ఆటాపోటీ

రికార్డులు బద్దలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు అద్భుతమనుకున్న రికార్డు ఆ తర్వాత కాలంలో చాలా సామాన్యమైనదిగా కనిపిస్తుంది. ప్రమాణాల స్థాయి పెరగడమే అందుకు కారణం. ఒకానొకప్పుడు 100 మీటర్ల స్ప్రింట్‌ను 10 సెకన్లలోపు పూర్తి చేయడం అసాధ్యమనే అభిప్రాయం ఉండేది. కానీ, మొట్టమొదటిసారి కెనడా వీరుడు బెన్ జాన్సన్ 10 సెకన్లలోగా స్ప్రింట్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉసేన్ బోల్ట్ కొత్త రికార్డు సృష్టించాడు. ఒకరు నెలకొల్పిన రికార్డును మరొకరు బద్దలు చేయడం అథ్లెటిక్స్‌లో కొత్తేమీ కాదు. ఇటీవల కాలంలో నమోదైన కొత్త ప్రపంచ రికార్డును చెక్ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావా గోల్డెన్ స్పైక్ అథ్లెటిక్స్ మీట్ 300 మీటర్ల పరుగులో దక్షిణాఫ్రికా రన్నర్ వేడ్ వాన్ నికెర్ సృష్టించాడు. అతను లక్ష్యాన్ని 30.81 సెకన్లలోనే చేరుకొని, 2000వ సంవత్సరంలో అమెరికా రన్నర్ జాన్సన్ 30.85 సెకన్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అంతకుముందు అతను రియో ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగులోనూ వాన్ నికెర్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. అప్పుడు కూడా అతను జాన్సన్ రికార్డునే అధిగమించడం విశేషం. మొత్తం మీద రికార్డులు నెలకొనేది బద్దలు కావడానికేనని అతను నిరూపిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.