విజయవాడ

ప్రేమంటూ తొందరపడి.. (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏమిటీ? అర్జంటుగా రాజీవ్ గాంధీ పార్క్‌కు రమ్మన్నావ్?’ అడిగింది సుమతి.
‘నేను అతనితో ఇక కలిసి వుండలేనే. వాళ్ల అక్కలు ఇద్దరూ టీచర్లు. స్కూలుకి వెళ్లే సమయంలో మా అత్తగారి దగ్గర పిల్లలను దించి వెడతారు. ఈయన ఆఫీసు నుంచి రాగానే అక్కలు వచ్చేదాకా వాళ్లతో సరదాగా గడుపుతారు. అది నాకు నచ్చలేదు. వేరుగా వెళదామంటే ఒప్పుకోరు రెండేళ్ల నుంచీ. నేనీ పిల్లల గోల భరించలేనే. అమ్మతో చెపితే ‘రేపు నీకు పుడితే ఏంచేస్తావు’ అంటుంది. నేను అసహ్యంగా ఆ పొట్టను.. ఇక అరుపులు, కేకలతో కనడం.. ఆ బాధ భరించలేకే అప్పుడే పిల్లలొద్దని అంటే ఆనంద్ ఒప్పుకున్నాడు. నేను బతికిపోయాను. ఆనంద్ మనసు మార్చలేను. అందుకే విడిపోదామనుకుంటున్నా’ అంది చిరాగ్గా.
సుజన వంక ఆశ్చర్యంగా చూసింది సుమతి. ‘దీన్ని బాగానే అర్థం చేసుకున్నాడు. మొన్న శ్యామ్‌తో ఇంటికి వచ్చినపుడు ‘ఇంకా ఆలస్యమెందుకు? పిల్లల్ని త్వరగా కంటే వాళ్ల చదువులు, పెళ్లిళ్లు, రిటైరయ్యే లోపల పూర్తి చేయొచ్చు’ అన్నాడు.
‘అసలు సుజనే నాతో ఎల్లకాలం వుంటుందని నమ్మకం లేదు. ఇంకా పిల్లలు కూడా ఎందుకు? పసిపాపలు దేవుడితో సమానం. వారిని అసహ్యించుకుంటుంది. ఆమెకు పిల్లలంటే చిరాకట. ఆమె కబుర్లు, చిర్నవ్వులు చూసి ప్రేమించా. పెళ్లి చేసుకున్నా. మా ఇంటికి వచ్చాక నవ్వడమే మానేసింది. ఎప్పుడూ చిటపటలాడుతూ ఆఫీసు నుంచి రాగానే గదిలో దూరి తలుపు వేసుకుంటుంది. మేము త్వరలోనే విడిపోతామని అనిపిస్తోంది’ అన్నాడు వేదనగా. భవిష్యత్తుని ముందుగానే ఊహించాడు. అప్పుడు వాడి మాటలకు తెల్లబోయాం’ గుర్తుచేసుకుంది సుమతి.

- చావలి సూర్యం, విజయవాడ.