మెయిన్ ఫీచర్

ఇంటి వద్దే వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఇంటి దగ్గరకే వైద్య సేవలు అందుబాటులోకి వస్తే..
ఆన్‌లైన్‌లో బుక్ చేసిన డోర్ డెలివరీ జరిగిపోతే...
డాక్టర్ అపాయింట్‌మెంట్ ఆన్‌లైన్‌లోనే అయిపోతే..
ఇతర కేర్ గివింగ్ సర్వీసులన్నీ గుమ్మం ముందుకే వస్తే..
ఎంత హాపీయో కదా..
అలాంటి ఐడియాతో పుట్టుకొచ్చింది హైదరాబాదీ స్టార్టప్ కాల్ హెల్త్. ఆరోగ్యానికి సంబంధించిన సేవలన్నిటినీ ఒకే గొడుకు క్రిందకి తెచ్చి, హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
ముందు పెయిన్ రిలీఫ్ కావాలి. ఆ తర్వాత శాశ్వత పరిష్కారం కోసం వెతుకుదాం. ఈ బేసిక్ ప్రిన్సిపుల్ మీదనే కాల్ హెల్త్ స్టార్టప్ ఐడియా జెనరేట్ అయింది. ఒకసారి సంధ్య రాజు అనే కూచిపూడి డాన్సర్ కాలికి దెబ్బతాకింది. హాస్పిటల్‌కు పోతే ఆ టెస్టులు ఈ టెస్టులు అని లాబొరేటరీల చుట్టూ తిప్పించారు. ఆ విసుగులోంచే ఆలోచన తట్టింది. అన్ని సర్వీసులు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఐడియాపై ఆమె వర్కవుట్ చేశారు. వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న సంధ్య రాజు.. గ్రౌండ్ లెవెల్ నుంచి రీసెర్చి చేసి, డైనమిక్ సొల్యూషన్ కనిపెట్టారు. అలా అలా అది కాల్ హెల్త్ అనే ఓ ఖతర్నాక్ సొల్యూషన్ ఔట్‌పుట్‌లా బయటకొచ్చింది. ఇంటి దగ్గర నుంచే అన్ని వైద్య సేవలను పొందడం దీని ముఖ్య ఉద్దేశ్యం.
కాల్ హెల్త్ అందించే సేవలు
చాలా రకాలైన వైద్య సేవలను కాల్ హెల్త్ అందిస్తోంది. ఇందులో ప్రధానంగా కొన్నింటిని ప్రస్తావించారు సిఇఓ హరి తాళ్లపల్లి.
- 24/7 అందుబాటులో ఉండే డాక్టర్లు ఇందులో చెప్పుకోదగింది. ఎప్పుడెలాంటి అవసరం వచ్చినా డాక్టర్ అపాయింట్‌మెంట్ క్షణాల్లో తీసుకోవచ్చు.
- ఇంటి దగ్గరే అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించొచ్చు. వాటి రిపోర్టులు కూడా క్షణాల్లో పొందొచ్చు.
- ఇంటి దగ్గరకే కావాల్సిన మందులను తెప్పించుకోవచ్చు.
- ఫిజియోథెరపీ లాంటి సేవలను ఇంటి దగ్గరినుంచే పొందొచ్చు.
- నర్సింగ్ సపోర్టు అందిస్తారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత ఇంటి దగ్గర కావాల్సిన నర్సింగ్ ఫెసిలిటీ అందిస్తారు.
- ఇంటి దగ్గరున్న పెద్దవారికి కేర్ గివింగ్ సర్వీసులనూ కాల్ హెల్త్ అందిస్తోంది.
వీటితోపాటు మరిన్ని సర్వీసులను, సేవలను అందిస్తున్నారు. ఇలాంటి చాలా సేవలకు ఒకే ఫ్లాట్‌ఫాం కాల్ హెల్త్ అని హరి చెప్పుకొచ్చారు. టెక్నాలజీ ఉపయోగించి, సర్వీసులను మరింత సరళతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చాం అని అంటున్నారు హరి తాళ్లపల్లి. చేతిలో మొబైల్ ఉంటే చాలు- కావాల్సిన హెల్త్ సేవలు ఉన్నట్లే అని హరి చెప్పుకొచ్చారు. కాల్ హెల్త్ ప్రతి ఇంటి ఫ్యామిలీ డాక్టర్ లాంటిదంటారాయన. రిజిస్టర్ యూజర్లకోసం ఫ్యామిలీ డాక్టర్‌ను అపాయింట్ చేస్తారు. డాక్టర్ సలహా మేరకు వారి అన్ని రకాల సమస్యలను పరిష్కారం చూపుతామని హరి చెప్పుకొచ్చారు.
డోర్‌స్టెప్ సర్వీసును స్వీకరించడం ఆరంభం..
2014 నవంబర్ నుంచి సర్వీసులను ప్రారంభించారు. జనంలోనికి ఈ విధానం తీసుకెళ్లడం కూడా మొదట్లో ఓ పెద్ద సమస్యగా మారింది. సాంప్రదాయ పద్ధతిలో మెడికల్ సర్వీసులను వినియోగించుకుంటున్న జనం వీరి డోర్‌స్టెప్ సర్వీసును స్వీకరించడం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. ఈ సవాల్‌ని అధిగమిస్తామనే ధీమా వ్యక్తం చేశారు హరి.
ఈ రెండూ ఒక ఎత్తయితే కేర్ రంగం వీరి టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకోవడానికి మొదట్లో సిద్ధంగా లేదు. డాక్టర్ల దగ్గరినుంచి పాజిటివ్‌గా రెస్పాన్స్ వచ్చినా, మిగిలినవారినుంచి మొదట్లో తిరస్కరణే ఎదురైంది. దీన్ని నెమ్మదిగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తయితే ఇక హెల్త్ కేర్ రంగంలో తమకు తిరుగులేదని అంటున్నారు హరి తాళ్ళపల్లి.
టీమ్, టెక్నాలజీ
కాల్ హెల్త్ అనేది ప్రస్తుతానికి ఆన్‌లైన్ హెల్త్‌కేర్‌గానే ఉంది. భవిష్యత్‌లో మొబైల్ యాప్ ఫ్లాట్‌ఫాంలోకి ప్రవేశించనుంది. టెలి కాలింగ్‌తో సేవలను అందిస్తున్నారు. దీన్ని ఫౌండర్ సంధ్య రాజు, వ్యాపార కుటుంబ నేపథ్యం ఉన్న ఆమె విజన్‌కి రూపమే ఈ సంస్థ. సిఇఓ హరి తాళ్ళపల్లి పనిచేస్తున్నారు. హెల్త్‌కేర్‌తోపాటు ఇతర రంగాల్లో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఆయనకు. 850మంది ఆన్, ఆఫ్ రోల్ ఉద్యోగులున్నారు. 450 మంది అసెర్ట్ బిల్డింగ్ ఫ్లాట్‌ఫాం, కాల్ సెంటర్‌లో పనిచేస్తారు. 400 మంది గ్రౌండ్ లెవెల్.. అంటే డాక్టర్లు, నర్సులు ఇతర కేర్ గివింగ్ సర్వీసులో అందుబాటులో ఉంటారు. రోజులో 24 గంటలూ సేవలు అందుబాటులో ఉంటాయి.
మార్కెట్ అవకాశాలు
ఒక్క భారతదేశంలోనే హెల్త్‌కేర్ రంగంలో 160 బిలియన్ల మార్కెట్ ఉంది. 2020 నాటికి ఇది దాదాపు 280 బిలియన్లకు చేరుతుందని అంచనా. ఏడాదికి 17 శాతం పెరుగుదలతో ఆన్‌లైన్, ఆఫ్ లైన్ హెల్త్‌కేర్ రంగం దూసుకుపోతోంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సేవలను కలుపుతూ కాల్ హెల్త్ ఈ మార్కెట్‌లోకి ప్రవేశించింది.
ఇప్పటివరకూ కాల్‌హెల్త్‌లో 5 వేలమంది రిజిస్టర్ యూజర్లున్నారు. వీరితోపాటు చాలా క్లినిక్స్, మెడికల్ ల్యాబ్స్, ఫార్మా కంపెనీలు, ఇన్సూరెన్స్ లాంటి సంస్థలతో టై అప్స్ పెట్టుకున్నారు. అవి రోజురోజుకీ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ కేంద్రంగా సేవలు అందిస్తున్నారు. సాధారణ ఆసుపత్రులతో సమానంగా లేదా వారికంటే తక్కువ ధరలకే మెడికల్ టెస్టులను చేస్తున్నారు. డయాగ్నోస్టిక్ సర్వీసులను మార్కెట్ కంటే 15 శాతం తక్కువ ధరకే అందిస్తున్నారు. మెడిసిన్ బల్క్ తీసుకుని విక్రయిస్తారు కనుక సాధారణంగా మెడికల్ షాపు వాళ్లిచ్చే ధరకంటే 20 శాతం తక్కువకే ఇస్తున్నారు. మెరుగైన సేవలను అత్యంత తక్కువ ధరకు ఇవ్వడం తమ వల్లనే సాధ్యమని సిఇఓ అంటున్నారు.
పోటీదారులు, భవిష్యత్ ప్రణాళికలు
ప్రాక్టో, ఈకిన్ కేర్ లాంటి హెల్త్ కేర్ స్టార్టప్‌లు ఈ రంగంలో ఉన్నాయి. అయితే ప్రాక్టో ఒక్క డాక్టర్ అపాయింట్‌మెంట్‌కు మాత్రమే పరిమితం అయింది. ఈకిన్ కేర్ లాంటివి కొన్ని సేవలు మాత్రమే చేస్తున్నాయి. కానీ కాల్ హెల్త్ అపరిమితమైనది. ఎమర్జెన్సీ సర్వీసు వచ్చినపుడు మాత్రం 108కు సమాచారం అందిస్తారు. ఈ రకంగా చూస్తే ప్రస్తుతానికి దేశంలో తాము మాత్రమే అన్నింటా ముందున్నామని హరి అంటున్నారు.
వైద్య సేవలు అవసరం అయినవారికి కాల్ హెల్త్ అనేది ఓ సామాజిక అవసరంగా మార్చడానికి తాము పనిచేస్తున్నామని హరి అన్నారు. అన్ని మెట్రో నగరాలకు ఈ ఏడాది చివరికల్లా విస్తరిస్తామని తెలిపారు. వచ్చే 36 నెలల్లో దేశంలో ఉన్న 60 పట్టణాల్లో సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి నిధులను సమీకరించుకున్నారు. వచ్చే 4-9 నెలల్లో మరోసారి ఈ రకంగానే నిధులను సమకూర్చుకుంటామని హరి అన్నారు.
వచ్చే ఐదేళ్ళలో హెల్త్‌కేర్ రంగంలోనే కాదు దేశంలోనే అనూహ్యంగా మార్పులు రానున్నాయి. దానికి కాల్ హెల్త్ నాంది పలకనుంది. ఆరోగ్య భారతంలో కాల్ హెల్త్‌కి కొన్ని పేజీలు ఉండాలనేదే తమ ప్రయత్నమని చెప్పి హరి అంటారు.