ఉత్తర తెలంగాణ

సామాజిక సమస్యలే కవయిత్రిని చేశాయి! (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలోని సమస్యలే తనను కవయిత్రిని

చేశాయని సవినయంగా ప్రకటించుకున్న

కవయిత్రి వృత్తిరీత్యా మంచిర్యాల జిల్లా

బెల్లంపల్లిలో తెలుగు అధ్యాపకులుగా

పనిచేస్తున్నారు. పాఠకులను రంజింపజేసేలా

కవిత్వం ఉండాలని భావించే ఆమె తన

చిన్ననాటి నుంచే రచనా వ్యాసంగాన్ని

ప్రవృత్తిగా మలచుకున్నారు. తెలంగాణ

ఉద్యమ సమయంలో ఉడుతా భక్తిగా

రచనలు చేసిన ఆమె.. ‘అమర వీరుల

విజయం’ పేరుతో ఓ గ్రంథాన్ని ప్రకటించారు.

కథలు, వ్యాసాలు రాయడంలో

అనుభవమున్న ఆమె.. రచనలు సామాజిక

చైతన్యానికి దోహదపడాలని.. సమాజంలోని

రుగ్మతల నివారణకు ఉపయోగపడాలని

అంటారు.
దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ.. మహిళలపై

వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని

భావించే ఆమె స్ర్తివాద కవిత్వం విరివిగా

రావాలని కాంక్షిస్తారు. ఇప్పుడొస్తున్న

కవిత్వం రాశిలో మిన్నగా వున్నప్పటికీ

గాఢతలో ఇంకా పరిణతి సాధించాల్సి

వుందని భావించే ఆమెతో ‘మెరుపు’

ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు

ఆమె మాటల్లోనే..

ఆ మీరు ఎన్నో ఏట రచనా వ్యాసంగాన్ని

మొదలు పెట్టారు?
నా చిన్నతనంలోనే కవిత్వం రాయడం

మొదలుపెట్టాను. హైస్కూల్‌లో

చదువుతున్నప్పుడే యుద్దనపూడి

సులోచన రాణి నవలలు, రంగనాయకమ్మ

రచనలు చదివేవాన్ని. అప్పుడే రచనలు

చేయాలన్న కోరికకు అంకురార్పణ జరిగింది.

ఆ మీ దృష్టిలో కవిత్వమంటే ఏమిటి?
నా దృష్టిలో కవిత్వం పాఠకులను

రంజింపచేయాలి. స్పందింపజేయగలగాలి.

ఆలోచింపజేయగలగాలి. సామాజిక

చైతన్యానికి దోహదపడాలి. పదబంధాలు

నిగూఢంగా ఉండి.. అక్షర అల్లికలతో

పాఠకులను అలరింపజేయాలి.

ఆ మీరు కవయిత్రిగా మారడానికి ప్రేరణ

ఏమిటి?
సమాజంలోని సమస్యలే నన్ను కవయిత్రిగా

మార్చాయి. స్ర్తిల అణచివేత.. వివక్ష..

మహిళలపై అత్యాచారాలు, వరకట్నం

చావులు.. నన్ను కదలించాయి.. కలం

పట్టేలా చేశాయి..

ఆ మీరు కథలు కూడా రాశారు కదా..

మంచి కథకు ఉండే
లక్షణాలు ఏమిటి?
మంచి కథకు ఉండే ముఖ్య లక్షణం

పాఠకులను ఏకబిగిన చదివించే శక్తి

వుండాలి. ముగింపు సందేశాత్మకంగా

ఉండాలి. పాత్రల చిత్రణ, సంభాషణలు,

సన్నివేశాలు, సంఘటనలు ఆసక్తికరంగా

ఉంటే బాగుంటుంది. అయితే మనం నిత్యం

మన చుట్టూ జరిగే అంశాలతోనే కథ రాస్తే

మరీ బాగుంటుందని నా అభిప్రాయం!

ఆ మీకు నచ్చిన గ్రంథం?
యండమూరి వీరేంద్రనాథ్ గారి ‘విజయానికి

ఐదుమెట్లు’

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
డాక్టర్ సి.నారాయణ రెడ్డి, కాళోజీ,

యండమూరి.

ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో

కవయిత్రిగా
మీరు పోషించిన పాత్ర?
తెలంగాణ ఉద్యమ సమయంలో పాటలు

రాశాను.. కవితలు రాశాను.. పాడినాను..

రాస్తారోకోలు.. కాగడాల ప్రదర్శనల్లో పాల్గొని

కటకటాల వరకు నడిచాను. ‘అమరవీరుల

విజయం’ పేరుతో ఓ గ్రంథాన్ని

వెలువరించాను.

ఆ ఇప్పుడొస్తున్న కొత్త కవుల వచన

కవిత్వంపై మీ అభిప్రాయం?
నేను వర్ధమాన కవయిత్రిని.. ఇప్పుడొస్తున్న

కొత్త కవుల కవిత్వాన్ని విశే్లషించే శక్తి

లేదు. కానీ కవిత్వం రాశిపరంగా బాగానే

వస్తున్నప్పటికీ.. గాఢత ఉండటం లేదన్నది

నా అభిప్రాయం.

ఆ మారుతున్న ప్రస్తుత సమాజంలో స్ర్తివాద

కవిత్వం ఇంకా
అవసరమని భావిస్తారా?
అవును.. స్ర్తివాద కవిత్వం అవసరమే..

సమాజంలో మహిళలపై అత్యాచారాలు,

అఘాయిత్యాలు ఆగడం లేదు. వివక్ష ఇంకా

కొనసాగుతూనే ఉంది. మహిళల్లో

స్వాభిమానాన్ని నింపి...వారిని చైతన్యపరిచే

దిశలో స్ర్తివాద కవిత్వం రావాలి.

ఆ రచయితలు, కవులకు శిక్షణ

అవసరమని భావిస్తున్నారా?
మాలాంటి వర్ధమానులకు రచనలు

చేయడంలో శిక్షణ అవసరం..అధ్యయనం

వల్ల కొన్ని మెళకువలు

తెలిసినప్పటికీ..పరిణతి సాధించడానికి

అనుభవజ్ఞులచే శిక్షణ నిప్పిస్తే రచనా

వ్యాసంగంలో ఇంకా రాణించే అవకాశముంది.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
సాహితీ పురస్కారాలు బాధ్యతను

పెంచుతాయి. పురస్కారాలు ప్రదానం

చేయడంలో పారదర్శకత పాటించాలి.

అర్హులకే ఇవ్వాలి.

ఆ మీ భవిష్యత్తు రచనలు?
త్వరలో ‘నిర్భయ’ కవితా సంపుటి రానుంది.

ఇంకా కొన్ని కథలు రాశాక..కథా సంకలనం

తేవాలని ఉంది. ఎప్పటికైనా ఓ మంచి నవల

రాసి పాఠకులను మెప్పించాలని ఉంది.

హనుమాండ్ల రమాదేవి
తెలుగు అధ్యాపకురాలు,
ఎస్‌ఆర్‌టి క్వార్టర్ నెం.80,
ఎఎంసి ఏరియా బెల్లంపలి,్ల
మంచిర్యాల జిల్లా
సెల్.నం.9959835745

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544