ఆటాపోటీ

సూపర్ బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసాధారణ ప్రతిభావంతులైన అథ్లెట్ల జాబితాను తయారు చేస్తే అందులో ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులతో ప్రపంచ రికార్డులను నెలకొల్పిన అతను ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఇంతవరకూ 11 స్వర్ణాలు, రెండు రజతాలతో మొత్తం 13 పతకాలను కైవసం చేసుకున్నాడు. అమెరికా సూపర్ అథ్లెట్ కార్ల్ లూయిస్ ఖాతాలో పది ప్రపంచ అథ్లెటిక్స్ పతకాలు ఉన్నాయ. వాటిలో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం ఉన్నాయ. ఈ పతకాలతో అతడు ప్రపంచ మేటి అథ్లెట్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మైఖేల్ జాన్సన్ (అమెరికా) ఎనిమిది స్వర్ణాలతో మూడో స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాగా, కెరీర్‌లో చివరిసారి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడనున్న బోల్ట్‌కు ఈసారి కూడా తిరుగు ఉండదని విశే్లషకుల అభిప్రాయం. అథ్లెటిక్స్‌కు మారుపేరుగా నిలిచి, ప్రపంచ దేశాల దృష్టిని తనవైపు మళ్లేలా విశేష ప్రతిభా పాటవాలు కనబరుస్తున్న అతను ఈసారి వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఎన్ని పతకాలు సాధిస్తాడో చూడాలి. ఎన్ని వచ్చినా, అతని రికార్డు మరింత మెరుగు పడడమే తప్ప, ఇప్పటికే నంబర్ వన్‌గా ఉన్న అతనికి ప్రత్యేకంగా కలిసొచ్చేది ఏమీ ఉండదు! ప్రపంచ అథ్లెటిక్స్ రంగంలో ఒక విభాగంలో రాణించడమే కష్టం. రికార్డును సృష్టించడం ఇంకా కష్టం. ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో రికార్డులను తమ పేరిట నమోదు చేసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటి అరుదైన ఫీట్‌ను సాధించిన అథ్లెట్లు ఐదుగురున్నారు. మరియన్ జోన్స్ మహిళల 100 మీటర్ల పరుగుతోపాటు రిలేలోనూ రికార్డులు సృష్టించింది. మైఖేల్ జాన్సన్ 400 మీటర్ల పరుగు, రిలే విభాగాల్లో ప్రపంచ రికార్డును తన ఖాతాలో చేసుకున్నాడు. జాకీ జాయ్‌నెర్ కెర్సీ లాంగ్ జంప్, హెప్ట్థ్లాన్ విభాగాల్లో రికార్డులు నెలకొల్పింది. జర్మీలా క్రటోచ్విలొవా మహిళల 400, 800 మీటర్ల పరుగులో రికార్డులను సాధించింది. ఈ నలుగురికంటే ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అథ్లెట్ ఉస్సేన్ బోల్ట్. అతను పురుషుల 100, 200 మీటర్ల పరుగుతోపాటు 4 న 100 మీటర్ల రిలేలోనూ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకే అథ్లెట్ మూడు వేర్వేరు విభాగాల్లో రికార్డులు నెలకొల్పడం కూడా ఒక రికార్డే.