ఆటాపోటీ

పతకాల్లో అమెరికా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. 143 స్వర్ణం, 96 రజతం, 84 కాంస్య పతకాలతో మొత్తం 323 పతకాలు కైవసం చేసుకొని ‘ట్రిపుల్ సెంచరీ’ సాధించింది. రెండో స్థానంలో ఉన్న రష్యా ఖాతాలో 53 స్వర్ణం, 59 రజతం, 58 కాంస్యం (మొత్తం 170) పతకాలు ఉన్నాయి. కెన్యా 50 స్వర్ణం, 43 రజతం, 35 కాంస్యాలు (మొత్తం 128) సంపాదించి మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఒకప్పటి సోవియట్ యూనియన్ 22 స్వర్ణం, 25 రజతం, 28 కాంస్య పతకాలను గెల్చుకుంది. వీటిలో రష్యా అథ్లెట్లు సంపాదించినవే ఎక్కువ. కానీ, పతకాల పట్టికలో సోవియట్ యూనియన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారేగానీ, విడిపోయిన ఆయా దేశాలకు వాటిని పంచలేదు. కాగా టాప్-10 జాబితాలో జర్మనీ (నాలుగు), జమైకా (ఐదు), సోవియట్ యూనియన్ (ఆరు), ఇథియోపియా (ఏడు), గ్రేట్ బ్రిటన్ (ఎనిమిది), క్యూబా (తొమ్మిది), ఈస్ట్ జర్మనీ (పది) దేశాలు ఉన్నాయి.