సాహితి

నీకు నీవే కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపిరులూదాల్సిన తరుణం
స్పందించాల్సిన సంక్లిష్ట సమయం
శక్తి జాగృతమై
సోమరితనం దూరం చేసుకోవాల్సిన అవసరం
సృజన దీపమై వెలిగించాల్సిన కర్తవ్యం
కరువు వెక్కిరింతలో మొక్కతో సమాధానం
దినచర్య ఆరంభమే శ్రమదానం
దేశ భాగ్యరేఖల్ని మార్చే క్రమంలో
సుందర స్వప్న సాకార మార్గంలో
పులకించని పుడమి
ఆకులు పూలు తీగలుగా తొడిగి
ఆశలో
మహర్దశలో
ఇది ఎవరి సొంత ఎజెండా కాదు
వాడలో వీధిలో దారికి ఇరువైపులలో
ఆకుపచ్చ జండా ఎగరాలి..
కదలక మెదలక మొరాయిస్తున్న నైరుతి ఋతురైళ్ళు
కరువు చీడ వ్యాప్తిచెంది
అవని మెడకి బిగుస్తున్న ఉరితాళ్ళు
రైతు ఆశల్ని మింగేసి
మూలనపడ్డ నాగళ్ళు, తుప్పు పట్టిన కొడవళ్ళు
ఎక్కడ పచ్చని పందిళ్ళు? ఎక్కడ కొత్త ఆశల చిగుళ్ళు?
వెనుకబడిన ప్రాంతాన్కి ఒక ప్రణాళిక కావాలి
దారిద్ర దరిదాపుల్నుండి బంధ విముక్తానికి
చేతిలో మొక్క కావాలి
మరికివాడలు వైదొల్గి స్మార్ట్ సిటీలు ఏర్పడి
జీవన ప్రమాణాల ఉన్నతి హరితక్షేత్రం నుండే
ఆత్మవిశ్వాసంతో అడుగులేసి నాటిన మొక్కే
మహావృక్షమై విశ్వమానవ కళ్యాణాన్కి దిక్కై
ఆదర్శం పరవళ్ళెత్తాలి; భావి పళ్ళెత్తాలి
అద్భుత వ్యవస్థకు నీవే అంకురారోహణ కావాలి
ప్రయత్నం ఫలిస్తుంది
జీవనరాగం కొత్త పల్లకి అందుకొని
కృతజ్ఞతాభావంతో సుగంధాలు వెదజల్లే పూలిస్తుంది
కార్యాచరణలో మన్ననలందుకుంటూ
కీర్తి అద్వితీయంగా రాణించాలి
మేలిమి ప్రమాణంతో మారుపేరుగా నిలవాలి
జాతి భవిత వనె్నలీని ప్రక్కదేశాల ప్రశంస దక్కాలి
నీకు నీవే కరదీపిక; నీవే మార్గదర్శక-

- కోటం చంద్రశేఖర్, 9492043348