మెదక్

పోలీసు చక్రవ్యూహంలో.. కోదండ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్ర ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య పోలీసుల చక్రబంధంలో కొనసాగింది. ఆదివారం జిల్లా సరిహద్దు వంటిమామిడికి ఉదయం 11.30 గంటలకు అమరులవీరుల స్ఫూర్తియాత్ర చేరుకోగా, రాష్ట్ర, జిల్లా జెఏసి శ్రేణులు, ఉద్యోగ సంఘాల నేతలు, ముంపు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు పోలీసుల అనుమతి రాకపోవడంతో ప్రజ్ఞాపూర్‌లోని ఏసిపి కార్యాలయం వద్ద జేఏసి నేతలు పడిగాపులు కాయగా, చివరకు వంటిమామిడి నుండి ప్రజ్ఞాపూర్‌కు నేరుగా చేరుకొని అనంతరం గజ్వేల్‌లో సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దారి పొడవునా పోలీసులు భారీ ఎత్తున మోహరించడంతో ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం కాగా, ఏసిపి నర్సింహారెడ్డి, డిఎస్పీ యాదగిరిరాజు నేతృత్వంలో జిల్లా పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు, పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ముఖ్యంగా ముంపు గ్రామాలైన బహిలింపూర్, మామిడ్యాల, తండా, వేములఘాట్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, బంజర్‌పల్లి, పల్లెపహాడ్ తదితర గ్రామాల రైతులు అమరుల స్ఫూర్తియాత్రకు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అలాగే పోలీసుల అంక్షలను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు రిమ్మనగూడ శివారులో కోదండరాంకు సంఘీభావం ప్రకటించారు. అంతేగాకుండా కాంగ్రెస్, టిడిపి, బిజెపి నేతలు పాల్గొనగా, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రజ్ఞాపూర్ వద్ద యాత్రకు మద్దతు పలికి జెఏసి శ్రేణులు, రైతులతో కలిసి గజ్వేల్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా దారిపొడవునా కోదండరాంకు ప్రజలు బ్రహ్మరథం పట్టగా, బైక్ ర్యాలీ, గొల్లకుర్మల నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గజ్వేల్‌లో కోదండరాం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, ఆయా పార్టీలు, సంఘాల నేతలు ఎల్లయ్య, సర్దార్‌ఖాన్, భూమయ్య యాదవ్, దాసరి ఏగొండ స్వామి, శ్రీనివాస్, శివకుమార్, భానుప్రసాద్, ఎక్బాల్, మనోహర్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఆహ్లాదకరంగా పేట మినీ ట్యాంక్‌బండ్
సిద్దిపేట : సిద్దిపేట కోమటిచెరువు మినీట్యాంకు లెక్ పోలీసింగ్ వ్యవస్థను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కోమటిచెరువును మినీ ట్యాంకు బండ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రజలకు ఆహ్లాదరకమైన వాతావరాణాన్ని కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మినీ ట్యాంక్ బండ్‌కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా లేక్ పోలీసింగ్ వ్యవస్థ పనిచేస్తుందన్నారు. లెక్ పోలీసులు కోమటిచెరువువద్ద ప్రత్యేక యూనిఫాంతో ట్యాంక్ బండ్ వద్ద సైకిళ్లు, మోటర్ బైక్‌లతో నిర్యంతర పెట్రోలింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. పోలీసు అధికారులు సైతం బందోబస్తు పేరిట ప్రజలకు ఇబ్బందులను గురిచేయవద్దన్నారు. తప్పు చేసిన వారికి చట్టరీత్యా తీసుకోవాలని అనవసరంగా ఎవ్వరికీ ఇబ్బందులు సృష్టించ వద్దని సూచించారు. మినీట్యాంకు బండ్ వద్ద పోకిరీ యువతకు కౌనె్సలింగ్ ఇవ్వాలని..అప్పటికీ మార్పు రాకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. లెక్ పోలీసింగ్‌లో భాగంగా జెండా ఊపి లెక్ పోలీసింగ్‌ను ప్రారంభించారు. అంతకు ముందు లెక్ పోలీసుకు ప్రత్యేక జాకెట్లు, హెల్మెట్లు, సైకిళ్లు మంత్రి హరీష్‌రావు, డిఐజీ శివశంకర్ అందచేశారు. ఈకార్యక్రమంలో సిపి శివకుమార్, సిఐలు తదితరులు పాల్గొన్నారు.

నేర నియంత్రణలో ఆధునిక పరిజ్ఞానం
సిద్దిపేట : నేరాల నియంత్రణలో పోలీసులు ఆదునిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకొని ముందుకు సాగాలని నిజమాబాద్ రేంజ్ డిఐజీ శివశంకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో రాపిక్ కాప్ విధానాన్ని మంత్రి హరీష్‌రావుతో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాపిక్ కాప్‌లో జిపిఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టం ద్వారా ప్రజలకు మరింత దగ్గరై మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందన్నారు. అకస్మాత్తుగా ఏక్కడైనా ఏదైన సంఘటనలు జరిగినప్పుడు ఆ ప్రదేశానికి పోలీసు వాహనం ఏది దగ్గర ఉందో తెలుసుకొని వారిని పంపటం జరుగుతుందన్నారు. దీంతో అతివేగంగా తక్కుల సమయంలో పోలీసులు అట్టి ప్రదేశానికి చేరుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చునన్నారు. సిద్దిపేట సిపి శివ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట కమిషనరేట్‌ను రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఆధునికమైన పోలీస్ కమాండెంట్ కంట్రోల్ రూం సెంటర్‌ను ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను అనుసందానం చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని 63 వాహనాలకు జిపిఎస్ ద్వారా కంట్రోల్ రూంకు అనుసందానం చేసినట్లు తెలిపారు. శాంతిభద్రతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాజీవ్ రహాదారితో ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు వాయిస్ కాల్స్ ద్వారా అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 850 సిసి కెమెరాల నిరంతర పర్యవేక్షణతో నేరాలను చాల వరకు అరికట్టినట్లు పేర్కొన్నారు. కమ్యూనీటి పోలీసింగ్, ప్రెండ్లీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేట కమిషనరేట్‌ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషిచేస్తానన్నారు. అంతకు ముందు పోలీస్ కమాండెంట్ కంట్రోల్ యూనిట్ ప్రారంభానికి వచ్చిన మంత్రి హరీష్‌రావుకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కమిషనరేట్ ఆవరణలో మంత్రి హరీష్‌రావు, డిఐజీ శివశంకర్‌రెడ్డి, సిపి శివకుమార్‌లు మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్లు ప్రభాకర్, బర్ల మల్లికార్జున్, ప్రవీణ్, నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

శివాభిషేకానికి పవిత్ర మంజీర జలం
మెదక్ రూరల్: గుమ్మడిదలలో శివుడిని అభిషేకించేందుకు మంజీర (గరుడగంగ) జలంను ఒడిషా, బీహార్ భక్తులు ఆదివారం తీసుకెళ్లారు. పేరూర్ సమీపంలో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న శ్రీ సరస్వతీ ఆశ్రమాలయం వద్ద పూజలు నిర్వహించి జలంను తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. ఆలయ నిర్మాత దోర్బల రాజవౌళీశర్మ, మహేశ్‌శర్మలు పూజలు నిర్వహించిన అనంతరం జలాన్ని కావడి కుండల ద్వారా పాదయాత్రగా తీసుకెళ్లారు. గుమ్మడిదల వద్ద పనిచేసే 20 మంది భక్తులు గత పదిహేను సంవత్సరాలుగా ఇక్కడి నుండి శ్రావణమాసంలో పాదయాత్రగా జలాన్ని తీసుకెళ్లి అక్కడ శివుడిని అభిషేకిస్తారు. గోశాలను సందర్శించి గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం పాదయాత్రగా వెళ్లారు.

ఏ ప్రయోజనాలకు కోదండరాం స్ఫూర్తి యాత్ర?
గజ్వేల్: తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అన్ని రంగాల్లో అభివృద్ది సాదిస్తుండగా, ప్రతిపక్షాల చేతుల్లో కీలుబొమ్మగా మారిన జేఏసి చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరాం స్పూర్తి యాత్ర ఎంతమాత్రం సహేతుకం కాదని రాష్ట్ర రహదారుల అభివృద్ది సంస్థ కార్పోరేషన్ చైర్మెన్ తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విదంగా పేద వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయడంతోపాటు కులవృత్తులను సైతం ప్రోత్సహిస్తున్న సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా కొండపోచమ్మ ప్రాజెక్టు, మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో సిద్దిపేట జిల్లాతో పాటు సమీప జిల్లాలకు సాగునీరు, తాగునీటి కష్టాలు తొలగిపోతుండ గా, గజ్వేల్ రూరేఖలే మారిపోయినట్లు తెలిపారు. అయితే అదృశ్యశక్తులతో చేతులు కలిపిన కోదండరాం ప్రజల మద్య వైషమ్యాలు పెంచుతూ అభివృద్దిని అడ్డుకుంటుండగా, ముంపు రైతులు కోరిన విదంగా పరిహారం ఇవ్వడం తోపాటు డబల్‌బెడ్‌రూం ఇండ్లు కెటాయించి స్వయంగా ఆ గ్రామాలను సిఎం కెసిఆర్ దత్తత తీసుకొని అభివృద్ది చేయడానికి ముందుకు వచ్చిన విషయం మర్చిపోవద్దని చెప్పారు. అలాగే మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందుతుండగా, మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలు జలకళలాడుతున్నట్లు పేర్కొన్నారు. రైతు పెట్టుబడి కోసం రూ. 8వేలు అందజేస్తుండగా, 24 గంటల నిరంతర విద్యుత్ అందించడడంతోపాటు గజ్వేల్ లో ఏర్పాటైన ఎడ్యుకేషన్ హబ్‌తో విద్యారంగ సమస్యల పరిష్కారానికి అవకాశం దక్కిందని అన్నారు. రాష్ట్రంలో స్వర్ణయుగం కొనసాగు తుండగా, అమరవీరుల త్యాగం వృధా కాకుండా కలలు నిజంచేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని వివరించారు.
రైతుల ఉసురు ముట్టి టిఆర్‌ఎస్ పుట్టి మునగడం ఖాయం

గజ్వేల్: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకపాలన కొనసాగుతుండగా, రైతుల ఉసురు ముట్టి టిఆర్‌ఎస్ సర్కార్ పుట్టిమునగడం ఖాయమని రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం గజ్వేల్‌లో జెఏసి చైర్మెన్ కోదండరాం చేపట్టిన అమరవీరుల స్పూర్తి యాత్రకు సంఘీభావం ప్రకటించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. అభివృద్ది చేతకాక, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలు అమలుచేయలేక, రాష్ట్రాన్ని దివాలా తీయించిన సిఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు, అరెస్టులు చేయిస్తూ వేదింపులకు పాల్పడుతుండగా, ఎంతమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకం కాదని, 2013 చట్టం ప్రకారం ముంపు బాదితులకు పరిహారం చెల్లించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ కాగా, 3 ప్రాజెక్టుల ముంపు రైతులకు వేర్వేరుగా పరిహారం అందించడంలో అంతర్యమేమిటని నిలదీశారు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు అవినీతిలో కూరుకుపోగా, కెసిఆర్ కుటుంబపాలన కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపుతున్న సిఎం నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, పేదలను వివిద రకాలుగా మభ్యపెడుతుండగా, ప్రకటించిన నోటిఫికేషన్‌లన్నీ సర్కార్ వెనక్కి తీసుకుంటుండడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెఏసి చైర్మెన్ కోదండరాం కృషితో అధికారం వెలగబెడుతున్న సిఎం కెసిఆర్ ఆయనపైనే దుమ్మెత్తి పోయడం, రైతులకు అండగా నిలిచే క్రమంలో పోలీసు అంక్షలు కొనసాగించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. పద్దతి మార్చుకోని పక్షంలో ప్రజల ఆగ్రహానికి సిఎం కెసిఆర్ కుటుంబం గురికాక తప్పదని హెచ్చరించారు.

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటానికి సంసిద్ధం
మెదక్: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు కార్మికులందరూ ఏకం కావాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ పట్టణంలోని కామ్రేడ్ రాంరాజ్ నగర్ మెదక్ టిఎన్‌జివో భవన్‌లో జరిగిన 12వ మహాసభలు జిల్లా అధ్యక్షుడు మల్లేశం అధ్యక్షన ప్రారంభమయ్యాయి. చుక్క రాములు మాట్లాడుతూ ప్రజలకు, కార్మిక వర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. తమను అధికారంలోకి తేస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి పేదల ఖాతాల్లో వేస్తామన్న ప్రధాని మోదీ ఈనాటి వరకు ఎంత డబ్బు వేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సరళీకరణ విధానాలను గత ప్రభుత్వాలకంటే వేగంగా ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలు, కార్మికవర్గం ఈ ప్రభుత్వాలపై పెట్టుకున్న ఆశలను అడిఆశలు చేశాయని విమర్శించారు. విధానం అమలలో సిఎం కెసిఆర్, ప్రధాని మోదీ దొందుదొందేనని ఎద్దేవా చేశారు. చివరకు జైళ్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. సంక్షేమ రంగాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై రైతులు కూడా రోడ్లు ఎక్కడం, సమ్మెలు చేయడం దారుణమన్నారు. కనీస వేతన చట్టం అమలు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని చుక్క రాములు ఆరోపించారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మల్లిఖార్జున్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేశం, రాజు, జిల్లా నాయకులు నర్సమ్మ, సంగమేశ్వర్, గౌరి, మహేందర్‌రెడ్డి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.