నెల్లూరు

హృదయం ఎక్కడుంది (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎక్కడికెళ్లావోయ్
రెండురోజులన్నావే, పదిరోజులయ్యింది
పదిదినాలు పది సంవత్సరాలుగా ఉన్నాయి
క్షణమొక యుగం అని వినడమే గానీ,
అనుభవించడం ఇప్పుడే
నా కళ్లు గుమ్మానికి,
చూపులు రహదారికి వేళ్లాడదీశాను
నీ కోసం ఎదురుచూసే
నా కళ్లు రెప్పవెయ్యడం మరచాయి
నయనాల నుంచి జాలువారే అశ్రువులు
ధారకట్టి చెంపలపై చారికలాయ్యాయి
గగన మార్గం ద్వారా మొయిలు సందేశం
పంపుతావని ఆశగా ఎదురుచూశాను
చిలకరించి జాలి పడింది..
కానీ, నీ జాడ మాత్రం కానరాలేదు
ఏమైంది? వెళ్లిన కార్యం పూర్తి కాలేదా లేక
ఏ అవాంతరమైనా వచ్చిపడిందా
నా హృదయతంత్రుల్ని మీటే నీ పలుకెక్కడ?
నువ్వు లేనిదే గింజ మింగని నేను,
నువ్వొచ్చే వరకూ ప్రాణాలతో ఉండాలని
దొరికిన దానితో కడుపు
నింపుకుంటున్నాను
నీ నులివెచ్చని రెక్కకింద నిర్భయంగా
కునుకు తీయడం అలవాటైన నాకు
ఒంటరి గువ్వనై గూట్లో గుబులుగా
కలత నిద్రపోతున్నాను
పోనీ నేను నీదరికి వద్దామంటే నువ్వు
ఏ తావునున్నావో చెప్పకుండా పొయ్యావు
ఎప్పుడొస్తావు? నా కళ్లను ఎప్పుడు వెలిగిస్తావు
పిల్లతెమ్మరతోనో, పూలపరిమళంతోనో
కబురంపు
ఎండావానలను లెక్కచేయక నిలబడి
నిరీక్షించే
నీ చెలిప్రాణాలు నిలుపు..!
- దువ్వూరు సుమలత
చరవాణి : 9494799248

ఓ మనిషీ తిరిగిచూడు

ఓ మనిషీ తిరిగి చూడు
మానవత్వం మరిచిపోతున్నావు
సమానత్వం చెరిపి వేస్తున్నావు
ప్రలోభాలకి తలొగ్గి
ప్రపంచాన్ని పాడుచేస్తున్నావు
కోర్కెల వలయంలో కొట్టుమిట్టాడుతూ
సమస్యల సుడిగుండంలో
మునిగిపోతున్నావు
సృష్టికి ప్రతిసృష్టి చేయగల
విశ్వామిత్రుడివే కానీ
విశ్వానికి కీడు చేసి విశ్వాసం
కోల్పోతున్నావు
ఆనందనందనాలను విషాద నిలయాలుగా
మార్చివేస్తున్నావు
పంచభూతాల సాక్షిగా పర్యావరణాన్ని
నాశనం చేస్తున్నావు
గాలి కలుషితం..నీరు కలుషితం.. ఊరు
కలుషితం..వాడ కలుషితం
మనిషి కలుషితం మనసు కలుషితం
గుక్కెడు నీటి కోసం గుప్పెడు గుండె ఆరాటం
ప్రాణవాయువు కోసం ప్రాణికోటి పోరాటం
ఊహలు ఊరిస్తున్నాయి
వాస్తవాలు వారిస్తున్నాయి
సమస్యలు చుట్టుముడుతున్నాయి
సంతోషాలను హరిస్తున్నాయి
మానవత్వాన్ని మరిచిపోకు
సమానత్వాన్ని చెరపబోకు
నీ స్వార్థం విడనాడు
నిస్వార్థంగా నడయాడు
ఓ మనిషీ తిరిగిచూడు..!
- అలంకారం విజయకుమార్‌రాజు, చరవాణి :
9603752929

సర్వాంతర్యామి

ఇందుకలదు ...అందు లేదు
అన్న సందేహం వలదు..
కల్తీ సర్వాంతర్యామి
మనసు వ్యాపారమై...
కల్తీ మే నెల ఎండలా మిడిసి పడుతుంది
ప్రతీ శ్వాసలోను కల్తీ గాలి తగులుతుంటే
బతుకు బండి అర్ధాంతరంగా
కూలే వంతెన మాదిరి...
నాలుగు మెతుకులు తిని జీవనం
సాగిద్దామనుకుంటే..
మెతుకులు విషగుళికలై
క్రూరంగా గొంతులోకి దిగుతున్నాయి
తిందామని కోసిన పండు
కార్పట్టై కపటత్వం చూపుతుంది
అపుడపుడు ఉలిక్కిపడే
అధికారుల చప్పుడు
మోసపు చెవులకు చేరట్లేదసలు
వ్యవస్థ అంతా మసి మాస్కులేసుకొని
మసిలాడుతుంది
తామసంలో నీడ జాడలా...
స్వచ్ఛత కల్తీ సంద్రంలో కల్సిపోయింది
పాలసముద్రంలోంచి
అమృతం తోడినట్లు..
భవిష్యత్ తరానికి నీతి పాఠాలు
కల్తీమయం కాకుండా నేర్పించాలి
మనసుతో జీవించమని బోధించాలి....
- అవ్వారు శ్రీ్ధర్‌బాబు
చరవాణి : 8500130770

‘మెరుపు’ (కవిత)

విశ్వాంతరాళంలోని నల్ల బిల్లాలు
(బ్లాక్‌హోల్స్)
చిమ్మచీకటిలో ఆకాశపుదారులు
వేలాది వత్సరాల చీకటి మార్గాలు
ఖగోళ దర్శనాలు
గుప్పెట్లో మర్మాలు
మనసుల అంతరంగాలు
వెలిగించేవి తోకచుక్కలుగా నిలిచేది
సంయమన విజ్ఞానపు వీచికలై నిలిచేది -
మెరుపు
ఆచరణలో సిద్ధాంతాలుగా
ఆలోచనలు ప్రయోగాలుగా
మేధస్సు విజ్ఞాన ఫలాలుగా
మానవాళికి సుఖసంతోషాలుగా
మెదడు కొత్త పుంతలుగా
నిరంతరం శోధించేది...వెలిగేది...మెలిగేది-
‘మెరుపు’
కరువు కాటకాలు
ప్రకృతి వైపరీత్యాలు
వరదలు, భీభత్సాలు
మతవ్ఢ్యౌలు- కులపోరాటాలు
జాతుల అంతరాలు- యుద్ధాలు,
ప్రాణనష్టాలు
ఎన్నింటినో ఎదిరించి నిల్వగలిగేది
మనసుకు సంజీవనిగా నిలిచేది - ‘మెరుపు
ఓదార్పు, ఆలంబనల కారకాలె ‘మెరుపు’
తలచిన కోరికలు
మరచిన అంతరాలు
పరచిన వెండివెనె్నలు
తరిగిన దూరాలు
వలచిన ప్రియురాలు
కలిసిన స్నేహాలు
విదగదులలో ఆనందం కలిగించేది
ఆత్మీయతానురాగాలు పంచేది - ‘మెరుపు’
చేసిన వాగ్ధానాలు
పోయిన రుణాలు
అందిన అదృష్టాలు
చిక్కిన పదవులు
దక్కిన గెలుపులు
చివరంటా నిలిచిన నమ్మకాలు
మనుషులగా నిలబెట్టేది - ‘మెరుపు’
చదివిన చదువుకు సార్థకత
కోరిన జీతం - తీరిన కష్టాలు
పోరిన సరిహద్దు జవానుకు
చేసిన కష్టానికి గుర్తింపుకు
అభినందన మందారాలై నిలిచేది ‘మెరుపు’
విమర్శలు దుమారాలు
అవినీతిపరుల కొమ్ముకాచటాలు
విపణివీధుల్లో చీప్‌ట్రిక్కులు
ఏకపక్ష వాదనలు, వార్తలు
మోసపు జిత్తులు - ‘్ధరను కాదని
అక్షరాలు రవ్వలుగా
నిజాలను నిర్థ్వందంగా
ఇజాలకు లొంగక
దశాబ్ధాలుగా నిలిచిన సాహితీ సౌరులుగా
విలువల వలువలుగన్న అగ్రశ్రేణి
ఆంధ్రభూమిగా
వారం వారం మెరిసేది
ఈ భూమిలో ‘మెరుపు’ (పే)గా..
లక్కరాజు శ్రీనివాసరావు
ఆర్టీసీ కాలనీ, అద్దంకి. సెల్ : 9849166951