ఆటాపోటీ

ఉన్నత ప్రమాణాలు ఉంటేనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని, కనీస ప్రమాణాలను అందుకున్నవారికే ప్రపంచ అథ్లెటిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ప్రపంచం నలుమూలలా క్వాలిఫయర్స్ జరిగాయి. జూన్ మాసాంతంతో గడువు ముగిసింది. ఆయా దేశాల అథ్లెటిక్ సమాఖ్యలు పంపిన వివరాలను పరిశీలించిన తర్వాత వివిధ క్రీడాంశాల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈలోగా అందరికీ డోపింగ్ పరీక్షలు కూడా జరుగుతాయి. పోటీలు జరుగుతున్నప్పుడు లేదా పూర్తయిన తర్వాత డోప్ పరీక్షా ఫలితాలు వెల్లడవుతాయి. ఎవరైనా దోషిగా తేలితే, సదరు అథ్లెట్ సాధించిన పతకాన్ని, నెలకొల్పిన టైమింగ్ లేదా రికార్డును రద్దుచేస్తారు. ఈసారి డోప్ రహిత పోటీలను నిర్వహిస్తామని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధికారులు అంటున్నారు.
లేనే్ల ముఖ్యం..
* ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో తమకు కేటాయించిన లేన్స్‌ను అథ్లెట్లు గుర్తుంచుకోవాలి. 100 మీటర్ల స్ప్రింట్‌లో మొదటినుంచి చివరి వరకూ అదే లేన్‌లో పరుగెత్త్తాలి. 800, 1,500 మీటర్లు వంటి మిడిల్ డిస్టెన్స్ పరుగులో అథ్లెట్లు మొదటి ల్యాప్‌లో సగం దూరం వరకూ తమకు ఇచ్చిన లేన్‌లోనే ఉండి, ఆ తర్వాత తమకు నచ్చిన లేన్‌కు మారవచ్చు. సహజంగా అథ్లెట్లు లోపలివైపు ఉన్న ట్రాక్‌కు అత్యంత సమీపంలోని ట్రాక్‌పై పరిగెత్తడానికే ప్రాధానతనిస్తారు.
ఎన్ని రకాలో..
* పరుగులోనే పలు రకాలున్నాయి. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్లు, మారథాన్, హర్డిల్స్, రిలే విభాగాల్లో పరుగు పందాలను నిర్వహిస్తారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు సహజంగా వ్యక్తిగత ఈవెంట్స్‌లోనే జరుగుతాయి. అయితే, రిలేలు మాత్రం టీమ్ ఈవెంట్స్.