సాహితి

నిశ్శబ్ద తీరాన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సాయం సంధ్యావేళ
మన తీపి జ్ఞాపకాలను
నెమరు వేసుకుంటూ
నిశ్శబ్ద తీరాన
ఒంటరి పక్షినై...
వౌన వీణ మధుర స్మృతుల
తీగలను మీటాను!
ఇంకేముంది?
చిటపట చినుకుల్లో
మనం తడిసి ముద్దై...
ముద్దుగా పంచుకున్న
అనుభూతులు...
ఎంచక్కా ఒక్కొక్కటి
నా మనోవేదికపై...
నర్తించసాగాయి!
నా అంతరంగ వాకిట
హరివిల్లును తలపించేలా..
నువ్వు వేసిన
ప్రేమభార రంగవల్లులపై
నా మనసు చూపులు
చిక్కుకుని..
నీతో జతకట్టి
చుక్కల రెక్కలపై ఊరేగాలని
ఉవ్విళ్లూరుతూ...
ఊహా లోకాల్లో విహరిస్తున్నాయి!
కలవరింతల అలలు
జోలపాట పాడుతుంటే..
నీ హృదయ సీమపై
వాలిపోవాలని ఆరాటపడుతున్నాయి!
ఎదనిండా...
పరిచి ఉన్న నీ చిలిపి చేష్టల
తివాచీ సాక్షిగా..
నీకు ఆహ్వానం పలకాలని
ఆత్మీయంగా...
ప్రేమ గీతాన్ని ఆలపిస్తున్నాయి!

- దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544