక్టోబర్‌లో పరకాల, నర్సంపేట నియోజకవర్లాలతోపాటు వర్ధన్నపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాలను కలిపి కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ రూరల్ జిల్లా కేంద్రం ఎక్కడ అనే విషయంలో గందరగోళం ఏర్పడింది. రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు అక్కడ.. ఇక్కడ అని ప్రచారం జరుగగా తాజాగా ప్రభుత్వం వరంగల్ నగర శివారులోని మొగిలిచర్లలో రూరల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కానీ మొగిలిచర్లలో రూరల్ కలెక్టరేట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ప్రతిపక్షాలతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు ఏకంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి మొగిలిచర్లలో కలెక్టరేట్ ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అందరికీ అనుకూలంగా ప్రాంతాన్ని ఎంపికచేయాలని కోరారు. దీనికోసం కొన్ని ప్రాంతాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సూచిస్తూ ఇందులో ఎక్కడ ఏర్పాటుచేసినా తమకు అంగీకారమేనని స్పష్టం చేసారు. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం రూరల్ కలెక్టరేట్ విషయంలో ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో రూరల్ కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీ్ధర్ డిమాండ్ చేస్తు ఇటీవల ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తే తాజాగా శుక్రవారం నర్సంపేట కేంద్రంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్ పాల్గొన్నారు. ఇదే సమయంలో జిల్లాకేంద్రం పరకాలలో ఏర్పాటుచేయాలని కోరుతు పరకాలలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో స్థానిక నాయకులు క్రియాశీల పాత్ర పోషించారు. ఇలా ఎవరికివారు తమ ప్రాంతంలో రూరల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలకు దిగటంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడుతోంది. రూరల్ జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంలో రూరల్ జిల్లా కాంగ్రెస్ నాయకుల భిన్న వైఖరిని గురువారం వరంగల్ పర్యటనకు వచ్చిన పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మీడియా ప్రస్తావించినపుడు త్వరలో జిల్లా నాయకులతో సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. కానీ రూరల్ జిల్లాలో ఆయా ప్రాంతాల నాయకులు మాత్రం తమ ప్రాంతంలోనే జిల్లాకేంద్రం ఏర్పాటు కావాలని కోరుకుం టు అవసరమైతే ఉద్యమాలు ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు.

అట్రాసిటీ కేసులు పరిష్కరించాలి
వరంగల్: జిల్లాలో పెండింగులో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ల సత్వర పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో వరంగల్, హన్మకొండ, కాజీపేట, మామునూరు, వర్ధన్నపేట పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో పెండింగులో ఉన్న అట్రాసిటీ కేసులపై సంబంధిత సబ్ డివిజన్ల అధికారులతో సమీక్ష జరిపారు. అర్బన్ జిల్లా పరిధిలో పెండింగులో ఉన్న 87కేసులలో వాస్తవలను సేకరించి తమకు నివేదిక అందించాలని ఆదేశించారు. విచారణలో ఉన్న కేసులకు సంబంధించి వెంటనే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని చెప్పారు. వరంగల్ సబ్ డివిజన్‌లో 22కేసులు, హన్మకొండ, కాజీపేటల సబ్‌డివిజన్లలో 31 కేసుల చొప్పున అట్రాసిటీ కేసులు పెండింగులో ఉన్నాయని, వీటిని సత్వరంగా పరిష్కరించే అంశంపై అధికారులు దృష్టిపెట్టాలని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి శోభ, వెస్ట్‌జోన్ డిసిపి వేణుగోపాలరావు, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్ధార్, కమిటీ సభ్యులు బొమ్మల కట్టయ్య, పరంజ్యోతి, మండల పరశురాములు, దామోదర్, ఎస్‌ఎస్ నాయక్, గిరిజన సంక్షేమ అధికారి చందన, ఏసిపిలు మురళీధర్, శోభన్‌కుమార్, జనార్దన్, దుర్గయ్య, తదితరులు పాల్గొన్నారు.
డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి
ములుగుటౌన్: ఎఫ్‌సిఐ గోదాంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులతో పాటు డీలర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలని హమాలీ కార్మికులు చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు కూరగాయాల మార్కెట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సీతక్క హమాలీ కార్మికులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికులతో కలిసి తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. సీతక్క మాట్లాడుతూ హమాలీలు, డీలర్లు చేస్తున్న సమ్మె న్యాయ బద్ధమైందని, అందుకు అసెంబ్లీ సమాశాలో టిడిపి ఎమ్మెల్యేలతో చర్చకు తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో డీలర్ల సంఘం నాయకులు సుధాకర్, సాగర్, భాస్కర్, టిడిపి మండల అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
ఐఎస్‌ఎల్ నిర్మాణాల పరిశీలన
వడ్డేపల్లి: మహానగర పాలక సంస్థ పరిధి లో వివిధ దశల్లో అసంపూర్తి నిర్మాణాలను వెంటనే పూర్తి చేయడానికి అధికారులు కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శృతి ఓఝా అన్నారు. శుక్రవారం మహానగర పాలక సంస్థ పరిధిలో గల పైడిపెల్లి, తిమ్మాపూర్ గ్రామాలలో ఐఎస్‌ఎల్ నిర్మాణాల పురోగతి పనులను సమీక్షించడానికి అధికారులతో కలిసి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ స్టేజ్ 1, స్టేజ్ 2 నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలని, ఇప్పటి వరకు ప్రారంభం కాని నిర్మాణాలను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జియోట్యాగింగ్ వేగవంతంగా పూర్తి చేస్తే గుంతలను గుర్తించి అభివృద్ది పనులను చేయడానికి సాధ్యం అవుతుందని తెలిపారు. ఐఎస్‌ఎల్ నిర్మాణాల ప్రక్రియలో కార్పొరేటర్ల సేవలు వినియోగించుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భిక్షపతి, ఈఈలు లింగమూర్తి, భిక్షపతి, ఆరోగ్య అధికారి డాక్టర్ రాజారెడి,్డ తదితరులు పాల్గొన్నారు.

పరిపాలనపై అవగాహన లేని సిఎం
వడ్డేపల్లి: మూడు సంవత్సరాల రెండు నెలల తెరాస పాలనలో రాష్ట్రంలో జరిగిన భూ కబ్జాలు, మా ఫీయా కేసులు, నకిలీ విత్తనాల కేసు లు, చివరికి డ్రగ్‌మాఫియా కేసులలో కూడా ప్రభుత్వ పెద్దలే ఉన్నారని, స్వయానా పట్టుబడ్డ వారు చెపుతున్నా కూడా వారి పేర్లను బయట పెట్టకుండా ప్రజలను మోసం చేస్తూ, పారదర్శక పాలన అని నీతులు చెపుతున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ముందు మిగులు బడ్జెట్ లేదని, లోట్ బడ్జెట్‌లో రాష్ట్రం ఉన్నదని ఒప్పుకున్నారని, ఇది కెసిఆర్ జీవితంలో చెప్పిన మొదటి నిజం అని ఎద్దేవా చేశారు. దేశంలోనే విశ్వనగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతానని చెప్పిన ముఖ్యమంత్రి, ఇసుక, ల్యాడ్ మాఫియా, డ్రగ్ మాఫియాకు కేంద్రంగా హైదరాబాదును తయారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించడానికి డ్రగ్ కేసును తెరపైకి తెచ్చారని, తీరా ఇపుడు డ్రగ్ కేసును పక్కదారి పట్టించడానికి సినీ తారలను కేవలం బాధితులుగానే చూడాలని చెపుతున్నారని, ఒక కేసులో ఎవరిని ఎలా చూడాలో ముఖ్యమంత్రి నిర్ణయించడం ఎమిటని ప్రశ్నించారు. నేతలు జైపాల్, శ్రవణ్‌రెడ్డి, పుల్లూరి అశోక్‌కుమార్, జాటోత్ సంతోష్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

జిపి నిధుల దుర్వినియోగంపై గ్రామసభ
మంగపేట: మేజర్ గ్రామ పంచాయతీ కమలాపురంలో జిపి నిధులు దుర్వినియోగం అయ్యాయనే విషయంపై శుక్రవారం కమలాపురం పంచాయతీ ఆవరణలో బహరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భం గా విచారణ అధికారిగా విచ్చేసిన స్థానిక ఎంపిడిఓ జి.కిషన్ మాట్లాడుతూ కమలాపురం గ్రామ పంచాయ తీకి చెందిన నిధులలో రూ.40 లక్షలు పంచాయతీ కార్యదర్శి జంపుల ఆంజనేయులు దుర్వినియోగం చేశాడని గ్రామానికి చెందిన పొలసాని అశోక్‌రెడ్డి జిల్లా ఉన్నతాధికారులకు, కొంతమంది గ్రామస్థులు సబ్ కలెక్టర్ విపి గౌతమ్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు తాము ఈ బహిరంగ విచారణ చేపట్టినట్లు తెలిపారు. 2017 ఫిబ్రవరి నుండి 2017 జూన్ అర్ధ మాసం వరకు పంచాయతీ అధికారులు ఖర్చు చేసిన జిపి నిధులపై చెక్‌ల వారీగా ఆ చెక్ ఎవరికి ఇచ్చారు ? ఏం పనికి ఇచ్చారు అని విషయాలను పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులను విచారణ అధికారులు అడుగగా కరెంట్ బిల్లులు, కొ న్ని నూతన డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మించామని, కార్యాలయ ఖర్చులు, సి బ్బంది జీతాలు వంటి విషయాలకు ఖ ర్చుకు పంచాయితీ కార్యదర్శి తెలపగా తమకు జీతాలు ఇవ్వకండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని జిపి సిబ్బంది ఎంపిడిఓకు పిర్యాదు చేశారు. ఎల్‌ఇడి వీధిలైట్లు కొనుగోలు, తాగునీటి కోసం కొత్త మోటార్లు కొన్న వాటికి కొన్ని చెక్‌లు ఇచ్చినట్లు పంచాయితీ కార్యదర్శి తెలుపగా అవన్నీ ఉత్తి భోగస్ అని ,పంచాయితీ కార్యదర్శి వాటిని దిగమింగాడని గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదుచేశారు. గ్రామంలో ఎ క్కడి సమస్యలు అక్కడేఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం నిధులను కాజేయడానికే పంచాయితీ కార్యదర్శి ఉన్నాడని గ్రామస్థులు ఆ గ్రహం వ్యక్తంచేశారు. తాగునీటి మో టార్లు, ఎల్‌ఈడి వీధిలైట్లు కొనుగోలు కు సంబంధించి బిల్లులు, ఎంబి రికార్డులు, నోట్‌ఫైల్ వాటిలో కొన్ని తప్పు డు తడకగా ఉండడం మరి కొన్ని అసలే లేకపోవడంతో కార్యదర్శి వద్ద ఉన్న రికార్డులను విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భక్తి శ్రద్ధలతో నాగ పంచమి
వరంగల్ (కల్చరల్): శ్రావణ శుద్ధ పంచమిని పురస్కరించుకొని వరంగల్ నగర ప్రజలు నాగుల పంచమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శుక్రవారం భక్తులు నగరంలోని నాగమయ్య దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తెల్లవారుఝామునే లేచి చన్నీటి స్నానాలను ఆచరించుకొని మడి బట్టలతొ పుట్టల వద్దకు చేరుకొని సర్పరాజుకు పాలు, అరటి పండ్లు, గుడ్లు, చలిమిడిని సమర్పించారు. పుట్టలకు దూప, దీప నైవేద్యాదులతో ప్రత్యేక పూజలు చేశారు. నాగుల పంచమి రోజున కశ్యపుడు కుద్రువ దంపతులకు సర్పాలు జన్మించాయని పురాణాలలో చెప్ప బడినది. బ్రహ్మదేవుని వరం వలన ఆనాటి నుండి ఈ నాటి వరకు నాగుల పంచమి నాడు సర్పరాజును పూజిస్తే సుఖశాంతులు లభిస్తాయని ప్రజల విశ్వాసం అందు చేత నాగుల పంచమి నాడు మడితో పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఉర్సు గుట్ట సమీపంలోని నాగమయ్య దేవాలయంలో భక్తులు పోటెత్తారు. ఆలయ అర్చకులు ఆలయంలో కొలువుదీరిన నాగమయ్యకు సర్పసూక్తాన్ని, నమక చమక మంత్రాలను పటిస్తూ ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అలంతరం మహిళలు పెద్ద ఎతున్న ఆలయలోని పుట్టల వద్ద విశేష పుజలు చేశారు. తదుపరి ఆలయంలోని శివునికి పాలు పోసి అభిషేకాలు నిర్విహించుకున్నారు. అదేవిధంగా హన్మకొండలోని వేయిస్తంబాల దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక రుద్రాభిషేకాలు చేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టకు పాలు పోసి తలను తొక్కితే పారిపో, నడుము తొక్కితే నావాడనుకొ, తోక తొక్కితె తొలగిపో అంటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం నాగదేవతకు చలిమిడిని నైవేద్యంగా సమర్పించి అందరికి అందించారు.
మభ్యపెడుతున్న ప్రభుత్వం
కేసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక లేని హామీలతో ప్రజలను మభ్యపెడుతోందని, సిఎం కెసిఆర్ పేదలకు ఇచ్చిన హామాల్లో ప్రధానమైన డబుల్‌బెడ్ రూం ఇండ్ల పథకం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ పథకం అమలులో పూర్తిగా విఫలమయ్యిందని ఎఐసిసి ఎస్టీ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు తేజావత్ బెల్లయ్యనాయక్ ఆరోపించారు. శుక్రవారం కేసముద్రం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో, పైపులైన్లు ఉన్నా మిషన్ భగీరథ పేరుతో కొత్త పైపులైన్లు వేసి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. చేపడుతున్న పథకాలు ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడతాయన్న విషయాన్ని విస్మరించి పాలకులు కేవలం తమ పర్సంటేజీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో అమలు కాకున్నా.. సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత మాటల గారడీలతో ప్రజలను నమ్మించేందుకు పాట్లుపడుతున్నారన్నారు. సమావేశంలో ఆ పార్టీ నేతలు ము ల్లంగి ప్రతాప్, మేకల వీరన్న, రామడుగు వెంకటచారి, తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞాన సమాజం కోసం కృషిచేద్దాం
కురవి: మూడనమ్మకాలు...బాల్య వివాహాలు...సమాజంలో జరుగుతున్న చెడు పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. విజ్ఞాన సమాజం కోసం విద్యార్థులు కృషిచేయాలన్నారు. కురవి మండలంలోని ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే బాలవిజ్ఞాన మేళాను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ తన ఉపాధ్యాయుడి రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్ మాట్లాడుతూ...కేంద్రం దేశంలో 150 పాఠశాలలను ఎంపికచేసిందన్నారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 10 పాఠశాలల్లో కురవి గురుకులం కూడా ఉందన్నారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక నాయకులు ఎల్‌విరెడ్డి, మైస నాగయ్య, చంద్రయ్య, ప్రిన్సిపాల్ హరిసింగ్, వైస్ ప్రిన్సిపాల్ లలితాదేవి, ఓడిసిఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, బజ్జూరి పిచ్చిరెడ్డి, రిసోర్సు పర్సన్లు సురేష్, దయాకర్, శ్యాం, కుమారస్వామి, చంద్రయ్య, వీరబ్రహ్మం, రమేష్, బాలు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తాం
పరకాల: సివిల్ సప్లయ్ హమాలీల సమస్యలు పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని వరంగల్ పార్లమెంటరి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యడ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పరకాలలో రిలే నిరహార దీక్షలు నిర్వహిస్తున్న హమాలీల దిక్ష శిబిరాన్ని కొయ్యడ శ్రీనివాస్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లయ్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మించాలని, జాతీయ పంపిణి పథకం కొనసాగించాలన్నారు. లేని యెడల వారికి మద్దతుగా హమాలీ కార్మికులతో అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ పరకాల అసెంబ్లీ ప్ర ధాన కార్యదర్శి మచ్చ సుమన్, యూత్ కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షులు దామ అనిల్, విష్ణు, సాంబయ్య, శంకర్, మొగిళి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల పాత్ర మరువలేనిది
పరకాల: తెలంగాణ ఉద్యమ పోరాటంలో విద్యార్థుల పాత్ర మరు వలేనిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్ అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో సాహితి జూనియర్ కళాశాలలో టిఆర్‌ఎస్‌వి సభ్యత్వ నమోదు లాంఛనంగా ప్రారంభించారు. దీనికి టిఆర్‌ఎస్‌వి పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి బొచ్చు బాబురావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వినయ్, పరకాల టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు దుబాసి వెంకటస్వామి, టిఆర్‌ఎస్‌వి జిల్లా కో ఆర్డినేటర్ రఘుపతి హాజరైనారు.కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌వి పరకాల నగర అధ్యక్షుడు ఒంటేరు దినేష్‌చంద్ర, టిఆర్‌ఎస్‌వి జిల్లా ప్రధాన కార్యదర్శి అర్షం మధుకర్, టిఆర్‌ఎస్‌వి నాయకులు రావుల రంజిత్, దుప్పటి సుజయ్ణ్రదేవ్, తదితరులు పాల్గొన్నారు.